Telangana Inter Supplementary Results 2025: తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్టు సప్లిమెంటరీ ఫలితాలు ఎలా చూడాలి?
Telangana Inter Supplementary Results 2025: తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్టు సప్లిమెంటరీ ఫలితాలు విడుదలకానున్నాయి. దీనికి సంబంధించిన డైరెక్ట్ లింక్, ఇతర వివరాలు ఇక్కడ చూడొచ్చు.

Telangana Inter Supplementary Results 2025: తెలంగాణ ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేస్తున్నాయి. కాసేపట్లో ఈ ఫలితాలను విడుదల చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఇవాళ(14 జూన్ 2025) మధ్యాహ్నం 11:34లకు ఈ ఫలితాలు విడుదల చేయబోతున్నట్టు ముందు ప్రకటించారు. కానీ కాస్త ఆలస్యంగా ప్రక్రియ ప్రారంభించారు. మార్చి ఏప్రిల్‌లో నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోయిన విద్యార్థులకు మరో ఛాన్స్ ఇస్తూ మేలో పరీక్షలు నిర్వహించారు. వాటిని మూల్యాంకనం చేసి ఆ ఫలితాలను ఇవాళ విడుదల చేయనున్నారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరానికి సంబంధించిన విద్యార్థుల లితాలను tsbie.cgg.gov.in, results.cgg.gov.in వెబ్‌సైట్‌లలో ఉంచుతారు.
గతంలో నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులు కాలేకపోయిన విద్యార్థులతోపాటు, వచ్చిన మార్కులతో సంతృప్తి చెందిన విద్యార్థులు కూడా పరీక్షలు రాశారు. మొత్తంగా ఈ సప్లిమెంటరీ పరీక్షలను రెండున్నర లక్షల మంది విద్యార్థులు రాశారు. వీరిలో మొదటి ఇంటర్ పరీక్షలను లక్షా 20వేల మంది రాస్తే రెండో సంవత్సరం పరీక్షలను లక్షా 30వేల మంది రాశారు.
ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?
తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు విడుదల చేసిన సప్లిమెంటరీ ఫలితాలను మూడు అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకునే వీలు కల్పించారు. అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.inకు వెళ్లండి. అక్కడ TS Inter Supplementary Results 2025 అనే కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఆ తర్వాత అక్కడ మీ హాల్‌టికెట్ నెంబర్ అడుగుతుంది. దాన్ని టైప్ చేసి పెట్టండి. తర్వాత పుట్టి తేదీ కూడా అడుగుతుంది. దాన్ని ఎంటర్ చేయండి. దాని కింద సబ్‌మెంట్ బటన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. వెంటనే మీ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
ఫలితాలు చూసిన తర్వాత మార్క్‌షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒరిజినల్ మార్క్ షీట్ వచ్చే వరకు ఇదే మీకు అన్నింటికీ యూజ్ అవుతుంది. డిగ్రీలో చేరాలన్నా, లేదా ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలన్నా ఇదే ముఖ్యం. అందుకే మార్క్ షీట్‌ను డౌన్‌లోడ్ చేసి పెట్టుకొని ఒకట్రెండు ప్రింట్‌లు కూడా తీసి పెట్టుకోండి.
గత ఏప్రిల్‌లో రెగ్యులర్‌గా ఇంటర్ ఫలితాలను అధికారులు విడుదల చేశారు. అందులో ఉత్తీర్ణత సాధించలేకపోయిన వాళ్లకు మళ్లీ ఫీజు తీసుకొని మే 22 నుంచి 30 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం ఐదున్నర వరకు రెండు షిప్టుల్లో చేపట్టారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి షిప్టులో, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఈ పరీక్షలు చేపట్టారు.
సప్లిమెంటరీలో కూడా ఉత్తీర్ణత సాధించలేకపోతే ఏం చేయాలి?
సప్లిమెంటరీ ఫలితాల్లో కూడా ఉత్తీర్ణత సాధించలేని వాళ్లు మరో ఏడాది ఎదురు చూడక తప్పదు. బాగా రాశాం అనే నమ్మకం ఉన్న వాళ్లు ఫీజు చెల్లించి రీవాల్యుయేషన్‌కు లేదా రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. రీవాల్యుయేషన్‌కు ఆరు వందల రూపాయలు, రీ కౌటింగ్‌కు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 20 నుంచి జూన్ 25వరకు ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు. tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో నేరుగా దరఖాస్తు చేయవచ్చు.
విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త వేదకను ఏర్పాటు చేసింది. టీఎస్ ఎడ్యుకేషన్ హబ్ పేరుతో కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్ తీసుకొచ్చింది. ఇక్కడ రిజల్ట్స్, సిలబస్, మోడల్ పేపర్లు ఇలా చాలా అంశాలు అప్‌లోడ్ చేస్తున్నారు. అంటే ఓ విధంగా ఆన్‌లైన్ లెర్నింగ్‌కు ఎంతగానో ఉపయోగపడనుంది. దీన్ని రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు.





















