అన్వేషించండి

TG Inter Results 2025: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, పరీక్ష ఫలితాలు వచ్చేస్తున్నాయ్ - రిజల్ట్స్ ఎప్పుడంటే?

TGBIE: తెలంగాణలో ఇంటర్ వార్షికల పరీక్షల ఫలితాలను ఏఫ్రిల్ 22న ప్రకటించనున్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.

Telangana Inter Results 2025: తెలంగాణలో ఇంటర్ వార్షికల పరీక్షల ఫలితాలను ఏఫ్రిల్ 22న ప్రకటించనున్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఏబీపీ దేశం వెబ్‌సైట్‌లోనూ ఫలితాలను చూసుకోవచ్చు. రాష్ట్రంలో మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించగా... పరీక్షలు పూర్తయిన నెలరోజుల్లోపే ఫలితాలను వెల్లడించనుండటం విశేషం. ఏపీలో ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 12న వెల్లడించిన సంగతి తెలిసిందే. 

 తెలంగాణలో ఇంటర్ ఫలితాల్లో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా ఇంటర్మీడియట్ బోర్డు జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో భాగంగా జవాబుపత్రాల మూల్యాంకనంలో ఈసారి ముందస్తు పునఃపరిశీలన చేసింది. సాధారణంగా ఇంటర్ ఫలితాలు వెలువడిన తర్వాత మార్కులు సరిగా రాలేదని, లెక్చరర్లు చేసిన తప్పిదం వల్లే తాము ఫెయిల్‌ అయ్యామని విద్యార్థులు ఆరోపిస్తుంటారు. ఈ నేపథ్యంలో 35 మార్కులు రాని విద్యార్థులకు సంబంధించి జవాబుపత్రాలను చీఫ్‌ ఎగ్జామినర్, సబ్జెక్టు నిపుణులతో క్షుణ్నంగా పునఃపరిశీలన చేయించనున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. దీంతో విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఉంటుందని వారంటున్నారు. ఏప్రిల్‌ 10 నాటికి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తికాగా.. ఫలితాలను ఏప్రిల్‌ 22న వెల్లడించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకెండియర్ కలిపి మొత్తం 9 లక్షల 96వేల 971 మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాశారు. వీరందరి అన్ని సబ్జెక్టులు కలిపి సుమారు 60 లక్షల సమాధాన పత్రాలను మూల్యాంకనం పూర్తిచేసిన ఇంటర్ బోర్డు.. ఫలితాల వెల్లడికి సిద్దమవుతోంది. వేసవి సెలవుల తర్వాత జూన్ 2 నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభంకానున్నాయి.

తెలంగాణలో ఈసారి కూడా పాతవిధానంలోనే ఇంటర్‌ ప్రవేశాలు కల్పించనున్నారు. రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీల్లో ప్రవేశాలకు వచ్చే విద్యాసంవత్సరం (2025-26) నుంచి ఆన్‌లైన్‌ విధానం అమలు చేయాలని విద్యాశాఖ భావించిన సంగతి తెలిసిందే. అయితే ఆన్‌లైన్‌ విధానం అమలు చేయాలంటే ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలకు గ్రేడింగ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక్కో కళాశాలకు ఫీజు నిర్ణయించాల్సి ఉంటుంది. ఆ దిశగా ఇప్పటివరకు ఎలాంటి కసరత్తు జరగలేదు. దీంతో అది కష్టమని ఇంటర్‌బోర్డు నిర్ణయానికి వచ్చింది. 

ఒకవేళ ప్రభుత్వం ఫీజులు నిర్ణయించినా తాము జేఈఈ, ఎప్‌సెట్, నీట్‌ తదితర పోటీపరీక్షలకు కూడా శిక్షణ ఇస్తామని, హాస్టళ్లు ఉన్నాయని, ఫీజులను ఎలా నిర్ణయించారంటూ కళాశాలలు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఇంటర్‌బోర్డు.. వచ్చే విద్యా సంవత్సరానికి పాత విధానమే కొనసాగించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ధ్రువీకరించారు.

తెలంగాణలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు ఏప్రిల్ 3న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. మే 4 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆలస్య రుసుంతో జూన్ 8 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును బోర్డు కల్పించింది.

టాప్ హెడ్ లైన్స్

How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget