అన్వేషించండి

CLAT Answer Key: క్లాట్-2024 ఫైనల్ ఆన్సర్ 'కీ' విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

కామన్ లా అడ్మిషన్ టెస్ట్ 'క్లాట్-2023' ఆన్సర్ కీని కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ డిసెంబరు 9న విడుదల చేసింది. క్లాట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ సమాధానాలు సరిచూసుకోవచ్చు.

CLAT Answer Key: దేశ‌వ్యా‌ప్తంగా ఉన్న నేషనల్‌ లా యూనివర్సిటీల్లో బీఏ ఎల్‌‌ఎ‌ల్‌బీ, ఎల్‌‌ఎ‌ల్‌ఎం కోర్సుల్లో ప్రవే‌శాల కోసం డిసెంబరు 3న నిర్వహించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్ 'క్లాట్-2023' ఆన్సర్ కీని కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ డిసెంబరు 9న విడుదల చేసింది. క్లాట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ సమాధానాలు సరిచూసుకోవచ్చు. క్లాట్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని డిసెంబరు 4న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించి తాజాగా ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేశారు. తుది కీ విడుదల చేసిన నేపథ్యంలో డిసెంబరు 10న క్లాట్ పరీక్ష ఫలితాలను వెల్లడించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. NLUల కన్సార్టియం డిసెంబర్ 3, 2023న CLAT 2024 పరీక్షను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 139 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది.

క్లాట్-2024 ఫైనల్ ఆన్సర్ 'కీ' కోసం క్లిక్ చేయండి..

క్లాట్‌లో పాల్గొనే విశ్వవిద్యాలయాలు: ఎన్‌ఎస్‌ఐయూ (బెంగళూరు), నల్సార్‌ (హైదరాబాద్), ఎన్‌ఎల్‌ఐయూ (భోపాల్), డబ్ల్యూబీఎన్‌యూజేఎస్‌ (కోల్‌కతా), ఎన్‌ఎల్‌యూ (జోధ్‌పూర్), హెచ్‌ఎన్‌ఎల్‌యూ (రాయ్‌పూర్), జీఎన్‌ఎల్‌యూ (గాంధీనగర్), ఆర్‌ఎంఎల్‌ ఎన్‌ఎల్‌యూ (లఖ్‌నవూ), ఆర్‌జీఎన్‌యూఎల్‌ (పంజాబ్), సీఎన్‌ఎల్‌యూ (పట్నా), ఎన్‌యూఏఎల్‌ఎస్‌ (కొచ్చి), ఎన్‌ఎల్‌యూవో (ఒడిశా), ఎన్‌యూఎస్‌ఆర్‌ఎల్‌ (రాంచీ), ఎన్‌ఎల్‌యూజేఏ (అసోం), డీఎస్‌ ఎన్‌ఎల్‌యూ (విశాఖపట్నం), టీఎన్‌ ఎన్‌ఎల్‌యూ (తిరుచిరాపల్లి), ఎంఎన్‌ఎల్‌యూ (ముంబయి), ఎంఎన్‌ఎల్‌యూ (నాగ్‌పుర్), ఎంఎన్‌ఎల్‌యూ (ఔరంగాబాద్‌), హెచ్‌పీఎన్‌ఎల్‌యూ (షిమ్లా), డీఎన్‌ఎల్‌యూ (జబల్‌పూర్‌), డీబీఆర్‌ఏఎన్‌ఎల్‌యూ (హరియాణా).

కోర్సులు..

✪ అండ‌ర్‌గ్రాడ్యుయేట్ (యూజీ) ప్రోగ్రామ్ (ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ)
అర్హత‌: క‌నీసం 45 శాతం మార్కుల‌తో ఇంట‌ర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. వచ్చే ఏడాది మార్చి/ ఏప్రిల్‌లో ఇంటర్ ప‌రీక్షలు రాసేవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

కోర్సు వ్యవధి: 5 సంవత్సరాలు.

✪ పీజీ ప్రోగ్రామ్ (ఎల్ఎల్ఎం డిగ్రీ)
అర్హత‌: క‌నీసం 50 శాతం మార్కుల‌తో ఎల్ఎల్‌బీ డిగ్రీ ఉత్తీర్ణత‌. వచ్చే ఏడాది ఏప్రిల్/మేలో జరిగే లా డిగ్రీ ప‌రీక్షలు రాసేవారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

కోర్సు వ్యవధి: ఏడాది.

క్లాట్‌ పరీక్ష విధానం..

క్లాట్ యూజీ:
మొత్తం 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 120 ప్రశ్నలు అడుగుతారు. మల్టిపుల్ చాయిస్‌లో ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ఆంగ్ల భాష, కరెంట్ అఫైర్స్‌తో సహా జనరల్ నాలెడ్జ్, లీగల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ మరియు క్వాంటిటేటివ్ టెక్నిక్స్ ఐదు విభాగాలుగా విభజించారు. ఆంగ్ల భాష నుంచి 22-26 ప్రశ్నలు లేదా పేపర్‌లో దాదాపు 20 శాతం, కరెంట్ అఫైర్స్/ జనరల్ నాలెడ్జ్ నుంచి 28-32 ప్రశ్నలు లేదా పేపర్‌లో దాదాపు 25 శాతం, లీగల్ రీజనింగ్ నుంచి 28-32 ప్రశ్నలు లేదా పేపర్‌లో దాదాపు 25 శాతం, లాజికల్ రీజనింగ్ నుంచి 22-26 ప్రశ్నలు లేదా పేపర్‌లో దాదాపు 20 శాతం, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ నుంచి 10-14 ప్రశ్నలు లేదా పేపర్‌లో దాదాపు 10 శాతం ప్రశ్నలు అడుగుతారు. 

పీజీ(ఎల్‌ఎల్‌ఎం) క్లాట్‌:
✪ పీజీ(ఎల్‌ఎల్‌ఎం) క్లాట్‌ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. కాన్‌స్టిట్యూషనల్‌ లా 60 ప్రశ్నలు–60 మార్కులు, ఇతర లా సబ్జెక్టులు(కాంట్రాక్ట్, టార్ట్స్, క్రిమినల్, ఇంటర్నేషనల్‌ లా, ఎన్విరాన్‌మెంట్, లేబర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ లా, ఐపీఆర్‌ తదితర) నుంచి 60 ప్రశ్నలు–60 మార్కులకు పరీక్ష ఉంటుంది.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Ram Gopal Varma : ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన
ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన "సలార్" స్టార్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Politics: దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Ram Gopal Varma : ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన
ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన "సలార్" స్టార్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Shaktikanta Das Health: ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
Siddharth - Pushpa 2: ‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
Chinmoy Krishna Das News: బంగ్లాదేశ్‌లో మైనార్టీ హక్కుల ఉద్యమకారుడు చిన్మోయ్ కృష్ణ అరెస్టు -భగ్గుమన్న హిందువులు
బంగ్లాదేశ్‌లో మైనార్టీ హక్కుల ఉద్యమకారుడు చిన్మోయ్ కృష్ణ అరెస్టు -భగ్గుమన్న హిందువులు
RC 16 Update: బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?
బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?
Embed widget