Vishwa Vishwani Institutions: సెప్టెంబర్ 8న విశ్వ విశ్వని ఇన్‌స్టిట్యూషన్స్‌లో స్పాట్ అడ్మిషన్స్, మెరిట్ స్కాలర్‌షిప్స్ సైతం
Spot Admissions at VVISM In Hyderabad | హైదరాబాద్‌లోని విశ్వ విశ్వని ఇన్‌స్టిట్యూషన్స్ సెప్టెంబర్ 8వ తేదీన స్పాట్ అడ్మిషన్స్ ఆఫర్ చేసింది. మెరిట్ స్కాలర్‌షిప్స్ ఉంటాయని తెలిపారు.

Vishwa Vishwani Institutions Spot Admissions | హైదరాబాద్: నగరంలోని విశ్వ విశ్వని ఇన్‌స్టిట్యూషన్స్(VVISM)లో స్పాట్ అడ్మిషన్స్ – 2025 సెప్టెంబర్ 8న నిర్వహించనున్నారు. విద్యార్థులు ఎటువంటి అప్లికేషన్ అవసరం లేకుండా నేరుగా హాజరై అడ్మిషన్ పొందవచ్చు అని సంస్థ తెలిపింది. మెరిట్ ఆధారిత స్కాలర్‌షిప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయని విశ్వ విశ్వని ఇన్‌స్టిట్యూషన్స్ యాజమాన్యం వెల్లడించింది. BiPC, MPC, CEC, HEC విద్యార్థులను మెడిసిన్, ఇంజనీరింగ్ కోర్సులకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రత్యామ్నాయ కోర్సులు భవిష్యత్తులో మెరుగైన కెరీర్ అవకాశాలు అందిస్తాయి.
అదనంగా అందుబాటులో ఉన్న కోర్సులు ఇవే
BS కంప్యూటర్ సైన్స్ (Artificial Intelligence & Machine Learning)
సైకాలజీ + కంప్యూటర్ సైన్స్ (AI & ML)
అదనంగా, BBA, PGDM వంటి మేనేజ్‌మెంట్ కోర్సుల్లో కూడా ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి.
సెప్టెంబర్ 8న అడ్మిషన్స్ ప్రారంభం..
ఆసక్తి ఉన్న విద్యార్థులుగానీ, వారి తల్లిదండ్రులుగానీ హైదరాబాద్‌లోని విశ్వ విశ్వని బిజినెస్ స్కూల్‌లో సెప్టెంబర్ 8న నేరుగా సంప్రదించవచ్చు. ఉదయం 10 గంటల నుంచి అడ్మిషన్లు ప్రారంభం అవుతాయని, ఏదైనా సందేహాలు ఉన్నా, సమాచారం కావాలన్నా 9849247333, 9948341333 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

27 ఏళ్ల విశ్వ విశ్వని విశిష్ట చరిత్ర కలిగిన ఈ సంస్థ యూజీసీ అటానమస్ (UGC Autonomous) హోదా, NAAC A+ గుర్తింపుతో నాణ్యమైన ఎడ్యుకేషన్‌ను, గ్లోబల్ స్టాండర్డ్స్‌కి సరితూగే కోర్సులను విద్యార్థులకు అందిస్తోంది. తెలుగు రాష్ట్రాలలోని ప్రతిష్ఠాత్మక బిజినెస్ స్కూల్‌లో సీటు పొందే అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు అని విశ్వ విశ్వని సంస్థ సూచించింది.





















