అన్వేషించండి

EAMCET: ఎంపీసీ విద్యార్థులకు 'స్పెషల్ కౌన్సెలింగ్‌' ద్వారా ఫార్మసీ సీట్ల కేటాయింపు

సాధారణంగా ఏటా ఎంసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌లో వారికి సీట్లు కేటాయిస్తూ వస్తున్నారు. ఈసారి చివరి విడత తర్వాత ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో అవకాశం ఇచ్చేలా మార్పు చేశారు.

తెలంగాణలో రెండు విడతల ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 2తో ముగిసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 4 నుంచి చివరివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆ తర్వాత ఆగస్టు 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్‌ మొదలుకానుంది. ఈ కౌన్సెలింగ్ ద్వారా ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులు బీఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. సాధారణంగా ఏటా ఎంసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌లో వారికి సీట్లు కేటాయిస్తూ వస్తున్నారు. ఈసారి చివరి విడత తర్వాత ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో అవకాశం ఇచ్చేలా మార్పు చేశారు.

ఆగస్టు 11తో చివరి విడత ప్రక్రియ పూర్తవుతుంది.  ఆ తర్వాత ఆగస్టు 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. దీనిద్వారా బీఫార్మసీ, ఫార్మా-డి సీట్లలో 50 శాతం ఎంపీసీ విద్యార్థులకు కేటాయిస్తారు. రాష్ట్రంలో సుమారు 13 వేల ఫార్మసీ సీట్లు(కన్వీనర్, యాజమాన్య కోటా) అందుబాటులో ఉన్నాయి. కన్వీనర్‌ కోటాలో ఫార్మా కోర్సులో ఎంపీసీ విద్యార్థులు చేరాలంటే ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి.

బైపీసీ విద్యార్థులు నెలరోజులు ఆగాల్సిందే..
టీఎస్ ఎంసెట్‌లో బైపీసీ విద్యార్థులకు సెప్టెంబరు మొదటివారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 2, 3 తేదీల్లో ఎంసెట్ బైపీసీ అభ్యర్థులు నిర్ణీత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 4, 5 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నారు. సెప్టెంబరు 4 నుంచి 7 వరకు ఎంసెట్ బైపీసీ అభ్యర్థుల వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. సెప్టెంబరు 11న బీఫార్మసీ, ఫార్మ్‌డీ తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబరు 17 నుంచి ఎంసెట్ బైపీసీ తుది విడత కౌన్సెలింగ్ ఉండనుంది. సెప్టెంబరు 23న ఫార్మా, బయోటెక్నాలజీ కోర్సుల తుది విడత సీట్ల కేటాయింపు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంపీసీ విద్యార్థులు చేరిన తర్వాత మిగిలిన సీట్లన్నింటికీ కలిపి కౌన్సెలింగ్‌ జరుపుతారు. సెప్టెంబరు 24న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదలవుతాయి. 
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

చివరి విడతలోనే ఎన్‌సీసీ, క్రీడా కోటా సీట్ల కేటాయింపు..
ఎంసెట్‌ చివరి విడతలో ఎన్‌సీసీ, క్రీడా తదితర ప్రత్యేక కోటా కింద బీటెక్‌ సీట్లను కేటాయించనున్నారు. సుమారు 1,050 మంది ఎన్‌సీసీ, 80 మంది క్రీడా విభాగం కింద దరఖాస్తు చేసుకున్నారు. ఆయా విభాగాల అధికారులు ధ్రువపత్రాలను పరిశీలించి ఎంసెట్‌ ప్రవేశాల కమిటీకి ఇప్పటికే అందజేశారు. వారందరూ చివరి విడతలో వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వారికి ఆగస్టు 9న సీట్లు కేటాయిస్తారు.

ALSO READ:

ఆగస్టు 4 నుంచి ఎంసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌, పూర్తి షెడ్యూలు ఇలా
తెలంగాణలో ఎంసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ ఆగ‌స్టు 4 నుంచి ప్రారంభంకానుంది. ఆగ‌స్టు 5న సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఆగస్టు 9న విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. ఈసారి ప్రత్యేక విడత పేరిట కమిటీ నిర్ణయం మేరకు నిర్వహించనున్న మరో కౌన్సెలింగ్‌  ఆగస్టు 17న ప్రారంభం కానుంది. ఈ కౌన్సెలింగ్ కోసం ఆగస్టు 17న స్లాట్‌ బుకింగ్‌, ఆగస్టు 18న ధ్రువపత్రాల పరిశీలన, ఆగస్టు 17 నుంచి 19 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇవ్వనున్నారు. ఇక ఆగస్టు 23న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 23 నుంచి 25 వరకు నిర్ణీత ట్యూషన్ ఫీజు చెల్లించి సంబంధిత కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

టాప్ హెడ్ లైన్స్

Niti Aayog Report On Education:బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget