TS ECET - 2023: టీఎస్ ఈసెట్-2023 దరఖాస్తు మొదలైంది, దరఖాస్తు చేసుకోండి - చివరితేది ఎప్పుడంటే?
టీఎస్ ఈసెట్-2023 దరఖాస్తుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మార్చి 2న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, మే 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
తెలంగాణలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాలకు డిప్లొమా విద్యార్థులకు నిర్వహించే టీఎస్ ఈసెట్-2023 దరఖాస్తుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మార్చి 2న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, మే 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే రూ.500 ఆలస్యం రుసుంతో మే 8 వరకు, రూ.2500తో మే 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తులను మే 8 నుంచి మే 12 వరకు ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మే 15 నుంచి అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 20న ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈసెట్ ద్వారా బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సు్లో లేటరల్ ఎంట్రీ ద్వారా సెకండియర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.
వివరాలు...
➥ టీఎస్ఈసెట్- 2023
ప్రవేశ కోర్సులు: బీఈ/బీటెక్/బీఫార్మసీ.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈసెట్-2023) ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.900. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.
పరీక్ష విధానం:
ముఖ్యమైన తేదీలు..
➥ నోటిఫికేషన్ వెల్లడి: 01.03.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02-03-2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 02-05-2023.
➥ రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 08-05-2023.
➥ రూ.2,500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 12-05-2023.
➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 08-05-2023 నుంచి 12-05-2023 వరకు.
➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 15-05-2023.
➥ ఈసెట్ పరీక్ష తేది: 20-05-2023.
పరీక్ష సమయం: ఉ. 09:00 - మ.12:00 (ECE, EIE, CSE, EEE, CIV, MEC, CHE, MIN, MET, PHM, BSM)
Also Read:
టీఎస్ ఎడ్‌సెట్ - 2023 దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలో బీఈడీ కళాశాలల్లో బీఎడ్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే 'టీఎస్ ఎడ్‌సెట్ – 2023' దరఖాస్తు ప్రక్రియ మార్చి 6న ప్రారంభమైంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.250 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 25 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మార్చి 30న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు. మే 5 నుంచి ఎడ్‌సెట్ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి. మే 18న ప్రవేశ పరీక్ష నిర్వహించి, మే 21న ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు స్వీకరించి, తదనంతరం ఫైనల్ కీతోపాటు, ఫలితాలను విడుదల చేస్తారు. దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.550, ఇతర కేటగిరీల అభ్యర్థులు రూ. 750 చెల్లించాల్సి ఉంటుంది.
ఎడ్‌సెట్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
TS PGECET - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో TS PGECET-2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 2 నుంచి 4 మధ్యలో దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. రూ.250 ఆలస్య రుసుంతో మే 5 వరకు, రూ. 1000 ఆలస్య రుసుముతో మే 10 వరకు, రూ.2,500 ఆలస్య రుసుముతో మే 15 వరకు, రూ.5,000 ఆలస్య రుసుంతో మే 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 21 నుంచి టీఎస్ పీజీఈసెట్ వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 29 నుంచి జూన్ 1 వరకు పీజీఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..