TG ECET Counselling: తెలంగాణ ఈసెట్ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే
TGECET: తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన ఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి విడుదలచేసింది. జూన్ 14 నుంచి తొలిదశ కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది.

Telangana ECET 2025 Counselling Schedule: తెలంగాణలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాలకు పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులకు నిర్వహించిన టీఎస్ ఈసెట్-2025 కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జూన్ 11న ప్రవేశ కమిటీల సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్, ప్రవేశాల కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో షెడ్యూలును ఖరారుచేశారు. ఈమేరకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన కౌన్సెలింగ్ షెడ్యూలును ప్రకటించారు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 14 నుంచి 18 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ కోసం అవకాశం కల్పించనున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తయినవారికి జూన్ 17 నుంచి 19 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసుకున్నవారు జూన్ 17 నుంచి 21 మధ్య వెబ్ ఆప్షన్ల నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి జూన్ 25న సీట్లు కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు జూన్ 29 లోగా నిర్ణీత ఫీజు చెల్లించి, సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
ఇక జులై 11 నుంచి తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా జూలై 11 నుంచి 13 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ, జులై 14న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఇది పూర్తయినవారికి జులై 15 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. విద్యార్థులకు జులై 18న తుది దశ సీట్ల కేటాయింపు ఉండనుంది. సీట్లు పొందినవారు జులై 20 వరకు ఆన్‌లైన్‌లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. సీట్లు పొందిన వారు జూలై 22 వరకు కాలేజీల్లో రిపోర్ట్‌చేయాలి. జులై 23లోగా చేరాల్సి ఉంటుంది. ఆ తర్వాత జులై 22న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు ప్రకటించనున్నారు. జులై 29 లోపు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది.
TG ECET - 2025 మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూలు..
➥ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్: జూన్ 14 నుంచి 18 వరకు
➥ సర్టిఫికేట్ వెరిఫికేషన్: జూన్ 17 నుంచి 19 వరకు
➥ వెబ్ ఆప్షన్ల నమోదు: జూన్ 17 నుంచి 21 వరకు
➥ సీట్ల కేటాయింపు: జూన్ 25న.
➥ సెల్ఫ్ రిపోర్టింగ్, ఫీజు చెల్లింపు: జూన్ 29 వరకు
TG ECET - 2025 రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూలు..
➥ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్: జూలై 11 నుంచి 13 వరకు
➥ సర్టిఫికేట్ వెరిఫికేషన్: జూలై 14 వరకు
➥ వెబ్ ఆప్షన్ల నమోదు: జూలై 15 వరకు
➥ సీట్ల కేటాయింపు: జూలై 18న.
➥ సెల్ఫ్ రిపోర్టింగ్, ఫీజు చెల్లింపు: జూలై 20న
⫸ స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు: జులై 22న
⫸ స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి: జులై 29లోపు.






















