అన్వేషించండి

TS ECET 2024 Answer Key: తెలంగాణ ఈసెట్‌ 2024 ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం

TS ECET 2024 Key: తెలంగాణలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాల‌కు డిప్లొమా విద్యార్థులకు నిర్వహించిన టీఎస్ ఈసెట్‌-2024 ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ'ని ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది.

TS ECET 2024 Preliminary Key: తెలంగాణలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాల‌కు డిప్లొమా విద్యార్థులకు నిర్వహించిన టీఎస్ ఈసెట్‌-2024 ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ'ని ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్‌ షీట్‌, మాస్టర్‌ ప్రశ్నపత్రాలను విడుదల చేసింది. అభ్యర్థులు వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ ఈసెట్ హాల్‌టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఈసెట్ రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.ఒకవేళ ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు మే 12 వరకు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం ఉంది. ఆన్‌లైన్ విధానంలో మాత్రమే అభ్యంతరాలు తెలపాలి.

Download Response Sheet (Candidate Specific)

Master Question Papers With Preliminary Key

Objections on Preliminary Key

తెలంగాణలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాల‌కు డిప్లొమా, బీఎస్సీ విద్యార్థులకు నిర్వహించే 'టీఎస్ఈసెట్‌-2024' నోటిఫికేషన్ ఫిబ్రవరి 14న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రవేశ పరీక్ష కోసం ఫిబ్రవరి 15న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఆలస్యరుసుములో ఏప్రిల్ 28 వరకు ద‌ర‌ఖాస్తుల‌ు స్వీక‌రించారు. కనీసం 45 శాతం మార్కులతో స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈసెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉండాలి. అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఫీజుగా రూ.900 వసూలు చేశారు. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల నుంచి రూ.500 వసూలు చేశారు. ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 28 మధ్య దరఖాస్తుల్లో తప్పులుంటే సరిచేసుకునేందుకు అవకాశం కల్పించారు. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 1 నుంచి సంబంధిత వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు.

మే 6న ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు పరీక్ష నిర్వహించారు. మొత్తం 99 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఇందులో తెలంగాణ జిల్లాల్లో 48, హైద‌రాబాద్ రిజీయ‌న్‌లో 44, ఏపీలో 7 ప‌రీక్షా కేంద్రాల‌ు ఉన్నాయి. మొత్తం 24,272 మంది అభ్యర్థులు ఈసెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ ఆధ్వర్యంలో పరీక్ష జ‌ర‌గ‌నుంది. ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీరాం వెంకటేశ్​ను ఈసెట్ కన్వీనర్​గా వ్యవహరిస్తున్నారు. 

ఈసెట్‌ ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమెటిక్స్‌) అభ్యర్థులకు 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. పరీక్షను ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. 

పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, బీస్సీ మ్యాథమెటిక్స్ విభాగాలకు వేర్వేరుగా పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 180 నిమిషాలు (3 గంటలు).

ALSO READ:

ఏపీ ఆర్జీయూకేటీల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, ఎంపిక ఇలా!
ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) ఆధ్వర్యంలో 2024-25 విద్యాసంవత్సరానికి ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు మే 6న నోటిఫికేషన్‌ వెలువడిన సంగతి తెలిసిందే. ప్రవేశాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 8న ప్రారంభమైంది. ప్రవేశాలు కోరువారు జూన్ 25న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఏపీ ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ఐఐఐటీ క్యాంపస్‌లలో ప్రవేశాలకు యేటా మూడు సార్లు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కాల్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆయా తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Chairman: టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం, కొత్త పాలకమండలి సభ్యులు వీరే
టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం, కొత్త పాలకమండలి సభ్యులు వీరే
Lucky Baskhar Review: లక్కీ భాస్కర్ రివ్యూ: దుల్కర్ లక్కీ అయ్యాడా? - ఈ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?
లక్కీ భాస్కర్ రివ్యూ: దుల్కర్ లక్కీ అయ్యాడా? - ఈ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?
Telangana Group 3 : తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
Mayonnaise Ban: స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు బిగ్ షాక్, మయోనైజ్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు బిగ్ షాక్, మయోనైజ్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

టీటీడీ ఛైర్మన్‌‌గా బీఆర్ నాయుడు, అధికారిక ప్రకటనబిర్యానీ తెప్పించాలన్న బోరుగడ్డ - జడ్జి స్ట్రాంగ్ కౌంటర్‌తో సైలెంట్SS Rajamouli Lion Update | వైల్డ్ సఫారీ ఫోటోలతో హింట్స్ ఇస్తున్న రాజమౌళి | ABP Desamవివాదంలో సాయి పల్లవి, పాత వీడియో తీసి విపరీతంగా ట్రోల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Chairman: టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం, కొత్త పాలకమండలి సభ్యులు వీరే
టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం, కొత్త పాలకమండలి సభ్యులు వీరే
Lucky Baskhar Review: లక్కీ భాస్కర్ రివ్యూ: దుల్కర్ లక్కీ అయ్యాడా? - ఈ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?
లక్కీ భాస్కర్ రివ్యూ: దుల్కర్ లక్కీ అయ్యాడా? - ఈ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?
Telangana Group 3 : తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
Mayonnaise Ban: స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు బిగ్ షాక్, మయోనైజ్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు బిగ్ షాక్, మయోనైజ్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
Jai Hanuman First Look : 'జై హనుమాన్' నుంచి దివాళి బ్లాస్ట్ వచ్చేసింది... 'హనుమాన్'గా 'కాంతారా' స్టార్ లుక్ అదుర్స్
'జై హనుమాన్' నుంచి దివాళి బ్లాస్ట్ వచ్చేసింది... 'హనుమాన్'గా 'కాంతారా' స్టార్ లుక్ అదుర్స్
IPL 2025 RCB Retention List: ఆర్సీబీ రిటెయిన్ చేసుకునే ఆటగాళ్లు వీరే! విరాట్ కోహ్లీని మళ్లీ కెప్టెన్‌గా చూస్తామా?
ఆర్సీబీ రిటెయిన్ చేసుకునే ఆటగాళ్లు వీరే! విరాట్ కోహ్లీని మళ్లీ కెప్టెన్‌గా చూస్తామా?
Babies Health : చలికాలంలో పిల్లలను ఇలా జాగ్రత్తగా కాపాడుకోండి.. ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు
చలికాలంలో పిల్లలను ఇలా జాగ్రత్తగా కాపాడుకోండి.. ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు
Harish Rao Chit Chat: రేవంత్ కుర్చీ కిందే బాంబు - పాదయాత్రకు డేటు, టైం చెప్పు - రేవంత్‌కు హరీష్ సవాల్
రేవంత్ కుర్చీ కిందే బాంబు - పాదయాత్రకు డేటు, టైం చెప్పు - రేవంత్‌కు హరీష్ సవాల్
Embed widget