అన్వేషించండి

AP EdCET 2026 Results: ఏపీ ఎడ్‌సెట్ 2026 ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్, రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

#APEDCET2026 ఆంధ్రప్రదేశ్ ఎడ్‌సెట్ 2026 ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం (మే 26న) విడుదల చేశారు. ఫలితాలు ఇలా చెక్ చేసుకోవాలని సూచించారు.

Andhra Pradesh EDCET Results | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎడ్‌సెట్ (AP EdCET-2026) ఫలితాలు వచ్చేశాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా మంగళవారం ఉదయం ఎడ్‌సెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఎడ్‌సెట్ పరీక్ష ఫలితాల్లో అభ్యర్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచారని మంత్రి కొనియాడారు. 99.30 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. ఏపీ ఎడ్‌సెట్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

ఈ సంవత్సరం నిర్వహించిన ఎడ్‌సెట్ 2026 పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19,880 మంది అభ్యర్థులు హాజరుకాగా, వారిలో రికార్డు స్థాయిలో 19,741 మంది అర్హత సాధించారు. దీంతో ఈ ఏడాది ఎడ్‌సెట్‌లో మునుపెన్నడూ లేని విధంగా పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దే పవిత్రమైన టీచర్ ప్రొఫెషన్ దిశగా అడుగులు వేస్తున్న విద్యార్థులు, ఈ విజయంతో మరో కీలక ముందడుగు వేశారని పేర్కొన్నారు. 

మే 8న ఎగ్జామ్ నిర్వహణ..

ఆంధ్రప్రదేశ్‌లోని బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్-2026 (EdCET-2026) ఎగ్జామ్ మే 8న నిర్వహించారు. చిత్తూరు జిల్లాలోని ద్రావిడియన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ ప్రవేశ పరీక్ష జరిగింది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/ ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుని ఎగ్జామ్ రాశారు. ఈ పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు మ్యాథమెటిక్స్, బయాలజీ, ఫిజికల్ సైన్స్ అభ్యర్థులకు నిర్వహించారు. ఇక రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు సోషల్ స్టడీస్, ఇంగ్లిష్ అభ్యర్థుల కోసం నిర్వహించారు.

Also Read: JEE Advanced Answer Key: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు విద్యార్థులకు ఛాన్స్ 

ఏపీ ఎడ్‌సెట్ అంటే ఏమిటి?
ఏపీ ఎడ్‌సెట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ శిక్షణ కోర్సైన బీఈడీ (B.Ed - Bachelor of Education), బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) లలో ప్రవేశాల కోసం నిర్వహించే రాష్ట్ర స్థాయి ఎంట్రన్స్ టెస్ట్. ఏపీ ఉన్నత విద్యామండలి (APSCHE) ఆదేశాల మేరకు ప్రతి ఏటా ఏదో ఒక ప్రముఖ యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కాలేజీల్లో కౌన్సిలింగ్ పద్ధతిలో సీట్లను భర్తీ చేస్తారు.

ఎడ్‌సెట్ (బీఈడీ) వల్ల కలిగే ప్రయోజనాలు
బీఈడీ పూర్తి చేయడం అనేది కేవలం ఒక డిగ్రీ సాధించడం మాత్రమే కాదు. ఉపాధ్యాయ వృత్తి (Teacher Job)లోకి అడుగుపెట్టడానికి ఇదొక అద్భుతమైన మార్గం. మీరు ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ లేదా లాంగ్వేజ్ పండిట్ వంటి టీచర్ ఉద్యోగాలు సాధించాలంటే బీఈడీ డిగ్రీ ఖచ్చితంగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టీఈటీ (TET - Teacher Eligibility Test), డీఎస్సీ పరీక్షలు రాయడానికి బీఈడీ ప్రాథమిక అర్హత.

Also Read: NEET UG 2026 Fee Refund: NEET UG 2026 అభ్యర్థులకు అలర్ట్! ఫీజు రీఫండ్ లింక్‌ యాక్టివేట్‌! ఇలా అప్లై చేసుకోండి!

ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించడం ద్వారా రాష్ట్రంలోని బెస్ట్ విద్యా సంస్థల్లో మెరిట్ సీటు లభిస్తుంది. దీనివల్ల నేరుగా మేనేజ్‌మెంట్ కోటాలో చేరే భారం తప్పి, చాలా తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉపాధ్యాయ శిక్షణను పొందవచ్చు. ఎడ్‌సెట్ కౌన్సిలింగ్ ద్వారా కన్వీనర్ కోటాలో సీటు పొందిన అర్హులైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా దీవెన/వసతి దీవెన వంటి స్కాలర్‌షిప్ సదుపాయాలు వర్తిస్తాయి.

కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగ అవకాశాలు
బీఈడీ పూర్తి చేసి, సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) అర్హత సాధిస్తే.. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు (NVs), ఆర్మీ/రైల్వే పాఠశాలల్లో అత్యుత్తమ జీతంతో కూడిన టీచర్ జాబ్స్ సొంతం చేసుకోవచ్చు. 

ప్రస్తుతం ఉన్న విద్యా నిబంధనల ప్రకారం ప్రముఖ అంతర్జాతీయ, కార్పొరేట్ పాఠశాలల్లో పనిచేయాలన్నా బీఈడీ సర్టిఫికేట్ తప్పనిసరి అయింది. బీఈడీ ఉన్న అభ్యర్థులకు ప్రైవేట్ స్కూళ్లలో కూడా ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తాయి. బీఈడీ పూర్తి చేసిన తర్వాత విద్యారంగంలో మరింత ఎదగాలనుకునే వారు ఎండ్‌ఈడీ (M.Ed) చేయవచ్చు. ఆ తర్వాత పీహెచ్‌డీ పూర్తి చేసి కాలేజీ లెక్చరర్లుగా, ప్రొఫెసర్లుగా లేదా విద్యాశాఖలో ఉన్నతాధికారులుగా స్థిరపడేందుకు మంచి అవకాశాలు ఉంటాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Embed widget