అన్వేషించండి

KNRUHS: నేటి నుంచి పీజీ యాజమాన్య కోటా రెండో విడత ప్రవేశాలు, వెబ్ ఆప్షన్లకు నేడే ఆఖరు!

ఈ ఏడాది నుంచి యాజమాన్య కోటా మొత్తం సీట్లలో 85 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులతోనే భర్తీ చేస్తారు. మిగిలిన 15 శాతం సీట్లను ఓపెన్ కేటగిరీలో అఖిల భారత స్థాయిలో అవకాశం కల్పిస్తారు.

తెలంగాణలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లోని పీజీ వైద్యవిద్య సీట్లకు యాజమాన్య కోటాలో రెండో విడత ప్రవేశాలను నవంబరు 7న ఉదయం 8 గంటల నుంచి నిర్వహించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. నవంబరు 7న రాత్రి 8 గంటల్లోగా అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని పేర్కొంది. ఈ ఏడాది నుంచి యాజమాన్య కోటా మొత్తం సీట్లలో 85 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులతోనే భర్తీ చేస్తారు. మిగిలిన 15 శాతం సీట్లను ఓపెన్ కేటగిరీలో అఖిల భారత స్థాయిలో అవకాశం కల్పిస్తారు. ఓపెన్ కేటగిరీలోనూ తెలంగాణ విద్యార్థులు పోటీ పడవచ్చని వర్సిటీ పేర్కొంది. మేనేజ్‌మెంట్ కోటా కింద సీటు పొందిన విద్యార్థులు యూనివర్సిటీ ఫీజు కింద రూ.49,600 చెల్లించాలి. ఎన్నారై విద్యార్థులైతే రూ.69,600 చెల్లించాల్సి ఉంటుంది.

వెబ్ ఆప్షన్ల నమోదు కోసం క్లిక్ చేయండి..

AVAILABLE SEATS FOR SECOND PHASE OF COUNSELING

Notification

 

Also Read:

 తెలంగాణ లాసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం, రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్ ఇదే!

తెలంగాణలో ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల‌కు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ నవంబరు 2న ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నవంబరు 1న వెబ్‌కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు న‌వంబ‌ర్ 2 నుంచి 12 వ‌ర‌కు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ధ్రవపత్రాల పరిశీలన, ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ అప్‌లోడింగ్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు కౌన్సెలింగ్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.

ఇక నవంబరు 14 నుంచి 16 వరకు స్పెషల్ కేటగిరీ(ఎన్‌సీసీ/ క్యాప్ / పీహెచ్ / స్పోర్ట్స్) అభ్యర్థులకు ఫిజికల్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ నిర్వహించనున్నారు. నవంబరు 17న రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.

జాబితాకు ఎంపికైన అభ్యర్థులు నవంబరు 18, 19 తేదీల్లో లాసెట్, పీజీఎల్ సెట్ వెబ్ ఆప్షన్లు న‌మోదు చేసుకోవాలి. నవంబరు 20న వెబ్‌ ఆప్షన్లలో సవరణకు అవకాశం కల్పించారు. వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకున్న అభ్యర్థులకు న‌వంబ‌ర్ 22న ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం సీట్లను కేటాయించ‌నున్నారు. సీట్లు పొందినవారు నవంబరు 23 నుంచి 26 వరకు సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. న‌వంబ‌ర్ 28 నుంచి ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, కౌన్సెలింగ్ పూర్తి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..

:: Also Read ::

క్రాఫ్ట్స్ & డిజైనింగ్ కోర్సుల్లో ప్రవేశాలు, ఐఐసీడీ నోటిఫికేషన్ జారీ!!
ఇండియన్  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ (ఐఐసీడీ) 2023 విద్యాసంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా బీ.డిజైన్, ఎం.డిజైన్, ఎం.వొకేషన్ కోర్సుల్లో సీట్ల భర్తీ చేయనున్నారు. కోర్సుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. డిగ్రీ కోర్సులకు ఇంటర్ అర్హత ఉండాలి. పీజీ కోర్సులకు సంబంధి విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్ధులు జనవరి 21లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

'ఫ్యాషన్' కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రారంభం- చివరితేది ఎప్పుడంటే?
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ప్రవేశాలకు నిర్దేశించిన 'NIFT-2023' రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబరు 1న ప్రారంభమైంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబరు 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.3000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1500 చెల్లిస్తే సరిపోతుంది. 
నోటిఫికేషన్, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget