అన్వేషించండి

NEET UG Notification: నీట్‌ యూజీ - 2024 నోటిఫికేషన్‌ వచ్చేసింది, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ!

NEET UG 2024: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 9న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది.

NEET (UG) 2024: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (National Eligibility-cum-Entrance Test) యూజీ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 9న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. నీట్ యూజీ పరీక్షను మే 5న నిర్వహించనున్నట్లు ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్థులు ఫిబ్రవరి 9 నుంచి మార్చి 9 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను పెన్ను, పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో వెల్లడించనున్నారు. నీట్ పరీక్ష మే 5న (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య జరగనుంది.

నీట్‌(యూజీ) సిలబస్‌ తగ్గింపు..
నీట్(యూజీ) సిలబస్‌‌ను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) తగ్గించిన సంగతి తెలిసిందే. విద్యార్థులపై భారం తగ్గించే విధంగా సిలబస్‌లో మార్పులు చేసింది. ఎన్‌ఎంసీ విడుదల చేసిన సిలబస్‌ ప్రకారం.. ఫిజిక్స్‌లో అధికంగా సిలబస్‌ తగ్గించారు. కెమిస్ట్రీలోనూ కొన్ని పాఠ్యాంశాలను తగ్గించారు. అయితే బోటనీ, జువాలజీ సబ్జెక్టుల సిలబస్‌ తగ్గించడం విద్యార్థుల ప్రిపరేషన్‌పై పెద్ద ప్రభావమేమీ చూపదని నిపుణులు అంటున్నారు. ఇది విద్యార్థులకు అనుకూలించే అంశమని చెప్పవచ్చు. అయితే సిలబస్‌ను ఆలస్యంగా విడుదల చేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. సిలబస్‌ తగ్గింపుతో ప్రస్తుత సెకండియర్‌ విద్యార్థుల కన్నా, ఫస్టియర్‌ విద్యార్థులకే అధిక ప్రయోజనం అని నిపుణలు అంటున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

నీట్ యూజీ- 2024 వివరాలు..

ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్, ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గత ఐదేళ్లుగా ఈ పరీక్ష రాసేవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. గతేడాది మొత్తం 20.38 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 11.45,968 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 

అర్హతలు..
➥ 50 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/బయోటెక్నాలజీ సంబంధిత గ్రూపులతో 10+2/ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/దివ్యాంగుల అభ్యర్థులకు 40 శాతం మార్కులు తప్పనిసరి.

➥ విదేశాల్లో ఎంబీబీస్ పూర్తిచేసి ఇండియాలో ఉద్యోగం చేసేందుకు సిద్ధమయ్యే భారతీయ విద్యార్థులు, విదేశీ విద్యార్థులు కూడా నీట్ క్వాలిఫై అవ్వటం తప్పనిసరి.

➥ జనరల్ కేటగిరి విద్యార్థులు వరుసగా 9 ఏళ్ళు హాజరయ్యే అవకాశం ఉంది. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు గరిష్టంగా 15 ఏళ్లు హాజరవ్వొచ్చు.

వయోపరిమితి: 31.12.2024 నాటికి అభ్యర్థుల వయసు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. 31.12.2007కు ముందు జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/దివ్యాంగుల అభ్యర్థులకు 5 సంవత్సరాలపాటు వయో సడలింపు ఉంటుంది. ఈ అభ్యర్థుల గరిష్థ వయసు 25 సంవత్సరాలకు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. నీట్‌కు దరఖాస్తు చేసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకొని భద్రపరచుకోండి. అలాగే, అప్‌లోడ్ చేసిన ఫొటో కాపీని సైతం మీ వద్దే ఉంచుకోండి. ఆ డాక్యుమెంట్లు తర్వాత అవసరమవుతాయి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష (నీట్ యూజీ 2024) ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుం రూ.1700 కాగా, జనరల్ ఈడబ్ల్యూఎస్/ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులకు రూ.1600, ఎస్సీ, ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/థర్డ్ జండర్ అభ్యర్థులకు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 

నీట్ యూజీ పరీక్ష విధానం..
➥ నీట్ ప్రవేశ పరీక్ష పూర్తి ఆఫ్‌లైన్‌ (పెన్, పేపర్) విధానంలో నిర్వహించబడుతుంది. మూడు గంటల 20 నిముషాల నిడివితో జరిగే ఈ పరీక్షలో ప్రతి సబ్జెక్టు నుండి గరిష్టంగా 45 ప్రశ్నలు చెప్పున మొత్తం 180 ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రశ్నలు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ మరియు జూవాలాజీ సబ్జెక్టులకు సంబంధించి ఉంటాయి.

➥ ఒక్కో సబ్జెక్టు నుంచి రెండు సెక్షన్ల (సెక్షన్-ఎ, బి) వారీగా 50 ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-ఎ నుంచి 35 ప్రశ్నలు, సెక్షన్-బి నుంచి 15 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-బి లోని 15 ప్రశ్నల్లో 10 ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అభ్యర్థి సమాధానం చేసిన మొదటి 10 ప్రశ్నలను మాత్రమే లెక్కింపు సమయంలో పరిగణలోకి తీసుకుంటారు.

➥ ప్రతి ప్రశ్న మల్టిఫుల్ ఛాయస్ పద్దతిలో నాలుగు ఆప్షనల్ సమాధానాలు కలిగి ఉంటుంది. అందులో ఒక సరైన సమాధానాన్ని గుర్తించవలసి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. తప్పు సమాధానం ఇచ్చిన ప్రశ్నకు మైనస్ 1 మార్కు ఇవ్వబడుతుంది.

