(Source: ECI/ABP News/ABP Majha)
TS ICET Results 2021: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల.. 90.09 శాతం మంది పాస్.. టాప్ 15 ర్యాంకర్లు వీరే..
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ 2021 (Integrated Common Entrance Test) ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. ఫలితాల కోసం https://icet.tsche.ac.in/ను సంప్రదించవచ్చు.
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ 2021 (Integrated Common Entrance Test - ICET) ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి టీఎస్ ఐసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఐసెట్ ఫలితాల్లో 90.09 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు లింబాద్రి తెలిపారు. ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన లోకేశ్‌కు ఫస్ట్ ర్యాంకు (155.36 మార్కులు) ... సాయి తనూజ (155.003 మార్కులు) రెండో ర్యాంకు సాధించారు. మొదటి పది ర్యాంకుల్లో తెలంగాణకు చెందిన విద్యార్థులు 9 మంది ఉన్నారు. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన విద్యార్థి ఆనంద్‌పాల్ 5వ ర్యాంకు సాధించాడు. ఐసెట్ ఫలితాల కోసం https://icet.tsche.ac.in/, http://www.manabadi.co.in/ వెబ్‌సైట్లను సంప్రదించవచ్చు. కాగా.. టీఎస్ ఐసెట్ పరీక్షలను ఆగస్టు 19, 20 తేదీల్లో మూడు సెషన్లలో నిర్వహించారు. తెలంగాణ, ఏపీ నుంచి 56,962 మంది పరీక్షకు హాజరయ్యారు.
టాప్ 10 ర్యాంకర్ల వివరాలు..
1. ఆర్. లోకేష్ (155.36 మార్కులు, హైదరాబాద్)
2. పమిడి సాయి తనూజ (155.003 మార్కులు, హైదరాబాద్)
3. ఆర్. నవీనాక్షంత (151.22 మార్కులు, మేడ్చల్ మల్కాజిగిరి)
4. తుమ్మ రాజశేఖర చక్రవర్తి (151.12 మార్కులు, మేడిపల్లి)
5. పొట్ల ఆనంద్ పాల్ (149.94 మార్కులు, గుడ్లవల్లేరు)
6. బెల్లి శ్రీ చరిత (147.52 మార్కులు, నల్గొండ)
7. అనెం అఖిల్ (146.20 మార్కులు, మేడ్చల్ మల్కాజిగిరి)
8. కల్వకుంట్ల మిథిలేష్ (145.61 మార్కులు, జగిత్యాల)
9. కాత్యాయన నిఖితైశ్వర్య (144.30 మార్కులు, హైదరాబాద్)
10. అరుణ్ కుమార్ బత్తుల (143.88 మార్కులు, వరంగల్ అర్బన్)
11. శ్రీరామోజు స్ఫూర్తి (143.24 మార్కులు, కేవీ రంగారెడ్డి)
12. మహ్మద్ నదీమ్ ఖాన్ (141.09 మార్కులు, కరీంనగర్)
13. అరవ లక్ష్మి జాహ్నవి (140.99 మార్కులు, తూర్పు గోదావరి జిల్లా)
14. పొద్దటూరి ఆశిష్ (140.97 మార్కులు, హైదరాబాద్)
15. కామిశెట్టి సూర్య తేజ (140.09 మార్కులు, భద్రాద్రి కొత్తగూడెం)
Also Read: Career Guidance: చరిత్ర అంటే ఇష్టమా? ఇది కూడా బెస్ట్ కెరీర్ ఆప్షనే.. మీకేం కావాలో ఎంచుకోండి..