అన్వేషించండి

JoSAA Counseling 2025: టాప్ ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్ల కేటాయింపు ప్రారంభం- పూర్తి షెడ్యూల్ ఇదే

JoSAA Counseling 2025: JoSAA 2025 కౌన్సెలింగ్ కోసం మొదటి అలాట్‌మెంట్ జాబితా జూన్ 14, 2025న ఉదయం 10:00 గంటలకు విడుదలైంది.

JoSAA Counseling 2025: జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ (JoSAA) ద్వారా JEE Main, JEE Advanced 2025ల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సీట్లు కేటాయింపు ఇవాళ ప్రారంభమైంది. మొదటి అలాట్‌మెంట్ జాబితా ఇవాళ (జూన్ 14, 2025) ఉదయం 10:00 గంటలకు విడుదలైంది. ఈ జాబితాను josaa.nic.in వెబ్‌సైట్‌లో చూసుకోవాలంటే, విద్యార్థులు తమ JEE మెయిన్ లేదా JEE అడ్వాన్స్ అప్లికేషన్ నంబర్ పాస్‌వర్డ్‌ను ఉపయోగించి లాగిన్ కావాలి. ఈ జాబితాలో విద్యార్థులకు ఎక్కడ సీటు అలాట్ అయిందో, ఆ సీటును ఆమోదించడం ఎలా చేయాలో వివరాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న టాప్ ఇంజినీరింగ్ కాలేజీల్లో చదువుకునేందుకు లక్షల మంది పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఈ కాలేజీల్లో  ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్ గడువు ముగిసింది. josaa.nic.in ద్వారా జూన్ 12న సాయంత్రం 5 గంటలకు వరకు రిజిస్ట్రేషన్ కోసం గడువు ఇచ్చారు.   

JoSAA కౌన్సెలింగ్ ద్వారా అర్హత కలిగిన అభ్యర్థులు భారతదేశంలోని 127 ప్రముఖ సంస్థల్లో ప్రవేశం పొందేందుకు వీలు కలుగుతుంది. ఇందులో 23 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు (IITs), 31 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు (NITs), IIEST షిబ్‌పూ ర్, 26 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు (IIITs), 46 ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక సంస్థలు (GFTIs) ఉన్నాయి. 62,853 BTech సీట్లలో IITల్లో 18,160 సీట్లు, NITల్లో 24,525 సీట్లు, IIITల్లో 9,940 సీట్లు, GFTIsలో 10,228 సీట్లు ఉన్నాయి.

అభ్యర్థులు రిజిస్ట్రేషన్ విండోలో ఇష్టమైన కోర్స్,  సంస్థలను ఎంపిక చేసుకున్నారు. వాటి ఆధారంగా వచ్చిన ర్యాంకులు ఆధారంగా సీట్ల కేటాయింపు ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఒక్కో అభ్యర్థి ఎక్కువ ప్రాధాన్యతలు ఇచ్చారు. ఈ ప్రధాన్యాలు ఇవ్వని అభ్యర్థులకు  సిస్టమ్ చివరిగా సేవ్ చేసిన ప్రాధాన్యతలను ఆటోమేటిక్‌గా లాక్ చేస్తుంది. లాక్ తర్వాత మార్పులు చేయాలంటే, కేవలం అభ్యర్థి అభ్యర్థనపై మాత్రమే సాధ్యమవుతుంది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఇమెయిల్‌కు పంపిన OTP ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మార్పులు చేయడానికి వీలుకలుగుతుంది. 

కౌన్సెలింగ్ ప్రక్రియలో ఆరు రౌండ్లలో సీట్ కేటాయింపు జరుగుతుంది. మొదటి రౌండ్ ఫలితాలు జూన్ 14న ఉదయం 10 గంటలకు ప్రకటించారు. IITలకు చివరి రౌండ్ ఫలితాలు జూలై 16న ప్రకటిస్తారు. మొత్తం ప్రక్రియ జులై 22న ముగుస్తుంది. సీట్ ఆమోదించిన తర్వాత ఐదో రౌండ్ సీట్ ఆమోద ప్రక్రియ ముగిసే లోపు ఏమైనా మార్పులు చేర్పులు కావాలంటే చేసుకోవచ్చు.  

రిజిస్ట్రేషన్ కాలంలో అభ్యర్థులకు రెండు మాక్ సీట్ అలోకేషన్లు కూడా ఇస్తారు. ఇవి అభ్యర్థులు తమ ప్రాధాన్యతల ఆధారంగా ఎలాంటి ఫలితాలు వస్తాయో అంచనా వేయడానికి సహాయపడతాయి.

లాగిన్ కోసం, JEE Main 2025 అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ని యూజ్ చేసుకోవాలి. విదేశీయులు,  OCI/PIO అభ్యర్థులు తమ JEE Advanced 2025 డైరెక్ట్ రిజిస్ట్రేషన్ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అవ్వాలి.

JoSAA 2025 కౌన్సెలింగ్ ముఖ్యమైన తేదీలు:

జూన్ 14: మొదటి రౌండ్ సీట్ కేటాయింపు (ఉదయం 10 గంటలకు)

జూన్ 21: రెండవ రౌండ్ ఫలితాలు (సాయంత్రం 5 గంటలకు)

జూన్ 28: మూడవ రౌండ్ ఫలితాలు (సాయంత్రం 5 గంటలకు)

జూలై 4: నాల్గవ రౌండ్ ఫలితాలు (సాయంత్రం 5 గంటలకు)

జూలై 10: ఐదవ రౌండ్ ఫలితాలు (సాయంత్రం 5 గంటలకు)

జూలై 16: IITలకు చివరి రౌండ్ ఫలితాలు (సాయంత్రం 5 గంటలకు)

మరిన్ని అప్‌డేట్స్ కోసం అభ్యర్థులు JoSAA వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా చూసుకోవాలి.

టాప్ హెడ్ లైన్స్

NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
CPR Full Form in Telugu: సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Task Force for Exam Reforms: పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్: ప్రధాని మోదీ
పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్: ప్రధాని మోదీ

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget