SCERT: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్, వీరికి ఇక నో‘హోం వర్క్’
రాష్ట్రంలోని పాఠశాలల్లో ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు హోం వర్క్ ఇవ్వొద్దని ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలో పాఠశాలలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన,శిక్షణ మండలి (SCERT) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు హోం వర్క్ ఇవ్వొద్దని ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా 3,4,5 తరగతులకు చెందిన విద్యార్థులు తమ వర్క్‌బుక్‌లను పాఠశాలలోనే ఉంచాలని తెలిపింది. విద్యార్థుల పుస్తకాల బ్యాగు బరువు తగ్గించేందుకు ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఇక 6-10 తరగతులకు చెందిన విద్యార్థులకు హోంవర్క్ భారంగా మారుతోంది. దీనివల్ల విద్యార్థులపై ఒత్తిడికి గురవుతున్నారని.. ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్టుకు హోంవర్క్ ఇవ్వాలని SCERT సూచించింది. ప్రాథమిక విద్యార్థులకు మ్యాథమెటిక్స్ కోసం ఒక నోట్‌బుక్, మిగిలిన అన్ని సబ్జెక్టులకు కలిపి ఒక నోట్‌బుక్ ఉండాలని తెలిపింది. ఇక ఉన్నత పాఠశాలల్లో లాంగ్ నోట్‌బుక్‌ను రెండు సబ్జెక్టులకు కేటాయించుకునేలా విద్యార్థులకు అనుమతి ఇవ్వాలని సూచించింది.
ఉపాధ్యాయులు తరగతిలో బోధించే సబ్జెక్టులను విద్యార్థులకు చెప్పి, ఆ రోజుకు అవసరమైన పుస్తకాలను మాత్రమే తీసుకువచ్చేలా చూడాలని పేర్కొంది. పాఠ్యపుస్తకాలను సెమిస్టర్ వారీగా మాత్రమే తీసుకెళ్లేలా చూడాలని, వాటిని బడిలో భద్రపరుచుకునే సదుపాయం కల్పించాలని సూచించింది. 1,2 తరగతులకు స్కూల్ బ్యాగు బరువు 1.5 కిలోలు, 3-5 తరగతులకు 2.5కిలోలు; 6, 7 తరగతులకు 4 కిలోలు; 8, 9 తరగతులకు 4.5 కిలోలు, పదోతరగతికి 5 కిలోల బరువు ఉండాలని SCERT వెల్లడించింది.
Related Articles: బీసీ విద్యార్థులకు గుడ్‌న్యూస్, పీఎం యశస్వీ స్కాలర్‌షిప్..
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పాఠశాల విద్యార్థుల చదువుల కోసం ఆర్థికంగా ఆసరా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రంట్ ఇండియా (YASASVI) ప్రవేశ పరీక్ష-2022 నిర్వహణకు గాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న పాఠశాల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. యశస్వి అనేది ఇతర వెనుకబడిన తరగతి (ఓబీసీ), ఆర్థికంగా వెనుకబడిన తరగతి (ఈబీసీ), డీ-నోటిఫైడ్, నోమాడిక్ & సెమీ నోమాడిక్ ట్రైబ్స్ (డీఎన్‌టీ/ ఎస్ఎన్‌టీ) వర్గాలకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన స్కాలర్‌షిప్ పథకం.
అర్హతలు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read: మైనార్టీ’ ఉపకార వేతనాలకు దరఖాస్తులు
తెలంగాణలో మైనార్టీ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్, మెరిట్ ఉపకార వేతనాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ప్రీమెట్రిక్ విద్యార్థులు సెప్టెంబరు 30లోగా.. ఇంటర్, ఆ పైన చదివే పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు అక్టోబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మైనారిటీ విద్యార్థులు 2022-23 విద్యా సంవత్సరానికి నేషనల్ మైనార్టీస్ ఫ్రీ మెట్రిక్ (1వ తరగతి నుంచి 10వ తరగతి), పోస్ట్ మెట్రిక్ విభాగంలో ఇంటర్మీడియట్ నుంచి పీహెచ్‌డీ గవర్నమెంట్ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ కాలేజీలు, ఐ.టి.ఐ లేదా ఐ.టి.సి టెక్నికల్ కోర్సులు, గ్రాడ్యూయేట్, పోస్ట్ గ్రాడ్యూయేట్, టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న మైనారిటీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ స్కీమ్
-2008లో ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ పథకం
-కేంద్రం 75 శాతం నిధులను సమకూరుస్తుంది.
-కేంద్రపాలిత ప్రాంతాలకు 100 శాతం నిధులను ఇస్తుంది.
పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ స్కీమ్
-2007లో ప్రారంభించారు.
-100 శాతం కేంద్రమే నిధులను సమకూరుస్తుంది.
-2007లో మెరిట్ కమ్ మీన్స్ బేస్డ్ స్కాలర్‌షిప్‌ని ప్రారంభించారు. ఈ పథకం టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులను ఉద్దేశించింది.
Website