యూడైస్‌లో పేరుంటేనే ‘టెన్త్’ పరీక్షలకు అనుమతి, ఇక ఆన్‌లైన్‌లోనే నామినల్ రోల్స్
తెలంగాణలో పాఠశాల విద్యార్థుల సమగ్ర సమాచారాన్ని పొందుపరిచే 'యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్(యూడైస్)'లో పేరు ఉంటేనే పదోతరగతి పరీక్షలకు అనుమతించనున్నారు.
తెలంగాణలో పాఠశాల విద్యార్థుల సమగ్ర సమాచారాన్ని పొందుపరిచే 'యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్(యూడైస్)'లో పేరు ఉంటేనే పదోతరగతి పరీక్షలకు అనుమతించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అక్టోబరు 16న కీలక నిర్ణయం తీసుకుంది. పది పరీక్షలకు ఫీజు చెల్లించిన తర్వాత ఆయా పాఠశాలలు ప్రభుత్వ పరీక్షల విభాగానికి విద్యార్థుల పేర్లు, ఇతర సమగ్ర వివరాలతో కూడిన నామినల్‌రోల్స్‌ను పంపిస్తాయి. అనుమతి లేని పాఠశాలల్లో చదివే పిల్లలను మరో బడి నుంచి పరీక్షలు రాయిస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకే ఇప్పటి నుంచి యూడైస్‌లో పేరు ఉంటేనే పదోతరగతి పరీక్షలకు అనుమతి ఇస్తారు.
నామినల్‌రోల్స్ ఆన్‌లైన్‌లోనే..
పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల నామినల్ రోల్స్‌ను ఇక నుంచి ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. దీనిని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్) ప్లస్‌లోని విద్యార్థుల డాటాను ప్రామాణికంగా తీసుకొంటారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో గుర్తింపు పొందిన పాఠశాలలు తమ వద్ద చదివే విద్యార్థుల డాటాను యూడైస్ ప్లస్ వెబ్‌సైట్‌లో అక్టోబరు 28లోపు యూడైస్ పోర్టల్‌లో విద్యార్థుల డేటాను ఆధునికీకరించాలని, దాన్నే నామినల్ రోల్స్‌గా పరిగణలోకి తీసుకుంటామని, పాఠశాలలు అన్నింటికీ ఈలోపే తెలియజేయాలని, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన డీఈఓలను ఆదేశించారు.
మార్చిలో పదోతరగతి వార్షిక పరీక్షలు..
పదోతరగతి వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వొకేషనల్ ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు కూడా అదే నెలలో ఉంటాయని వెల్లడించారు. నిరుడు నుంచి 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లకే పదోతరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు.
ALSO READ:
విద్యార్థుల కోసం 'అపార్' కార్డు, 'వన్ నేషన్-వన్ ఐడీ'కి కసరత్తు, రాష్ట్రాలను ఆదేశించిన కేంద్రం
‘ఆధార్’ తరహాలో విద్యార్థుల కోసం ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అపార్(ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) పేరుతో 'వన్ నేషన్-వన్ ఐడీ' కార్డును అందుబాటులోకి తేనున్నారు. విద్యార్థులకు ఈ గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలు, యూటీలను కేంద్ర విద్యాశాఖ తాజాగా ఆదేశించింది. అపార్ ఐడీ కార్డును దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్నారు. ఈ అపార్ నెంబర్‌నే విద్యార్థి జీవితకాల ఐడీగా పరిగణిస్తారు. దీంట్లో విద్యార్థి అకడమిక్ జర్నీ, విద్యా ప్రయాణం, విజయాలు నిక్షిప్తం అయ్యి ఉంటాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
డిప్లొమా మహిళలకు ఉపకారవేతనాలు - అర్హత, ఇతర వివరాలు ఇలా
మహిళలను సాంకేతిక విద్యలో ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘ప్రగతి స్కాలర్‌షిప్’ నోటిఫికేషన్ వెలువడింది. ‘ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ)’ ఏటా ఈ ఉపకారవేతనం అందిస్తోంది. డిప్లొమా చదువుతున్న అర్హులైన అమ్మాయిలకు ఈ స్కీమ్ కింద ఆర్థికసాయం అందిస్తారు. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకూడదు. ఒక కుటుంబం నుంచి ఇద్దరు అమ్మాయిలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. సరైన అర్హతలున్న మహిళలు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాలి. అకడమిక్ మెరిట్ ఆధారంగా స్కాలర్‌షిప్ అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అక్టోబరు 31తో ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ముగియనుంది.
స్కాలర్‌షిప్ వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇంటర్ పాసైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, దరఖాస్తుకు డిసెంబరు 31 వరకు గడువు
తెలంగాణలో ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులై... ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు 'నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్'కు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిత్తల్ అక్టోబరు 6న ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబరు 31 వరకు గడువు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇంటర్ మార్కుల్లో టాప్-20 పర్సంటైల్‌లో నిలిచిన 53,107 మంది ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఆయన పేర్కొన్నారు. కొత్త విద్యార్థులతోపాటు గతంలో స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన వారు కూడా రెన్యువల్ కోసం డిసెంబరు 31లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
స్కాలర్‌షిప్ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..