➥ మొత్తం 720 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 10+2/ఇంటర్మీడియట్ స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలాజీ) లకు సంబంధించిన సిలబస్ నుండి ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్న పత్రాలు దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

NEET UG Notification: నీట్‌ యూజీ - 2024 నోటిఫికేషన్‌ వచ్చేసింది, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ!

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 09.02.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 09.03.2024. (09:00 PM)

➥ నీట్ యూజీ-2023 పరీక్ష తేదీ: 05.05.2024.

Public Notice

Information Broucher

Online Registration

Website

NEET UG Notification: నీట్‌ యూజీ - 2024 నోటిఫికేషన్‌ వచ్చేసింది, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ!

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhimavaram Temples: సంక్రాంతికి భీమవరం వెళ్తున్నారా? అయితే తప్పక చూడాల్సినవి ఇవే
సంక్రాంతికి భీమవరం వెళ్తున్నారా? అయితే తప్పక చూడాల్సినవి ఇవే
PM Modi New Office: త్వరలోనే కొత్త ఆఫీస్‌లోకి ప్రధానమంత్రి మోదీ! ఇంటి చిరునామా కూడా మారుతుందా?
త్వరలోనే కొత్త ఆఫీస్‌లోకి ప్రధానమంత్రి మోదీ! ఇంటి చిరునామా కూడా మారుతుందా?
Pushpa 2 Japan Release : జపాన్‌లో పుష్ప రాజ్ ఎంట్రీ - 'పుష్ప కున్రిన్' రిలీజ్ ఎప్పుడంటే?
జపాన్‌లో పుష్ప రాజ్ ఎంట్రీ - 'పుష్ప కున్రిన్' రిలీజ్ ఎప్పుడంటే?
Hyderabad Crime News: ఇక్కడితోనైనా ఆగుతుందా? చైనా మాంజా ప్రమాదాలు ఇంకెన్ని చూడాలి !
ఇక్కడితోనైనా ఆగుతుందా? చైనా మాంజా ప్రమాదాలు ఇంకెన్ని చూడాలి !

వీడియోలు

Rohit Sharma Records Ind vs NZ ODI | క్రిస్ గేల్ రికార్డును అధిగమించిన హిట్‌మ్యాన్
RCB vs UP WPL 2026 | ఆర్సీబీ సూపర్ విక్టరీ
Washington Sundar Ruled Out | గాయంతో బాధ‌ప‌డుతున్న వాషింగ్ట‌న్ సుంద‌ర్
Devdutt Padikkal record in Vijay Hazare Trophy | దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డు
Haimendorf 39th Death Anniversary | ఆదివాసీల ఆత్మబంధువు పేరు భావి తరాలకు నిలిచిపోయేలా చేస్తాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhimavaram Temples: సంక్రాంతికి భీమవరం వెళ్తున్నారా? అయితే తప్పక చూడాల్సినవి ఇవే
సంక్రాంతికి భీమవరం వెళ్తున్నారా? అయితే తప్పక చూడాల్సినవి ఇవే
PM Modi New Office: త్వరలోనే కొత్త ఆఫీస్‌లోకి ప్రధానమంత్రి మోదీ! ఇంటి చిరునామా కూడా మారుతుందా?
త్వరలోనే కొత్త ఆఫీస్‌లోకి ప్రధానమంత్రి మోదీ! ఇంటి చిరునామా కూడా మారుతుందా?
Pushpa 2 Japan Release : జపాన్‌లో పుష్ప రాజ్ ఎంట్రీ - 'పుష్ప కున్రిన్' రిలీజ్ ఎప్పుడంటే?
జపాన్‌లో పుష్ప రాజ్ ఎంట్రీ - 'పుష్ప కున్రిన్' రిలీజ్ ఎప్పుడంటే?
Hyderabad Crime News: ఇక్కడితోనైనా ఆగుతుందా? చైనా మాంజా ప్రమాదాలు ఇంకెన్ని చూడాలి !
ఇక్కడితోనైనా ఆగుతుందా? చైనా మాంజా ప్రమాదాలు ఇంకెన్ని చూడాలి !
Adilabad Latest News: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16న పర్యటించనున్న ముఖ్యమంత్రి! సదర్మాట్ బ్యారేజి, చనాక-కోరాట ప్రాజెక్టు  ప్రారంభోత్సవం!
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16న పర్యటించనున్న ముఖ్యమంత్రి! సదర్మాట్ బ్యారేజి, చనాక-కోరాట ప్రాజెక్టు  ప్రారంభోత్సవం!
T20 World Cup: భారత్‌లోనే T20 ప్రపంచ కప్ ఆడాలి.. బంగ్లాదేశ్‌కు మరో దారి లేద్న ఐసీసీ!
భారత్‌లోనే T20 ప్రపంచ కప్ ఆడాలి.. బంగ్లాదేశ్‌కు మరో దారి లేద్న ఐసీసీ!
Toronto gold heist: ఇది రియల్ థూమ్ - కెనడా విమానంలో 400 కేజీల బంగారం లూఠీ - దొంగ ఇండియనే!
ఇది రియల్ థూమ్ - కెనడా విమానంలో 400 కేజీల బంగారం లూఠీ - దొంగ ఇండియనే!
The Raja Saab Collections : ప్రభాస్ ది రాజా సాబ్ కలెక్షన్స్ - నాలుగు రోజుల్లోనే 200 కోట్ల క్లబ్‌లో డార్లింగ్ హారర్ ఫాంటసీ
ప్రభాస్ ది రాజా సాబ్ కలెక్షన్స్ - నాలుగు రోజుల్లోనే 200 కోట్ల క్లబ్‌లో డార్లింగ్ హారర్ ఫాంటసీ
Embed widget