నేడే నవోదయ ప్రవేశ పరీక్ష, అన్ని ఏర్పాట్లు పూర్తి! పరీక్ష వివరాలు ఇలా!
ఈ పరీక్ష ఏప్రిల్ 29న ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఫలితాలను జూన్‌లోపు విడుదల చేసే అవకాశం ఉంది.
2023-24 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు నవోదయ విద్యాలయ సమితి నిర్వహించే పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్ష హాల్‌టికెట్లను ఇప్పటికే అందుబాటులో ఉంచారు. ఏప్రిల్ 29న జరిగే ఈ పరీక్షకు జనవరి 31వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు గడువు సమీపిస్తున్న వేళ తాజాగా హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ పరీక్ష ఏప్రిల్ 29న ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఫలితాలను జూన్‌లోపు విడుదల చేసే అవకాశం ఉంది.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
పరీక్ష విధానం:
➥ మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మూడు సెక్షన్ల నుంచి 80 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌తో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాయొచ్చు పరీక్ష సమయం 2 గంటలు. నెగిటివ్ మార్కులు లేవు.
➥ సెక్షన్-1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (MAT) నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 50 మార్కులు ఉంటాయి. దీనికి ఒక గంట సమయం కేటాయించారు. ఈ సెక్షన్‌లో మొత్తం 10 విభాగాలుంటాయి. ఒక్కో దాంట్లో నాలుగేసి చొప్పున ప్రశ్నలు అడుగుతారు.
➥ సెక్షన్-2లో అరిథ్‌మెటిక్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. 30 నిమిషాల్లో ఈ సెక్షన్ పూర్తిచేయాల్సి ఉంటుంది.
➥ సెక్షన్-3 అనేది లాంగ్వేజ్ టెస్ట్. ఇందులో 20 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 30 నిమిషాలు. లాంగ్వేజ్ టెస్టులో పాసేజ్ ఇచ్చి, ప్రశ్నలకు సమాధానాలు రాయమంటారు. విద్యార్థులు పాసేజ్ అర్థం చేసుకున్నారో లేదో తెలుసుకునేలా ఈ ప్రశ్నలు వస్తాయి. ప్రతి పాసేజ్ కింద అయిదేసి ప్రశ్నల చొప్పున నాలుగు పాసేజ్‌లు ఉంటాయి.
నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
సిల్వర్ సెట్-2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. 2023-24 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'సిల్వర్ సెట్-2023' పరీక్షకు ఏప్రిల్ 7న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మే 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్షను మే 25న నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇంటర్ ఉత్తీర్ణత కలిగిన విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు దరఖాస్తుకు అర్హులు.ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. ఎంపికైన విద్యార్థులకు విద్యా బోధనతో పాటు భోజనం, వసతి అందిస్తారు. ఏపీలో పాత 13 జిల్లాలతో పాటు తెలంగాణలో ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, హైదరాబాద్‌లో పరీక్ష నిర్వహించనున్నారు.
ప్రవేశ పరీక్ష పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
జాతీయ స్థాయిలో ఒకే తరహా క్రెడిట్స్ విధానం: యూజీసీ చైర్మన్ జగదీశ్‌కుమార్
జాతీయస్థాయిలో ఒకే విద్యా విధానం ఉండాలన్న ఆలోచనకు అనుగుణంగా నేషనల్ క్రెడిట్ ఫ్రేంవర్ రూపొందించామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ మామిడాల జగదీశ్‌కుమార్ స్పష్టంచేశారు. జాతీయ విద్యావిధానం-2020కి అనుగుణంగా పాఠశాల విద్య నుంచే క్రెడిట్స్ ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలోనూ ఏకీకృత విధానాన్ని అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇదే కోవలో తాము నేషనల్ క్రెడిట్ ఫ్రేంవర్క్‌ను విడుదల చేశామని తెలిపారు. నేషనల్ స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేంవర్క్, నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేంవర్క్, నేషనల్ క్వాలిఫికేషన్ ఫ్రేంవర్క్‌లను ఏకీకృతం చేశామని వివరించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..