అన్వేషించండి

TS SET 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

తెలంగాణలోని యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు/లెక్చరర్ల కోసం అర్హత పరీక్ష టీఎస్ సెట్- 2023 దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 5న ప్రారంభమైంది. ఆగస్టు 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు/లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే పరీక్ష తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (టీఎస్ సెట్)-2023 నోటిఫికేషన్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం జులై 29న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 5న ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇక ఆలస్యరుసుముతో సెప్టెంబరు 12 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. కంప్యూట‌ర్ బేస్డ్ టెస్టు ప‌ద్ధతిలో అక్టోబరులో 'సెట్' ప‌రీక్ష నిర్వహించ‌నున్నారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేప‌ర్-1లో 50 ప్రశ్నల‌కు 100 మార్కులు, పేప‌ర్-2లో 100 ప్రశ్నల‌కు 200 మార్కులు ఉంటాయి. ప‌రీక్ష కాల వ్యవ‌ధి మూడు గంట‌లు. 

వివరాలు..

*  తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(టీఎస్‌ సెట్‌)-2023

సబ్జెక్టులు: జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ (పేపర్-1), జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా , మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్.

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీజీ (ఎంఏ, ఎంస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ, ఎంటెక్(సీఎస్ఈ, ఐటీ) ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

పరీక్ష రుసుం: ఓసీలకు రూ.2000; బీసీ/ ఈడబ్ల్యూఎస్‌లకు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, వీహెచ్‌, హెచ్‌ఐ, ఓహెచ్‌, ట్రాన్స్‌జెండర్‌లకు రూ.1000.

పరీక్ష విధానం: మొత్తం 29 సబ్జెక్టులకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత టెస్టు(సీబీటీ) పద్ధతిలో జరిగే పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు. 

పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, నిజామాబాద్, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కర్నూలు, కరీంనగర్, ఖమ్మం, తిరుపతి, మహబూబ్ నగర్, మెదక్, వైజాగ్, నల్గొండ, రంగారెడ్డి.

ముఖ్యమైన తేదీలు..

* టీఎస్ సెట్ 2023 నోటిఫికేషన్: 30.07.2023.

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.08.2023. 

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 29.08.2023.

* రూ.1500 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది: 04.09.2023.

* రూ.2000 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది: 09.09.2023.

* రూ.3000 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది: 12.09.2023.

* దరఖాస్తుల సవరణకు అవకాశం: సెప్టెంబరు 13, 14 తేదీల్లో.

* హాల్‌టికెట్ డౌన్‌లోడ్: అక్టోబరు 20 నుంచి.

* పరీక్ష తేదీలు: అక్టోబరు 28- 30 వరకు.

Notification

Online Application

Website

ALSO READ:

భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్‌లో 105 జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్‌ ఖాళీలు
ముంబయిలోని భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్‌) జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీతోపాటు జూనియర్ రిసెర్చ్ కోసం అర్హత కల్పించే ఏదైనా పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 4న ప్రారంభంకాగా.. ఆగస్టు 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అకడమిక్ మార్కులు, జాతీయ స్థాయి అర్హత పరీక్షలో సాధించిన స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో 647 గ్రాడ్యుయేట్ & డిప్లొమా, ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు
నాసిక్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) గ్రాడ్యుయేట్ & డిప్లొమా & ఐటీఐ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 647 పోస్టులను భర్తీ చేయనున్నారు.  సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, ఖాళీల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Embed widget