అన్వేషించండి

10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు

Telangana News: తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శుక్రవారం విడుదల చేశారు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 18 వరకూ ఫీజు చెల్లించవచ్చు.

Telangana 10th Exams Fee Payment Dates: తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది టెన్త్ చదువుతున్న విద్యార్థులతో పాటు బ్యాకలాగ్ ఉన్న విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 18వ తేదీ వరకూ ఫీజు చెల్లించేందుకు గడువు ఇచ్చారు. ఆ తర్వాత రూ.50 ఆలస్య రుసుంతో డిసెంబర్ 2 వరకూ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 12 వరకూ, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 21వ తేదీ వరకూ ఫీజు చెల్లించుకోవచ్చు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని పేపర్లకు కలిపి రూ.125 ఫీజు చెల్లించాలి. 3 పేపర్ల లోపు ఉంటే రూ.110, 3 పేపర్ల కంటే ఎక్కువ బ్యాకలాగ్స్ ఉన్న విద్యార్థులు రూ.125 చెల్లించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఒకేషనల్ విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాలి. పూర్తి వివరాలకు https://www.bse.telangana.gov.in లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

ఏపీ టెన్త్ పరీక్షల ఫీజు షెడ్యూల్

అటు, ఏపీ (AP) టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల చేస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 11వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. రూ.50 ఆలస్య రుసుముతో ఈ నెల 12 నుంచి 18 వరకూ ఫీజు చెల్లించవచ్చు. రూ.200 అదనపు రుసుముతో 19 నుంచి 25వ తేదీ వరకూ.. రూ.500 ఆలస్య రుసుముతో ఈ నెల 26 నుంచి 30 వరకూ పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉంది. ఈ ఫీజును ఆన్ లైన్ విధానంలోనే చెల్లించాల్సి ఉంటుందని.. పాఠశాల లాగిన్ ద్వారా ప్రధానోపాధ్యాయులు కూడా చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://bse.ap.gov.in చూడాలని సూచించారు.

Also Read: Congress Vs BRS: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాల పేలుళ్లు - ఆటంబాబులు పేలుతాయా?

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
Bigg Boss Season 10 Today October 29th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి వర్షిణి, రాంప్రసాద్ సేఫ్! ఎల్లో కేటగిరిలో వంశీ! ముగిసిన హోటల్‌ టాస్క్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి వర్షిణి, రాంప్రసాద్ సేఫ్! ఎల్లో కేటగిరిలో వంశీ! ముగిసిన హోటల్‌ టాస్క్!
శుక్రుడు ఉదయించాడు: అక్టోబర్ 30 నుంచి ఈ 5 రాశులవారికి స్వర్ణయుగం!
శుక్రుడు ఉదయించాడు: అక్టోబర్ 30 నుంచి ఈ 5 రాశులవారికి స్వర్ణయుగం!
Gill Temple Gadget: నుదిటిపై వింత పరికరంతో ప్రాక్టీస్ చేసిన శుభ్‌మన్ గిల్.. జొమాటో సీఈవో కొత్త హెల్త్ వేరబుల్ చూసి కెప్టెన్ ఫిదా, వైరల్ అవుతున్న క్రేజీ ఫీచర్లు
నుదిటిపై వింత పరికరంతో ప్రాక్టీస్ చేసిన శుభ్‌మన్ గిల్.. జొమాటో సీఈవో కొత్త హెల్త్ వేరబుల్ చూసి కెప్టెన్ ఫిదా, వైరల్ అవుతున్న క్రేజీ ఫీచర్లు
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Embed widget