Pariksha Pe Charcha: బ్యాటర్‌లా ఫోకస్ చేయాలి, కేవలం పుస్తకాలకే పరిమితం కావొద్దు - పరీక్షా పే చర్చలో విద్యార్థులకు మోదీ సలహాలు
PM Modi Pariksha Pe Charcha: పరీక్ష పే చర్చ 2025లో భాగంగా ప్రధాని మోదీ విద్యార్థులకు కీలక సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు దీపికా పదుకొణె, మేరీ కోమ్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.

Pariksha Pe Charcha : భారత ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చ(PPC 2025) కార్యక్రమంలో పాల్గొన్నారు. పరీక్షలకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒత్తిడి లేకుండా ఎగ్జామ్‌కు ఎలా ప్రిపేర్ అవ్వాలనే పలు అంశాలపై ప్రధాని, విద్యార్థులకు సలహాలు, సూచనలిచ్చారు. పరీక్ష పే చర్చ ప్రస్తుతం ఎనిమిదో ఎడిషన్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువు సద్గురు, నటులు దీపికా పదుకొనే(Deepika Padukone), విక్రాంత్ మాస్సే(Vikrant Massey), ఒలింపిక్ ఛాంపియన్ మేరీ కోమ్(Mary Kom), పారాలింపిక్ బంగారు పతక విజేత అవని లేఖరా(Avani Lekhara) వంటి ప్రముఖ వ్యక్తులు పాల్గొన్నారు. వారు తమ సూచనలను, అనుభవాలను పంచుకుంటారు. ముఖ్యంగా ఈ సంవత్సరం, పరీక్షా పె చర్చకు అద్భుతమైన స్పందన వచ్చింది. 3.30 కోట్లకు పైగా విద్యార్థులు, 20.71 లక్షల మంది ఉపాధ్యాయులు, 5.51 లక్షల మంది తల్లిదండ్రులు ఇంటరాక్టివ్ సెషన్ కోసం నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ పలు అంశాలపై చర్చించారు.
- పరీక్షల్లో సమయ వినియోగం ప్రాముఖ్యతను ప్రధానమంత్రి మోదీ నొక్కి చెప్పారు. విద్యార్థులు దీని కోసం ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, వారు ఆనందించే అంశాలపై మాత్రమే దృష్టి పెట్టడం కంటే సవాలుతో కూడిన అంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలని ఆయన సూచించారు.
- కేవలం సలహాలే కాకుండా విద్యార్థుల ప్రత్యేక బలాలను గుర్తించి, ప్రోత్సహించాలని ప్రధానమంత్రి విద్యావేత్తలకు సూచించారు. విద్యార్థులు విలువైనవారని, అర్థం చేసుకున్నారని భావించే వాతావరణాన్ని వాలికి కల్పించాలని మోదీ నొక్కి చెప్పారు.
- పరీక్షల ప్రాముఖ్యతను వివరిస్తూనే పరీక్షలకు సిద్ధం కావడం కంటే జ్ఞానం పొందడంపై దృష్టి పెట్టాలని ప్రధాని, విద్యార్థులను ప్రోత్సహించారు.
- తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. పిల్లలు తమ ఆసక్తులను అన్వేషించడానికి స్వేచ్ఛను అనుమతించాల్సిన అవసరాన్ని చెప్పారు. విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకూడదని, అభిరుచులను కొనసాగించడానికి సమయం వెచ్చించాలని, ఇది మొత్తం అభివృద్ధిని పెంచుతుందని ఆయన నొక్కి చెప్పారు.
- క్రికెట్ నుండి ప్రేరణ పొంది, ప్రధానమంత్రి మోదీ, విద్యార్థులు బాహ్య ఒత్తిడి కంటే చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. జనసమూహ శబ్దం మధ్య బ్యాట్స్‌మన్ బంతిపై దృష్టి సారించినట్లే, విద్యార్థులు ఒత్తిడి గురించి చింతించకుండా నేర్చుకోవడంపైనే దృష్టి పెట్టాలన్నారు.
- ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రాముఖ్యతను కూడా ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. అనారోగ్యాన్ని నివారించడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే సరిపోదని ఆయన విద్యార్థులకు గుర్తు చేశారు. సరైన నిద్ర, సమతుల్య ఆహారం మొత్తం శ్రేయస్సుకు చాలా ముఖ్యమైనవని సూచించారు.
ఇదే కార్యక్రమంలో కేరళ నుంచి వచ్చిన ఆకాంన్షా(Akansha) అనే విద్యార్థి ప్రధానిని హిందీలో పలకరించారు. ఇంత బాగా హిందీ ఎలా నేర్చుకుంటావని అడిగిన మోదీ ప్రశ్నకు సమాధానంగా.. తనకు హిందీ అంటే చాలా ఇష్టమని, తానొక కవిత కూడా రాశానని చెప్పారు. మీరు ప్రధాని కాకపోయుంటే ఏ మంత్రిత్వ శాఖ తీసుకుంటారని ఓ విద్యార్థి, ప్రదానిని అడగ్గా.. తనకు నైపుణ్యాభివృద్ధి అంటే ఆసక్తి అని మోదీ చెప్పారు.
Also Read : Maoist Encounters: ఈ ఏడాది వరుస ఎన్‌కౌంటర్లు - 37 రోజుల్లో 81 మంది మావోయిస్టుల మృతి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

