అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

One Nation One ID: విద్యార్థుల కోసం 'అపార్' కార్డు, 'వన్‌ నేషన్-వన్‌ ఐడీ'కి కసరత్తు, రాష్ట్రాలను ఆదేశించిన కేంద్రం

దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అపార్(ఆటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ) పేరుతో 'వన్‌ నేషన్-వన్‌ ఐడీ' కార్డును అందుబాటులోకి తేనున్నారు.

‘ఆధార్‌’ తరహాలో విద్యార్థుల కోసం ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అపార్(ఆటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ) పేరుతో 'వన్‌ నేషన్-వన్‌ ఐడీ' కార్డును అందుబాటులోకి తేనున్నారు. విద్యార్థులకు ఈ గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలు, యూటీలను కేంద్ర విద్యాశాఖ తాజాగా ఆదేశించింది.
 
అపార్‌ ఐడీ కార్డును దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్నారు. ఈ అపార్‌ నెంబర్‌నే విద్యార్థి జీవితకాల ఐడీగా పరిగణిస్తారు. దీంట్లో విద్యార్థి అకడమిక్‌ జర్నీ, విద్యా ప్రయాణం, విజయాలు నిక్షిప్తం అయ్యి ఉంటాయి. అవసరమైన సమయంలో ట్రాక్‌ చేయొచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే.. విద్యార్థులకు కొత్త అపార్‌ గుర్తింపు జారీకి సంబంధించి తల్లిదండ్రులతో మాట్లాడాలని.. వారి సమ్మతి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలను కోరింది. ఇక ఈ అపార్‌ ఐడీ ప్రాముఖ్యతను వివరించాలని చెప్పింది. అక్టోబర్ 16-18 మధ్య తల్లిదండ్రులు, ఉపాద్యాయులతో సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అయితే.. ఈ ఐడీకి ఓకే చెప్పిన తల్లిదండ్రులు ఆతర్వాత ఎప్పుడైనా సరే దాన్ని ఉపసంహరించుకోవచ్చని కూడా కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
 
దేశంలో కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థుల సమగ్ర వివరాలు ఒకే గొడుగు కిందకు రానున్నాయి. విద్యార్థి ఎల్‌కేజీలో చేరినప్పట్నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు.. వీటికి సంబంధించిన పూర్తివివరాలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా ఈ కార్డు ఉపయోగపడనుంది. ఈ కొత్త కార్డును ఆధార్ సంఖ్యతోపాటు 'అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్(ఏబీసీ)' అనే ఎడ్యులాకర్‌కు అనుసంధానించనుంది.
 
పాఠశాల విద్యలోని పిల్లలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇచ్చే విధానాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 'ఛైల్డ్ ఇన్ఫో' పేరిట ఒక్కో విద్యార్థికి, ఒక్కో సంఖ్య విధానాన్ని గత కొన్నేళ్లుగా అమలు చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మరొకటి ఇవ్వబోతోంది. ఆ విధానం అమల్లోకి వచ్చే పక్షంలో కేంద్రం ఇచ్చే నంబరు ఒక్కటే సరిపోతుంది. దేశవ్యాప్తంగా 1-12వ తరగతి వరకు 26 కోట్ల మంది విద్యార్థులున్నందున 17 అంకెలున్న సంఖ్యను ఇచ్చే అవకాశం ఉంది. 
 
కేంద్ర విద్యాశాఖ పరిధిలోని నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరంకు ఈ బాధ్యతను అప్పగించింది. దీనికి ఛైర్మన్‌గా ఏఐసీటీఈ మాజీ ఛైర్మన్ ఆచార్య సహస్రబుద్దే వ్యవహరిస్తున్నారు. ఆధార్‌తో అనుసంధానం చేసిన ప్రత్యేక సంఖ్యను నమోదుచేస్తే చాలు.. విద్యార్థి కుటుంబ వివరాలు, మార్కుల సర్టిఫికేట్లు, నైపుణ్యాలు, పొందిన స్కాలర్‌షిప్స్ తదితర వివరాలన్నీ తెలుసుకునే వీలుంటుంది. వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందే సమయంలోనూ ధ్రువీకరణపత్రాలను భౌతికంగా కాకుండా, డిజిటల్‌లో పరిశీలించి సీటు ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రవేశ పరీక్షల దరఖాస్తుల్లోనూ ఈ సంఖ్యను నమోదుచేస్తే సరిపోతుంది. అన్ని వివరాలు నమోదు చేసినట్లే పరిగణిస్తాం అని ఏఐసీటీఈ వర్గాలు చెబుతున్నాయి.
 
ఏమిటీ అపార్‌ ఐడీ?
అపార్‌ నంబర్‌ను విద్యార్థి జీవితకాల ఐడీగా పరిగణిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు అపార్‌ ఐడీ ఇవ్వనున్నారు. దీనిలో విద్యార్థి అకడమిక్‌ జర్నీ, చరిత్ర(విద్యా ప్రయాణం), విజయాలు నిక్షిప్తం అవుతాయని, అవసరమైన సమయంలో ట్రాక్‌ చేయొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందులో విద్యార్థుల సమాచారం రహస్యంగా ఉంటుందని, ప్రభుత్వ ఏజెన్సీలతో మాత్రమే పంచుకోవడం జరుగుతుందని ప్రభుత్వం పేర్కొన్నట్టు తెలిపింది. ‘వన్‌ నేషన్‌-వన్‌ స్టూడెంట్‌ ఐడీ’ స్కీమ్‌పై ఏఐసీటీఈ చైర్మన్‌ టీజీ సీతారామన్‌ మాట్లాడుతూ.. ఆపార్‌, నేషనల్‌ క్రెడిట్‌ ఫ్రేమ్‌ వర్క్‌ దేశంలోని విద్యార్థులకు క్యూఆర్‌ కోడ్‌ మాదిరిగా పనిచేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థి నేర్చుకొన్న ప్రతి నైపుణ్యం, సాధించిన విజయం అందులో జమ అవుతుందని అన్నారు.
 
ఏ సమయంలోనైనా ఉపసంహరించుకోవచ్చు..
విద్యార్థులకు కొత్త అపార్‌ గుర్తింపు కార్డుల జారీకి సంబంధించి తల్లిదండ్రులతో మాట్లాడాలని, అందుకు వారి సమ్మతి తీసుకోవాలని కేంద్రం అన్ని పాఠశాలలను కోరింది. అపార్‌ ఐడీ ప్రాముఖ్యతను వివరించేందుకు అక్టోబర్‌ 16-18 మధ్య తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించాలని సూచించింది. విద్యార్థికి అపార్‌ ఐడీ జారీకి సమ్మతి తెలిపిన తల్లిదండ్రులు.. ఏ సమయంలోనైనా దాన్ని ఉపసంహరించుకోవచ్చు.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget