By: ABP Desam | Updated at : 28 Dec 2022 11:18 AM (IST)
Edited By: omeprakash
బీఎస్సీ పారామెడికల్ కోర్సులు
తెలంగాణలో తొలిసారిగా వైద్యవిద్య అనుబంధ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. దీంతో మొత్తం 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 12 రకాల అనుబంధ కోర్సులు, 860 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు మంగళవారం (డిసెంబరు 27న) వైద్యారోగ్య శాఖ అధికారిక ఉత్తర్వులు (జీవో నెంబర్ 156) జారీచేసింది. 2022-23 వైద్య విద్య సంవత్సరం నుంచే గాంధీ, ఉస్మానియా, కాకతీయ, రిమ్స్, నిజామాబాద్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మొత్తంగా 860 పారామెడికల్ సీట్లను అందుబాటులోకి తీసుకురానుంది.
రాష్ట్ర ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలతో పాటు, వైద్య విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రం ఏర్పాటు తర్వాత 12 మెడికల్ కాలేజీలు ప్రారంభించగా, మరో రెండేళ్లలో జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసేలా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య విద్య అనుబంధ సేవలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బీఎస్సీ అర్హతతో 12 రకాల కోర్సులు..
బీఎస్సీ మొదటి ఏడాదిలో 12 వైద్య విద్య అనుబంధ కోర్సులు ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ కోర్సుల్లో చేరే విద్యార్థులు మూడేళ్ల కోర్సుతో పాటు ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. మొత్తంగా నాలుగేళ్ల కాల వ్యవధిలో బీఎస్సీ పారామెడికల్ విద్యను పూర్తి చేయాలి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రతి సంవత్సరం 860 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. తద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మరింత మెరుగవనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.
విభాాగాలు: అనస్తీషియా, ఆపరేషన్ థియేటర్, రెస్పిరేటరీ థెరపీ, రీనల్ డయాలసిస్, న్యూరోసైన్స్, క్రిటికల్ కేర్, రేడియాలజీ అండ్ ఇమేజింగ్, ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ, మెడికల్ రికార్డ్స్ సైన్సెస్, ఆప్తోమెట్రిక్, కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కోర్సులు ఇందులో ఉన్నాయి. త్వరలో న్యూక్లియర్ మెడిసిన్, రేడియోథెరపీ టెక్నాలజీ కోర్సులను కూడా ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈ రెండు ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి పరిధిలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
:: Also Read::
ఎంబీబీఎస్ బి-కేటగిరీలో స్థానికులకే ప్రాధాన్యం - 8,78,280 ర్యాంకు వచ్చినా ఎంబీబీఎస్ సీటు!
తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలతో వైద్యవిద్య అభ్యసించాలనుకునే విద్యార్థుల కల నెరవేరుతోంది. మరోవైపు స్థానిక రిజర్వేషన్, గిరిజన విద్యార్థుల రిజర్వేషన్ శాతం పెంపు వంటి పరిణామాలు కూడా ఎంబీబీఎస్ బి-కేటగిరీ సీట్ల సంఖ్య పెరిగేందుకు ఉపకరిస్తున్నాయి. రాష్ట్రంలో 2021-22 వైద్యవిద్యా సంవత్సరంలో మైనారిటీ వైద్య కళాశాలలు కలుపుకొని బి-కేటగిరీలో 1214 సీట్లు ఉండేవి. వీటికి రిజర్వేషన్ విధానం లేకపోవడం వల్ల తెలంగాణ విద్యార్థులకు 495 సీట్లు మాత్రమే దక్కాయి. ఆ ఏడాది గరిష్ఠంగా 2,71,272 ర్యాంకు వచ్చిన స్థానిక విద్యార్థికి ఎంబీబీఎస్ సీటు లభించింది. మిగతా 719 సీట్లలో నాన్ లోకల్ కింద ఇతర రాష్ట్రాల విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ నివేదిక విడుదల చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో భారీగా పెరిగిన మెడికల్ సీట్లు, దేశంలో ఆరో స్థానం!
తెలంగాణ ప్రభుత్వం వైద్య విద్యకు ప్రాధాన్యమివ్వడంతో గత ఎనిమిదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లో సీట్ల సంఖ్య భారీగా పెరిగింది. ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను కొత్తగా నెలకొల్పడం, మెడికల్ సీట్ల పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించడంతో అత్యధిక ఎంబీబీఎస్ సీట్లున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది. సీట్ల సంఖ్య 6,040 కి చేరింది. తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5,485 ఎంబీబీఎస్ సీట్లతో ఏడో స్థానంలో నిలిచింది.
రాష్ట్రాలవారీగా మెడికల్ సీట్ల వివరాల కోసం క్లిక్ చేయండి..
Jee Main 2023 answer key: జేఈఈ మెయిన్ సెషన్ 1 ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
TSWRES Inter Admissions: తెలంగాణ గురుకుల సైనిక పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్! పరీక్ష ఎప్పుడంటే?
TSWRES Admissions: గురుకుల సైనిక పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్! ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?
TTWREIS Admissions: తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి! వివరాలివే!
Union Budget 2023: బడ్జెట్లో విద్యారంగానికి అధిక ప్రాధాన్యత, భారీగా విద్యా సంస్థల ఏర్పాటు! బడ్జెట్ కేటాయింపు ఇలా!
YSRCP Tensions : వైఎస్ఆర్సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?
TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
KCR Political strategy : గవర్నర్తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?