By: ABP Desam | Updated at : 30 Sep 2023 05:45 PM (IST)
Edited By: omeprakash
రేపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాల - న్యాక్ ఏ+' గుర్తింపు
బాపట్ల జిల్లా రేపల్లెలోని శ్రీ అనగాని భగవంతరావు(ఏబీఆర్) ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ ఏ+ గుర్తింపు లభించింది. ఈ మేరకు నేషనల్ అసెస్‌మెంట్, అక్రిడిటేషన్ కౌన్సిల్(న్యాక్) ఆ కళాశాల ప్రిన్సిపల్ రవిచంద్రకు సమాచారమిచ్చింది. బోధన, అభ్యసన, విశ్లేషణ, పరిశోధన, సృజనాత్మకత, మౌలిక సదుపాయాలు లాంటి వాటిని మదింపు చేసిన తర్వాత న్యాక్ గ్రేడ్లు ఇస్తుంది. 3.26-3.50 పాయింట్లు వస్తే ఏ+ గ్రేడ్ ఇస్తారు. 2015లో ఈ కళాశాలకు 'బీ' గ్రేడ్ ఉండగా.. ఇప్పుడు 3.28 పాయింట్లతో ఏ+ గుర్తింపు పొందింది.
ఎంతో పురాతనమైన ఈ కళాశాలలో 697 మంది విద్యార్థులు చదువుతుండగా.. 20 మంది అధ్యాపకులు పని చేస్తున్నారు. రాష్ట్రంలోని 165 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఇప్పటి వరకు రాజమహేంద్రవరం, విశాఖపట్నం మహిళా డిగ్రీ కళాశాలలకు న్యాక్ ఏ+ గుర్తింపు ఉండగా.. తాజాగా ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఆ గ్రేడ్ లభించింది. దీంతో రూసా వంటి వాటి నుంచి కళాశాలకు నిధులు వచ్చే అవకాశముంది. ఈ కళాశాలలో ఇండోర్ గేమ్స్, వర్మీ కంపోస్టు యూనిట్, వర్చువల్, ఈ-తరగతి గదులు, బొటానికల్ గార్డెన్, కంప్యూటర్ ల్యాబ్, భౌతిక శాస్త్రం, బయోలజీ ల్యాబ్ తదితర సదుపాయాలతో పాటు మహిళా సాధికారత, కెరీర్ మార్గదర్శకం కోసం ప్రత్యేకంగా సెల్‌లు ఏర్పాటు చేశారు.
ప్రపంచ ర్యాంకింగ్‌లో ముందు వరసలో అనంత జేఎన్‌టీయూ..
ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్‌లో అనంతపురం జేఎన్‌టీయూ ముందు వరుసలో నిలిచింది. లండన్‌కు చెందిన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనే అంతర్జాతీయ సంస్థ 2024 సంవత్సరానికిగాను సెప్టెంబర్ 27న ర్యాంకులను వెల్లడించింది. రాష్ట్రానికి చెందిన 7 విశ్వవిద్యాలయాలు టాప్ 1000లో ఉండగా.. అందులో జవహర్‌లాల్ నెహ్రూ టెక్నోలాజికల్ యూనివర్సిటీ అనంతపురం 34వ స్థానంలో నిలిచి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ప్రథమ స్థానం కైవసం చేసుకొంది.
బోధన, పరిశోధనలే ప్రామాణికం..
విశ్వవిద్యాలయంలో బోధన, పరిశోధన, అనులేఖనం, అంతర్జాతీయ దృక్పథం, పరిశ్రమ ఆధారిత కోర్సులను ప్రామాణికంగా తీసుకొని ఈ ర్యాంకులు కేటాయించారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సంఖ్య, బోధన, బోధనేతర ఉద్యోగులు వారిలో స్త్రీ, పురుష నిష్పత్తిని సైతం పరిగణించారు. విద్యార్థుల సంఖ్య 6,175 కాగా, స్త్రీ, పురుష నిష్పత్తి 41:59 ఉన్నట్లు పేర్కొన్నారు.
ALSO READ:
ఎన్ఎంఎంఎస్ దరఖాస్తుకు అక్టోబరు 13 వరకు అవకాశం
ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభగల విద్యార్థుల కోసం నిర్దేశించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్ఎంఎంఎస్) దరఖాస్తుకు అక్టోబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. డిసెంబరు 10న జరిగే పరీక్షకు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే అర్హులని, రెసిడెన్షియల్ విధానంలో చదువుతున్న వారికి అర్హత లేదని తెలిపారు. ఈసారి తొలిసారిగా ఎస్టీ రిజర్వేషన్‌ను 6 నుంచి 10 శాతానికి పెంచుతున్నామని వెల్లడించారు. దానివల్ల స్కాలర్‌షిప్‌నకు ఎంపికయ్యే ఎస్టీ అభ్యర్థుల సంఖ్య పెరుగుతుందన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలుగు యూనివర్సిటీ కోర్సుల్లో స్పాట్ ప్రవేశాలు
హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023-24 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం 'స్పాట్ అడ్మిషన్స్' నిర్వహిస్తోంది. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. లలితకళా రంగంలో ఎంపీఏ (కూచిపూడి, జానపదం, రంగస్థలం, సంగీతం), సామాజిక తదితర శాస్త్రాల విభాగంలో జ్యోతిషం, ఎంఏ (లింగ్విస్టిక్స్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో నవంబరు 25లోగా ఆయా వర్సిటీ ప్రాంగణాల్లో సంప్రదించి ప్రవేశాలు పొందవచ్చని వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు.
ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..
CBSE: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో మార్కులపై బోర్డు కీలక నిర్ణయం, ఇకపై అవి ఉండవు
LAWCET: లాసెట్ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు
CSIR UGC NET 2023: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) 2023 దరఖాస్తు గడువు పొడిగింపు - ఎప్పటివరకంటే?
JEE Main 2024: జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
AP Govt Holidays: వచ్చేఏడాది 20 సాధారణ సెలవులు, జాబితా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
Andhra Telangana Dispute : కేంద్రం అధీనంలోకి సాగర్, శ్రీశైలం డ్యాములు - ఏపీ ప్రభుత్వ దూకుడుతో సాధించిందేంటి ?
KCR On Results: హైరానా వద్దు, 3న సంబరాలు చేసుకుందాం- పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ భరోసా
Salaar - Ugramm: 'సలార్' ట్రైలర్ విడుదల తర్వాత కొత్త డౌట్స్ - ప్రశాంత్ నీల్ మోసం చేస్తున్నారా?
Chandra Babu Meeting : చంద్రబాబు రాజకీయ సమావేశాలు షురూ- తొలి భేటీలో ఏం చర్చించారంటే!
/body>