By: ABP Desam | Updated at : 06 Nov 2021 03:44 PM (IST)
students
ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ ఎంసెట్ తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ నేడు మొదలైంది. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ సీట్ల భర్తీ కోసం శనివారం, ఆదివారం సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుంది. నేడు, రేపు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి అభ్యర్థులు ఫీజు ఆన్ లైన్‌లో చెల్లించాల్సి ఉంటుందన్నారు. స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ మంగళవారం విడుదలైంది.
ఇదివరకే తొలి విడత కౌన్సెలింగ్ పూర్తికాగా, మిగిలిన సీట్లను తుది విడతలో నేటి నుంచి భర్తీ చేయనున్నారు. ఈ నెల 6, 7 తేదీలలో కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. నవంబర్ 2వ తేదీన ఇంజినీరింగ్ తుది విడత సీట్ల కేటాయింపు... తొలి విడతలో కేటాయించిన సీట్ల రద్దు కోసం కేటాయించిన గడువు నిన్నటితో ముగిసిపోయింది. ఈ నెల 8న అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ మొదలుకానుంది. 9వ తేదీ వరకు ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ఎంసెట్ కన్వీనర్ సూచించారు.
Also Read: ప్రావిడెంట్ ఫండ్స్ ఎన్ని రకాలు? ఎందులో దాచుకుంటే ఎంత డబ్బొస్తుందో
నవంబర్ 9వ తేదీ నుంచి స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభం కాగా, 9, 10న ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఆ తరువాత నవంబర్ 20వ తేదీ నుంచి స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈనెల 12-15 వరకు ఆన్‌లైన్‌లో ట్యూషన్ ఫీజు చెల్లించాలని, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. సీట్ల రద్దు చేసుకోవడానికి ఈ నెల 18 వరకు అవకాశం కల్పిస్తున్నామన్నారు.
20 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్
ఈనెల 20 నుంచి ప్రత్యేక విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. 20, 21 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకునే అభ్యర్థులకు.. నవంబర్ 24న తుది విడతగా ఇంజినీరింగ్ కాలేజీలలో సీట్లు కేటాయిస్తారు. స్పెషల్ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు నవంబర్ 24 నుంచి 26 వరకు ఆన్‌లైన్ లో ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 26 వరకు విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలని కన్వీనర్ తెలిపారు.
Also Read: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల పరీక్ష తేదీల షీట్ విడుదల...
రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం..
1. tseamcet.nic.in వెబ్‌లింక్ ఓపెన్ చేయండి
2. TS EAMCET 2021 counselling registration link లింక్ మీద క్లిక్ చేయాలి
3. టీఎస్ ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్.. డీటైల్స్‌తో లాగిన్ అవ్వాలి
4. మీకు కావాల్సిన వివరాలతో ఆప్షన్లు ఎంచుకుని ప్రాసెస్ పూర్తి చేయాలి.
5. వివరాలు ఓసారి చెక్ చేసుకోవాలి. ఆ తరువాత సబ్మిట్ చేస్తే కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ పూర్తయినట్లే.
అన్ని విడతల కౌన్సెలింగ్ తరువాత మిగిలిపోయిన సీట్లను కాలేజీ యాజమాన్యులు భర్తీ చేసుకునే అవకాశం కల్పించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను tseamcet.nic.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని సూచించారు.
AP Inter Supply Exam Date 2022: ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే
AP Academic Calendar 2022 : ఏపీ అకడమిక్ కేలండర్ విడుదల, 80 రోజులు సెలవులు, పరీక్షలు ఎప్పుడంటే?
Telangana Inter Results 2022: ఈ నెల 28న ఇంటర్ ఫలితాలు విడుదల , ప్రకటించిన తెలంగాణ ఇంటర్ బోర్డు
AP Inter Supply Exam Fee: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫీజులు చెల్లించారా, విద్యార్థులు ఎవరెంత కట్టాలో తెలుసా !
TS EAMCET 2022 : తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
Actor Prasad: చెట్టుకి ఉరేసుకొని చనిపోయిన నటుడు - కారణమేంటంటే?
Srilanka Crisis : శ్రీలంకలో పెట్రోల్ సెలవులు - ఎప్పటి వరకో తెలియదు!
Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!
PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