NMMSE Answer Key: ఎన్ఎంఎంఎస్ ప్రిలిమినరీ ‘కీ’ విడుదల, 22 వరకు అభ్యంతరాలకు అవకాశం
NMMSE Answer Key: తెలంగాణలో నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ పరీక్ష (NMMSE)కు సంబంధించిన ప్రిలిమినరీ ‘కీ’ని రాష్ట్ర ఎగ్జామినేషన్ డైరెక్టరేట్ డిసెంబరు 14న విడుదల చేసింది.
NMMS Exam 2023 Preliminary Answer Key: తెలంగాణలో నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ పరీక్ష (NMMSE)కు సంబంధించిన ప్రిలిమినరీ ‘కీ’ని రాష్ట్ర ఎగ్జామినేషన్ డైరెక్టరేట్ డిసెంబరు 14న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు డిసెంబరు 22 వరకు అభ్యంతరాలు తెలపవచ్చు. అభ్యర్థులు dirgovexams.tg@gmail.com ఈమెయిల్ ద్వారా అభ్యంతరాలు పంపాలని సూచించింది. 8వ తరగతి విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌నకు డిసెంబరు 10న ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
దేశంలోని పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు ఆర్థిక చేయూత కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్ఎంఎంఎస్) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12,000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు వీరికి స్కాలర్‌షిప్ అందుతుంది.
NMMS 2023 Preliminary Answer Key Link
వివరాలు..
* నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ 2023-24
అర్హతలు..
✦ ఏడో తరగతిలో కనీసం 55 శాతం మార్కులు పొందిన విద్యార్థులు పరీక్ష రాయడానికి అర్హులు. తుది ఎంపిక సమయం నాటికి ఎనిమిదో తరగతిలో 55 శాతం మార్కులు పొంది ఉండాలి.
✦ ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలల్లో రెగ్యులర్ విధానంలో చదవుతూ ఉండాలి.
✦ కుటుంబ వార్షికాదాయం రూ.3,50,000 మించకూడదు.
దరఖాస్తు విధానం: రాష్ట్ర ప్రభుత్వ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో విద్యార్థుల దరఖాస్తులను ఆయా స్కూళ్లు సమర్పించాలి. అనంతరం ఆ దరఖాస్తుల ప్రింటవుట్లను, ధ్రువీకరణ పత్రాలను డీఈవోలకు పంపాలి. ప్రతి విద్యార్థికి పరీక్ష ఫీజు రూ.100 (ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులకు రూ.50) ఎస్‌బీఐ చలానా రూపంలో జతచేయాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా స్కాలర్‌షిప్ కోసం విద్యార్థులను ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష విధానం: ఈ స్కాలర్‌షిప్స్‌కు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రాష్ట్రస్థాయిలో రెండు పేపర్ల రాత పరీక్షలు నిర్వహిస్తారు.
✦ మెంటల్ ఎబిలిటీ టెస్ట్(మ్యాట్): ఈ పేపర్‌లో వెర్బల్, నాన్ వెర్బల్ రీజనింగ్, క్రిటికల్ థింకింగ్ నుంచి 90ప్రశ్నలు–90 మార్కులకు ఉంటాయి.
✦ స్కాలాస్టిక్ అప్టిట్యూడ్ టెస్ట్(శాట్): ఈ పేపర్‌లోనూ 90ప్రశ్నలు –90 మార్కులకు ఉంటాయి. ఏడు, ఎనిమిది తరగతుల స్థాయిలో బోధించిన సైన్స్, సోషల్, మ్యాథ్స్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
పరీక్ష సమయం: ఒక్కో పేపరుకు 90 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు.
కనీస అర్హత మార్కులు: రెండు పరీక్ష(మ్యాట్, శాట్)ల్లో సగటున జనరల్ అభ్యర్థులకు 40 శాతం (36) మార్కులు, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు 32 శాతం (29)మార్కులను కనీస అర్హత మార్కులుగా నిర్ణయించారు. జిల్లాను యూనిట్‌గా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు కేటగిరీల వారీగా ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులకు రిజర్వేషన్ ప్రకారం అర్హత పొందిన విద్యార్థుల మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.
స్కాలర్‌షిప్ మొత్తం: ఎంపికైనవారికి నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తిచేసే వరకు ఉపకారవేతనం లభిస్తుంది.