PG Medical Web Options: నేటి నుంచి పీజీ మెడికల్ వెబ్ ఆఫ్షన్లు... కన్వీనర్ కోటాలో ప్రవేశాలకు నోటిఫికేషన్
పీజీ మెడికల్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ వర్శిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవాళ్టి నుంచి 27వ తేదీ వరకు వెబ్ ఆఫ్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపింది.
తెలంగాణలో పీజీ మెడికల్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం ఓ ప్రకటన జారీచేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పీజీ వైద్య విద్య సీట్లలో కన్వీనర్ కోటాలో తొలి విడత ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. 25వ తేదీ ఉదయం 8 నుంచి 27న మధ్యాహ్నం 2 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని సూచించింది. యూనివర్శిటీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లోని కన్వీనర్ కోటా సీట్లతో పాటు నిమ్స్‌లోని పీజీ సీట్లను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. కాళోజీ హైల్త్ వర్శిటీ వెబ్‌సైట్‌లో సీట్ల ఖాళీల వివరాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఇవాళ ఉదయం 8 గంటలకు వెబ్‌ఆప్షన్లు ప్రక్రియ ప్రారంభమైంది. పూర్తి వివరాలు www.knruhs.telangana.gov.inలో ఉన్నాయని తెలిపింది.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో అప్ లోడ్ చేసిన సర్టిఫికేట్‌లను సిబ్బంది తాత్కాలికంగా ధ్రువీకరించి అర్హులైన విద్యార్థుల జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ జాబితా ఆధారంగా పీజీ మెడికల్ కన్వీనర్ కోటా కింద వెబ్ ఆఫ్షన్లు పెట్టుకోవాలని విశ్వవిద్యాలయం తెలిపింది. రాష్ట్రంలోని పీజీ వైద్య విద్య కోర్సుల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులను కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ పీజీ – 2021లో అర్హత సాధించిన అభ్యర్థులు పీజీ డిప్లొమా/ డిగ్రీ సీట్లకు నమోదు చేసుకోవాలని తెలిపింది. యాజమాన్య కోటాలో సీట్ల భర్తీకి అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఈ నెల 15వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించింది. ఈ దరఖాస్తులను పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించింది. ఇలా అప్ లోడ్ చేసిన సర్టిఫికెట్లను పరిశీలించి తుది జాబితాను వెబ్ సైబ్ అందుబాటులో ఉంచింది. ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించి తుది మెరిట్ జాబితాను విడుదల చేసింది. ప్రవేశాలకు పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.in ను సంప్రదించాలని తెలిపింది.
Also Read: Saidabad: పోలీసులు చేతులెత్తేసిన కేసును ఛేదించిన సామాన్యుడు... భార్యను వెతికిపట్టుకున్న భర్త...