అన్వేషించండి

TS EAMCET Toppers: తెలంగాణ ఎంసెట్ అగ్రిక‌ల్చర్, మెడిసిన్ టాప్-10 ర్యాంక‌ర్లు వీరే!

అగ్రికల్చర్‌ & మెడిసిన్‌ కేటగిరీలోనూ టాప్‌-5 ర్యాంకుల్లో నలుగురు ఏపీకి చెందిన వాళ్లే ఉండటం గమనార్హం. ఈ విభాగంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బూరుగుపల్లి సత్య రాజ జశ్వంత్‌ ఇందులో టాపర్‌గా నిలిచాడు.

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. కూక‌ట్‌ప‌ల్లిలోని జేఎన్‌టీయూ క్యాంప‌స్‌లోని గోల్డెన్ జూబ్లీ సెమినార్ హాల్‌లో గురువారం (మే 25) ఉదయం 9.45 గంటలకు ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఎంసెట్ ఫలితాల్లో మొత్తంగా 83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో ఇంజినీరింగ్‌లో 80 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగంలో 86 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌లో బాలురు 79 శాతం, బాలికలు 82 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక అగ్రికల్చర్‌ &  ఫార్మసీ విభాగంలో 84 శాతం బాలురు, 87 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు.

ఎంసెట్‌ ఇంజినీరింగ్ పరీక్షకు 1,95,275 మంది హాజరుకాగా.. అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ పరీక్షకు 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో అగ్రికల్చర్ & ఫార్మా విభాగంలో 91,935 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం 1,57,879 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 

ఇంజినీరింగ్ ఎంసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అగ్రి & ఫార్మసీ ఇంజినీరింగ్ ఫలితాల కోసం క్లిక్ చేయండి

అగ్రికల్చర్‌ & మెడిసిన్‌ కేటగిరీలోనూ టాప్‌-10 ర్యాంకుల్లో ఏడుగురు ఏపీకి చెందిన వాళ్లే ఉండటం గమనార్హం. ఈ విభాగంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బూరుగుపల్లి సత్య రాజ జశ్వంత్‌ ఇందులో టాపర్‌గా నిలిచాడు. రెండో స్థానంలో చీరాలకు చెందిన వెంటక తేజ రెండో ర్యాంకులో, రంగారెడ్డి జిల్లాకు చెందిన లక్ష్మీ పసుపులేటి మూడో ర్యాంకులో, గుంటూరుకు చెందిన కార్తీకేయ రెడ్డి నాలుగో ర్యాంకు, శ్రీకాకుళానికి చెందిన వరుణ్ చక్రవర్తి 5వ స్థానంలో నిలిచారు. టాప్-10లో  తెలంగాణకు చెందిన వారు ముగ్గురే ఉండటం ఆశ్చర్యపరుస్తోంది. 

అగ్రిక‌ల్చర్, మెడిక‌ల్ టాప్ టెన్ ర్యాంక‌ర్లు..

1వ ర్యాంకు – బూరుగుప‌ల్లి స‌త్య రాజ జ‌శ్వంత్ (తూర్పు గోదావరి)

2వ ర్యాంకు – నశిక వెంక‌ట తేజ‌ (చీరాల‌)

3వ ర్యాంకు – స‌ఫ‌ల్ ల‌క్ష్మీ ప‌సుపులేటి (రంగారెడ్డి)

4వ ర్యాంకు – దుర్గంపూడి కార్తీకేయ రెడ్డి (గుంటూరు)

5వ ర్యాంకు – బోర వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి (శ్రీకాకుళం)

6వ ర్యాంకు – దేవ‌గుడి గురు శ‌శిధ‌ర్ రెడ్డి (హైద‌రాబాద్)

7వ ర్యాంకు – వంగీపురం హ‌ర్షిల్ సాయి (నెల్లూరు)

8వ ర్యాంకు – ద‌ద్దనాల సాయి చిద్విలాస్ రెడ్డి (గుంటూరు)

9వ ర్యాంకు – గంధ‌మ‌నేని గిరి వ‌ర్షిత‌ (అనంత‌పురం)

10వ ర్యాంకు – కోళ్లబ‌త్తుల ప్రీతం సిద్ధార్థ్ (హైద‌రాబాద్)

అగ్రికల్చర్, ఫార్మా స్ట్రీమ్ వివరాలు..

పరీక్షలకు దరఖాస్తు చేసిన తెలంగాణ విద్యార్థులు  94,589
పరీక్షలకు దరఖాస్తు చేసిన ఏపీ విద్యార్థులు  20,743
పరీక్షకు హాజరైన విద్యార్థులు  1,01,544
ఉత్తీర్ణత సాధించినవారు  91,935 
ఉత్తీర్ణత శాతం  86%
బాలుర ఉత్తీర్ణత శాతం  84%
బాలికల ఉత్తీర్ణత శాతం  87%

మే 10, 11 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ స్ట్రీమ్‌ పరీక్ష; మే 12 నుంచి 14 వరకు ఆరు విడతల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవలే ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్‌లను విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు తాజాగా ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఎంసెట్‌ ఇంజినీరింగ్ పరీక్షకు 1,95,275 మంది హాజరుకాగా.. అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ పరీక్షకు 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 21 జోన్లలో ఎంసెట్ పరీక్ష నిర్వహించారు. వీటిలో తెలంగాణలో 16 జోన్లు, ఏపీలో 5 జోన్లు ఏర్పాటు చేశారు. మొత్తం 137 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. వీటిలో తెలంగాణలో 104 కేంద్రాలు, ఏపీలో 33 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.

Related Articles:

➥ తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో 83 శాతం ఉత్తీర్ణత నమోదు!

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి!

టాప్ హెడ్ లైన్స్

JNVST 2027 Registration: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఇదే చివరి అవకాశం! ఫారం నింపడానికి నేడే లాస్ట్‌ డేట్! 
నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఇదే చివరి అవకాశం! ఫారం నింపడానికి నేడే లాస్ట్‌ డేట్! 
NMMSS Scholarship 2026-27 : NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Embed widget