ఇంటర్ ఫలితాల విడుదలకు ఏర్పాట్లు పూర్తి- 11 గంటలకు రిలీజ్
TS INTER RESULTS: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఎగ్జామ్స్ మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 9.47 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
TS INTER RESULTS: ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వెల్లడికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 11 గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలకానున్నాయి. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఈసారి కూడా ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నారు.
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఎగ్జామ్స్ మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 9.47 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాల కోసం telugu.abplive.com , tsbie.cgg.gov.in , http://results.cgg.gov.in వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచుతామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిట్టల్ తెలిపారు.
గతేడాది ఫలితాలు చూస్తే...
ఇంటర్ రెండో సంవత్సరంలో 4లక్షల63వేల 370 మంది రాస్తే... 2లక్షల 95వేల 949 మంది పాస్ అయ్యారు. మొత్తంగా 67.82 శాతం పాస్ అయ్యారు. ఇందులో ఏ గ్రేడ్‌లో లక్షా 59వేల 422 మంది పాస్ అయితే... B గ్రేడ్‌లో 82వేల 481 మంది పాస్ అయ్యారు.
ఇంటర్ సెకండ్ ఇయర్‌లో అమ్మాయిల పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను 2లక్షల 16వేల 389 మంది రాస్తే... లక్షా 64 వేల 172 మంది పాస్ అయ్యారు. 75.86శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలను 2 లక్షల 19వేల 981 మంది రాస్తే... లక్షా 31వేల 277 మంది ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిల పాస్ పర్సంటేజ్ 60 శాతం. రెండో సంవత్సరంలో మేడ్చ్‌ల్ 78 శాతం పాస్‌తో మొదటి స్థానంలో ఉంటే.. 77శాతం పాస్ పర్సంటేజ్‌తో ఆసిఫాబాద్ రెండో స్థానంలో నిలిచింది.
ఫస్టియర్‌లో 2,94,378 మంది పాస్..
తెలంగాణలో గతేడాది మొత్తం 9,28,262 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 5,90,327 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 4,64,892 మంది పరీక్షలు రాస్తే 2,94,378 మంది పాస్ అయ్యారు. అందులో ఏ గ్రేడ్ 1,93,925 మంది, 63,501 మంది బీ గ్రేడ్ సాధించారు.
తెలంగాణ ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, ఈ ఏడాది సెలవులివే!
తెలంగాణలో జూనియర్ కళాశాలల అకడమిక్ క్యాలెండర్‌ని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలు జూన్ 1న ప్రారంభమవుతాయిన బోర్డు అధికారులు ఏప్రిల్ 1న వెల్లడించారు. జూన్ 1 నుంచే తరగతులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక విద్యా క్యాలెండర్ బోర్డు వెలువరించింది.
ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం.. జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు, 2024, జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. కాగా, ఇంటర్మీడియట్ విద్య కోసం ఈ ఏడాది మొత్తం 227 పని దినాలు ఉంటాయని బోర్డు తెలిపింది. ఇక ఫిబ్రవరి రెండో వారం నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. థియరీ పరీక్షలను మార్చి మొదటివారం నుంచి నిర్వహిస్తారు. ఏప్రిల్ 1 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు.
తెలంగాణ ఇంటర్ అకడమిక్ ఇయర్ (2023-24) క్యాలెండర్ ..
➥ జూనియర్ కాలేజీల పునఃప్రారంభం: 01.06.2023.
➥ మొదటి, ద్వితీయ సంవత్సరాల ఇంటర్మీడియట్ తరగతులు: 01.06.2023.
➥ దసరా సెలవులు: 19.10.2023 - 25.10.2023.
➥ దసరా సెలవుల తర్వాత పునఃప్రారంభం: 26.10.2023.
➥ అర్ధ సంవత్సర పరీక్షలు: 20.11.2023 - 25.11.2023.
➥ సంక్రాంతి సెలవులు: 13.01.2024 - 16.01.2024.
➥ సంక్రాంతి సెలవుల తర్వాత పునఃప్రారంభం: 17.01.2024.
➥ ప్రీ-ఫైనల్ పరీక్షలు: 22.01.2024 - 29.01.2024.
➥ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు: 2024 ఫిబ్రవరి రెండవ వారం నుండి.
➥ ఇంటర్ థియరీ పరీక్షలు: 2024 మార్చి మొదటి వారం నుండి.
➥ వేసవి సెలవులు: 01.04.2024 - 31.05.2024.
➥ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు: 2024 మే చివరి వారంలో
➥ 2024-25 విద్యా సంవత్సరానికి జూనియర్ కళాశాలల పునఃప్రారంభ తేదీ: 01.06.2024.