అన్వేషించండి

CLAT Result 2024: క్లాట్-2024 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకోండిలా

కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT)- 2024 ఫలితాలు డిసెంబరు 10న విడుదలయ్యాయి. కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ (సీఎన్ఎల్‌యూ) ఈ ఫలితాలను విడుదల చేసింది.

CLAT 2024 Results: కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (Common Law Admission Test- CLAT)- 2024 ఫలితాలు డిసెంబరు 10న విడుదలయ్యాయి. కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ (సీఎన్ఎల్‌యూ) ఈ ఫలితాలను విడుదల చేసింది. క్లాట్ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ క్లాట్ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా అడ్మిట్‌కార్డు నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేయాలి.  దేశ‌వ్యా‌ప్తంగా ఉన్న నేషనల్‌ లా యూనివర్సిటీల్లో బీఏ ఎల్‌‌ఎ‌ల్‌బీ, ఎల్‌‌ఎ‌ల్‌ఎం కోర్సుల్లో ప్రవే‌శాల కోసం డిసెంబరు 3న నిర్వహించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్ 'క్లాట్-2023' ఫైనల్ ఆన్సర్ కీని కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ డిసెంబరు 9న విడుదల చేసింది. అంతకుముందు క్లాట్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని డిసెంబరు 4న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించి తాజాగా ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేశారు. తుది కీ విడుదల చేసిన నేపథ్యంలో డిసెంబరు 10న క్లాట్ పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేశారు. 

క్లాట్-2024 స్కోరుకార్డు డౌన్‌లోడ్  ఇలా..

1. అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్ consortiumofnlus.ac.in లోకి వెళ్లాలి. 

2. క్లాట్ 2024 డిటైల్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 

3. అక్కడ లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ క్లాట్ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా అడ్మిట్‌కార్డు నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేయాలి. 

4. లాగిన్ అయ్యాక స్క్రీన్ మీద క్లాట్ 2024 స్కోర్ కార్డు కనిపిస్తుంది. 

5. ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవాలి. 

CLAT 2024 Results

CLAT 2024 Final Answer Key

క్లాట్‌లో పాల్గొనే విశ్వవిద్యాలయాలు: ఎన్‌ఎస్‌ఐయూ (బెంగళూరు), నల్సార్‌ (హైదరాబాద్), ఎన్‌ఎల్‌ఐయూ (భోపాల్), డబ్ల్యూబీఎన్‌యూజేఎస్‌ (కోల్‌కతా), ఎన్‌ఎల్‌యూ (జోధ్‌పూర్), హెచ్‌ఎన్‌ఎల్‌యూ (రాయ్‌పూర్), జీఎన్‌ఎల్‌యూ (గాంధీనగర్), ఆర్‌ఎంఎల్‌ ఎన్‌ఎల్‌యూ (లఖ్‌నవూ), ఆర్‌జీఎన్‌యూఎల్‌ (పంజాబ్), సీఎన్‌ఎల్‌యూ (పట్నా), ఎన్‌యూఏఎల్‌ఎస్‌ (కొచ్చి), ఎన్‌ఎల్‌యూవో (ఒడిశా), ఎన్‌యూఎస్‌ఆర్‌ఎల్‌ (రాంచీ), ఎన్‌ఎల్‌యూజేఏ (అసోం), డీఎస్‌ ఎన్‌ఎల్‌యూ (విశాఖపట్నం), టీఎన్‌ ఎన్‌ఎల్‌యూ (తిరుచిరాపల్లి), ఎంఎన్‌ఎల్‌యూ (ముంబయి), ఎంఎన్‌ఎల్‌యూ (నాగ్‌పుర్), ఎంఎన్‌ఎల్‌యూ (ఔరంగాబాద్‌), హెచ్‌పీఎన్‌ఎల్‌యూ (షిమ్లా), డీఎన్‌ఎల్‌యూ (జబల్‌పూర్‌), డీబీఆర్‌ఏఎన్‌ఎల్‌యూ (హరియాణా).

కోర్సులు..

➥ అండ‌ర్‌గ్రాడ్యుయేట్ (యూజీ) ప్రోగ్రామ్ (ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ)

కోర్సు వ్యవధి: 5 సంవత్సరాలు.

➥ పీజీ ప్రోగ్రామ్ (ఎల్ఎల్ఎం డిగ్రీ)

కోర్సు వ్యవధి: ఏడాది.

క్లాట్‌ పరీక్ష విధానం..

క్లాట్ యూజీ:
మొత్తం 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 120 ప్రశ్నలు అడుగుతారు. మల్టిపుల్ చాయిస్‌లో ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ఆంగ్ల భాష, కరెంట్ అఫైర్స్‌తో సహా జనరల్ నాలెడ్జ్, లీగల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ మరియు క్వాంటిటేటివ్ టెక్నిక్స్ ఐదు విభాగాలుగా విభజించారు. ఆంగ్ల భాష నుంచి 22-26 ప్రశ్నలు లేదా పేపర్‌లో దాదాపు 20 శాతం, కరెంట్ అఫైర్స్/ జనరల్ నాలెడ్జ్ నుంచి 28-32 ప్రశ్నలు లేదా పేపర్‌లో దాదాపు 25 శాతం, లీగల్ రీజనింగ్ నుంచి 28-32 ప్రశ్నలు లేదా పేపర్‌లో దాదాపు 25 శాతం, లాజికల్ రీజనింగ్ నుంచి 22-26 ప్రశ్నలు లేదా పేపర్‌లో దాదాపు 20 శాతం, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ నుంచి 10-14 ప్రశ్నలు లేదా పేపర్‌లో దాదాపు 10 శాతం ప్రశ్నలు అడుగుతారు. 

పీజీ(ఎల్‌ఎల్‌ఎం) క్లాట్‌:
✪ పీజీ(ఎల్‌ఎల్‌ఎం) క్లాట్‌ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. కాన్‌స్టిట్యూషనల్‌ లా 60 ప్రశ్నలు–60 మార్కులు, ఇతర లా సబ్జెక్టులు(కాంట్రాక్ట్, టార్ట్స్, క్రిమినల్, ఇంటర్నేషనల్‌ లా, ఎన్విరాన్‌మెంట్, లేబర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ లా, ఐపీఆర్‌ తదితర) నుంచి 60 ప్రశ్నలు–60 మార్కులకు పరీక్ష ఉంటుంది.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget