SSC CHSL 2021 Vacancies: సీహెచ్‌ఎస్‌ఎల్-2021 ఖాళీల వివరాలు వెల్లడి, ఎన్ని పోస్టులంటే?
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామినేషన్ (సీజీఎల్‌ఈ)-2021 'టైర్-1' ఫలితాలను ఆగస్టు 4న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామినేషన్ -2021 ఖాళీల వివరాలను స్టాఫ్ సెలక్షన్ ఆగస్టు 5న విడుదల చేసింది. దీనిప్రకారం మొత్తం 6,072 పోస్టులను భర్తీచేయనుంది. వీటిలో జనరల్-2924, ఓబీసీ-1049, ఎస్సీ-990, ఎస్టీ-469, ఈడబ్ల్యూఎస్-640 పోస్టులు ఉన్నట్లు ప్రకటించింది. వీటిల్లో ఎక్స్-సర్వీస్‌మెన్-577, దివ్యాంగులకు-36, OH-58, HH-64, VH-58 పోస్టులు కేటాయించారు.
Tentative vacancies for the Combined Higher Secondary (10+2) Level Examination, 2021
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామినేషన్ (సీజీఎల్‌ఈ)-2021 'టైర్-1' ఫలితాలను ఆగస్టు 4న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. టైర్-1 పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు విభాగాల వారీగా కటాఫ్ మార్కుల వివరాలను కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అందుబాటులో ఉంచింది.
TIER-1 Result: LIST OF CANDIDATES IN ROLLNO ORDER QUALIFIED FOR APPEARING IN TIER-II
Cut-off Marks
ఈ ఏడాది మే 24 నుంచి జూన్ 10 వరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 'కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామినేషన్ -2021' టైర్-1 పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించింది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల్లో మొత్తం 54,092 మంది టైర్-2 పరీక్షకు ఎంపికయ్యారు. వీరికి సెప్టెంబరు 18న 'టైర్-2 (డిస్క్రిప్టివ్)' పరీక్ష నిర్వహించనున్నారు. టైర్-2 పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి టైర్-3 స్కిల్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు. టైర్-3లో అర్హత సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ కార్యాలయాలకు కేటాయిస్తారు.
ఈ పరీక్షల ద్వారా కేంద్రప్రభుత్వంలోని వివిధ సర్వీసుల్లో లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)/జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ (JSA), పోస్టల్ అసిస్టెంట్ (PA)/సార్టింగ్ అసిస్టెంట్ (SA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) పోస్టులకు 12వ తరగతి పాస్ కావాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పోస్టులకు సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌తో 12వ తరగతి పాస్ కావాలి.
ఎస్‌ఎస్‌సీ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) ఎగ్జామ్ 2021
1) ఎల్‌డీసీ/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
2) పోస్టల్ అసిస్టెంట్/ సార్టింగ్ అసిస్టెంట్
3) డేటా ఎంట్రీ ఆపరేటర్
అర్హతలు: ఎస్ఎస్‌సీ సీహెచ్ఎస్ఎల్‌కు దరఖాస్తు చేసుకోవడానికి 12వ తరగతి పాసైన అభ్యర్థులు అర్హులు. పరీక్షలో నమోదు చేసుకోవడానికి అభ్యర్థులు తప్పనిసరిగా 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (టైర్ -1, టైర్-2), స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్ (టైర్-3) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఇతరులకు రూ.100.. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 1, 2022
దరఖాస్తులకు చివరితేది: మార్చి 7, 2022
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరితేది: మార్చి 8, 2022
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (టైర్-1): మే 24 - జూన్ 10, 2022
టైర్-2 పరీక్ష (డిస్క్రిప్టివ్ పరీక్ష): సెప్టెంబరు 18న (ఆగస్టు 5న ప్రకటించారు)
టైర్-2 పరీక్ష (స్కిల్ టెస్ట్): తర్వాత ప్రకటిస్తారు.