By: ABP Desam | Updated at : 24 Sep 2021 05:53 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలు(ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణలో రెండేళ్ల బీఈడీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి శుక్రవారం ఫలితాలు విడుదల చేశారు. ఎడ్‌సెట్‌లో 33,683 (98.53 శాతం) మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు ఆయన తెలిపారు. ఉత్తీర్ణులైన వారిలో 25,983 మంది అమ్మాయిలు ఉన్నారని వెల్లడించారు. ఎడ్‌సెట్‌లో నల్గొండ జిల్లాకు చెందిన తిమ్మిశెట్టి మహేందర్ మొదటి ర్యాంకు సాధించగా, మంచిర్యాల విద్యార్థిని ఎ.ప్రత్యూషకు రెండో ర్యాంకు, పట్నాకు చెందిన రిషికేశ్ కుమార్ శర్మకు మూడో ర్యాంకు సాధించారని లింబాద్రి తెలిపారు.
మొత్తం 18 వేల సీట్లు
ఈ పరీక్షకు 34 వేల 185 మంది హాజరయ్యారని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. వారిలో 33,683 మంది విద్యార్థులు అర్హత సంపాదించారని స్పష్టం చేశారు. ఎడ్ సెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం https://edcet.tsche.ac.in/ అనే వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 206 కాలేజీల్లో 18 వేల సీట్లు ఉన్నట్లు ఆయన ప్రకటించారు.
ర్యాంకుల ఆధారంగా
రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశం పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం టీఎస్ ఎడ్‌సెట్ అర్హత సాధించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తిలో రాణించేందుకు బీఈడీ తప్పనిసరి. నూతన విద్యావిధానానికి అనుగుణంగా టీఎస్ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షలో పలు మార్పులు చేశారు. ఆగస్టు 24, 25న టీఎస్ ఎడ్ సెట్ 2021 ఆన్‌లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించారు. మొత్తం 34,185 మంది హాజరయ్యారు. అభ్యర్థులు పొందిన ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.
Also Read: చరిత్ర అంటే ఇష్టమా? ఇది కూడా బెస్ట్ కెరీర్ ఆప్షనే.. మీకేం కావాలో ఎంచుకోండి..
Also Read: ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ షెడ్యూల్ విడుదల.. ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చేశాయ్..
Also Read: విద్యార్థులకు అదిరిపోయే అవకాశం.. చదువు కోసం స్కాలర్‌షిప్స్.. ఈ నెల 30 లోగా దరఖాస్తు చేసుకోండి..
TTWREIS Admissions: తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి! వివరాలివే!
సంపన్నులు చదువుకునే స్కూళ్లలో కూడా ఇటువంటి ట్యాబ్ లు లేవు, విద్యార్థులకు క్లాస్ తీసుకున్న ప్రవీణ్ ప్రకాష్
Indian Navy B.Tech Course: నేవీలో ఉచితంగా 'ఇంజినీరింగ్' విద్య, ఆపై ఉన్నత హోదా ఉద్యోగం!
KNRUHS: ఎండీ హోమియో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు, చివరితేది ఎప్పుడంటే?
TS Teachers Transfers: నేడు ఉపాధ్యాయ ఖాళీలు, సీనియారిటీ జాబితా వెల్లడి!
TS Assembly : ప్రసంగంలో మార్పులు సూచించిన గవర్నర్ - వాస్తవ అంశాలే ఉంటాయన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి !
ఉగాది నుంచి విశాఖలో సీఎం బస! ఈ బడ్జెట్ సమావేశాల్లోనే మళ్లీ మూడు రాజధానుల బిల్లు?
KTR in Karimnagar: కేటీఆర్ కాన్వాయ్కి అడ్డుగా వెళ్లిన విద్యార్థులు, కరీంనగర్లో ఉద్రిక్తత
Ram - Boyapati Movie : రామ్ - బోయపాటి శ్రీను సినిమాలో విలన్గా యంగ్ హీరో