అన్వేషించండి

TS EAMCET Counselling: ముగిసిన ఎంసెట్ వెబ్ ఆప్షన్ల గడువు, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

తెలంగాణలో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి చేపట్టిన ఎంసెట్-2023 వెబ్ ఆప్షన్ల గడువు జులై 12తో ముగిసింది. మొత్తం 75,172 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు.

తెలంగాణలో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి చేపట్టిన ఎంసెట్-2023 వెబ్ ఆప్షన్ల గడువు జులై 12తో ముగిసింది. మొత్తం 75,172 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. వీరి నుంచి మొత్తం 49,42,005 ఆప్షన్లు నమోదయ్యాయి. ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా 1,109 ఆప్షన్లు నమోదు చేసినట్లు ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ వాకాటి కరుణ తెలిపారు. అభ్యర్థులకు జులై 16లోపు సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు.

తెలంగాణలో మరో 14,565 ఇంజినీరింగ్‌ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతించిన సంగతి తెలిసిందే. కొత్త సీట్లకు అనుమతి, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో జాప్యంతో ఈ మార్పులు జరిగాయి. జులై 7, 8 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. జులై 9న ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు. వెబ్ ఆప్షన్ల నమోదు గడువు జులై 12తో ముగిసింది.  

ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి జులై 16న తొలి విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయించనున్నారు. అదేవిధంగా జులై 21 నుంచి ప్రారంభంకావాల్సిన రెండోవిడత కౌన్సెలింగ్ జులై 24 నుంచి ప్రారంభంకానుంది. ఇక ఆగస్టు 2 నుంచి ప్రారంభంకావాల్సిన తుది విడత కౌన్సెలింగ్ ఆగస్టు 4 నుంచి మొదలుకానుంది. 

Counselling Website

మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..

➥ జులై 7 - జులై 8 వరకు: ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు సంబంధించి తేదీ, స‌మ‌యం ఎంచుకోవాల్సి ఉంటుంది.

➥ జులై 9: స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.

➥ జులై 9 - జులై 12: స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్తయిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్స్ (వెబ్‌ఆప్షన్స్)ఎంచుకోవాల్సి ఉంటుంది.

➥ జులై 12: ఆప్షన్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.

➥ జులై 16: సీట్ల కేటాయింపు.

➥ జులై 16 – 22: సీట్లు పొందిన విద్యార్థులు ఈ తేదీల మ‌ధ్య‌లో ట్యూష‌న్ ఫీజు చెల్లించి, వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..

➥ జులై 24 – జులై 25: ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు సంబంధించి తేదీ, స‌మ‌యం ఎంచుకోవాల్సి ఉంటుంది(ఫ‌స్ట్ ఫేజ్‌లో ఈ వివ‌రాలు నింప‌ని విద్యార్థులు మాత్రమే).

➥ జులై 23: స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌.

➥ జులై 24 – జులై 27: స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్తయిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.

➥ జులై 27: ఆప్షన్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.

➥ జులై 31: సీట్ల కేటాయింపు.

➥ జులై 31 – ఆగస్టు 2 వరకు: సీట్లు పొందిన విద్యార్థులు ట్యూష‌న్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

చివరి విడత కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..

➥ ఆగ‌స్టు 8: ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు సంబంధించి తేదీ, స‌మ‌యం ఎంచుకోవాల్సి ఉంటుంది(ఫ‌స్ట్, సెకండ్ ఫేజ్‌లో ఈ వివ‌రాలు నింప‌ని విద్యార్థులు మాత్రమే).

➥ ఆగ‌స్టు 5: స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌. 

➥ ఆగ‌స్టు 4 - ఆగ‌స్టు 6 వరకు: స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్తయిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.

➥ ఆగ‌స్టు 6: ఆప్షన్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.

➥ ఆగ‌స్టు 9: సీట్ల కేటాయింపు.

➥ ఆగ‌స్టు 9 – ఆగ‌స్టు 11: సీట్లు పొందిన విద్యార్థులు ట్యూష‌న్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

స్పాట్ ప్రవేశాలు...

స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన వివరాలను ఆగస్టు 10 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
Hyderabad Crime News: వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన TTD!
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన TTD!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
Hyderabad Crime News: వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన TTD!
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన TTD!
Driver Operator Jobs: ఏపీ ఫైర్‌ సర్వీసెస్‌లో 147 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులు.. ఈసారి మారిన రూల్స్
ఏపీ ఫైర్‌ సర్వీసెస్‌లో 147 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులు.. ఈసారి మారిన రూల్స్
SCENE Title Glimpse: 'సీన్' తెలుగు టైటిల్ టీజర్ రిలీజ్... డీఎస్పీ ప్రేమ్‌రాజ్‌గా అదరగొట్టిన సూర్య
'సీన్' తెలుగు టైటిల్ టీజర్ రిలీజ్... డీఎస్పీ ప్రేమ్‌రాజ్‌గా అదరగొట్టిన సూర్య
Melbourne Accident: ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం - విశాఖ విడిసిఎ మాజీ జాయింట్ సెక్రటరీ కుటుంబంలో తీవ్ర విషాదం.. అత్తాకోడళ్లు మృతి!
ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం - విశాఖ విడిసిఎ మాజీ జాయింట్ సెక్రటరీ కుటుంబంలో తీవ్ర విషాదం.. అత్తాకోడళ్లు మృతి!
Domestic Pay Hike: డొమెస్టిక్ మ్యాచ్ అఫీషియల్స్‌కు బీసీసీఐ  శుభవార్త.. అంపైర్ల ఫీజులు భారీగా పెంపు, కొత్త గ్రేడేషన్ సిస్టమ్ అమలు
డొమెస్టిక్ మ్యాచ్ అఫీషియల్స్‌కు BCCI శుభవార్త.. అంపైర్ల ఫీజులు భారీగా పెంపు, కొత్త గ్రేడేషన్ సిస్టమ్
Embed widget