అన్వేషించండి

JEE Main 2025: జేఈఈ మెయిన్-2025 మొదటి విడత పరీక్షల షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే

JEE Main: జేఈఈ మెయిన్‌-2025 షెడ్యూలును నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. అక్టోబరు 28 నుంచి నవంబరు 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. చ్చే ఏడాది జనవరి 22 నుంచి 31 మధ్య పరీక్షలుంటాయి.

NTA JEE MAIN 2025 SESSION-1 SCHEDULE: జేఈఈ మెయిన్‌-2025 పరీక్షల షెడ్యూలును నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) అక్టోబరు 28న ప్రకటించింది. దీనిప్రకారం వచ్చే ఏడాది జనవరి 22 నుంచి 31 వరకు జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్టులో, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహించనున్నారు. అలాగే జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలను ఏప్రిల్‌ నెలలో నిర్వహించనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 28 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. విద్యార్థుల నుంచి నవంబరు 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పరీక్షకు సంబంధించిన ఫలితాలను ఫిబ్రవరి 12న విడుదలవుతాయని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తెలిపింది.  విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు. 

జేఈఈ మెయిన్-2025 (సెషన్-1)షెడ్యూలు..

➥ జేఈఈ మెయిన్ 2025 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.10.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 22.11.2024.(9 PM)

➥ ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 22.11.2024.(11.50 PM)

➥ ఎగ్జామ్ సిటీ ప్రకటన: జనవరి నాలుగోవారంలో.

➥ అడ్మిట్‌కార్డుల విడుదల: పరీక్ష తేదీకి మూడురోజుల ముందుగా.

➥ పరీక్ష తేదీ: 22.01.2025 - 31.01.2025.

➥ ఆన్సర్ కీ, రెస్పాన్స్‌షీట్ల విడుదల: తర్వాత ప్రకటిస్తారు.

➥ ఫలితాల వెల్లడి: 12.02.2025.

WEBSITE  

జేఈఈ మెయిన్ పరీక్ష విధానంలో మార్పులు..
జాతీయ స్థాయి ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా ఈ పరీక్షను ఏడాదికి రెండుసార్లు.. జనవరిలో ఒకసారి, ఏప్రిల్‌లో మరోసారి నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఉత్తీర్ణులైన లేదా ఇంటర్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు జేఈఈ మెయిన్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ 2025 పరీక్షలో ఆప్షనల్ ప్రశ్నలను ఇకపై నిలిపివేస్తున్నట్లు ఇటీవల ఎన్టీఏ ప్రకటించిన సంగతి తెలిసిందే. కోవిడ్-19 కాలంలో ఈ నిబంధనను తీసుకొచ్చారు. అయితే రాబోయే జేఈఈ మెయిన్ పరీక్షలో పేపర్‌లోని సెక్షన్-బిలో 10కి బదులుగా 5 ప్రశ్నలు మాత్రమే ఉండనున్నాయి. విద్యార్థులు ఎలాంటి ఆప్షనల్ లేకుండా మొత్తం 5 ప్రశ్నలను పూర్తి చేయాల్సి ఉంటుంది.

పరీక్ష విధానం..

➥పేపర్‌-1(బీటెక్, బీఈ) పరీక్ష
బీఈ/బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పేపర్‌ను మొత్తం 75 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్-25 మార్కులు, ఫిజిక్స్-25 మార్కులు, కెమిస్ట్రీ-25 మార్కులకు ఉంటుంది. ప్రతి సబ్జెక్టును రెండు విభాగాలు(సెక్షన్-ఎ, సెక్షన్-బి)గా విభజించారు. ఒక్కో సబ్జెక్టులో సెక్షన్‌-ఎ 20 మార్కులు, సెక్షన్‌-బి 5 మార్కులకు నిర్వహిస్తారు. సెక్షన్-ఎలో పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో  బహుళైచ్ఛిక ప్రశ్నల(ఎంసీక్యూలతో) రూపంలో ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్‌-బిలో న్యూమరికల్‌ వాల్యూ ఆధారిత రూపంలో అయిదు ప్రశ్నలు అడుగుతారు. 

➥ పేపర్‌-2(ఎ) బీఆర్క్‌ పరీక్ష
నిట్‌లు,ట్రిపుల్‌ ఐటీలు,ఇతర ఇన్‌స్టిట్యూట్‌లలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు రాయాల్సిన పరీక్ష ఇది. పేపర్‌-2ఎగా పిలిచే ఈ పరీక్షను కూడా మూడు విభాగాలుగా నిర్వహిస్తారు. మొత్తం 77 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్‌ (పార్ట్-1) 25 మార్కులు, ఆప్టిట్యూడ్ టెస్ట్ (పార్ట్-2) 50 మార్కులు, డ్రాయింగ్ (పార్ట్-3) 02 మార్కులు ఉంటాయి. 

➥ పేపర్‌-2(బి)బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ పరీక్ష..
బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పేపర్‌-2బి మూడు విభాగాలుగా ఉంటుంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్‌ (పార్ట్-1) 25 మార్కులు, ఆప్టిట్యూడ్ టెస్ట్ (పార్ట్-2) 50 మార్కులు, డ్రాయింగ్ (పార్ట్-3) 25 మార్కులు ఉంటాయి.

JEE Main 2025: జేఈఈ మెయిన్-2025 మొదటి విడత పరీక్షల షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివేJEE Main 2025: జేఈఈ మెయిన్-2025 మొదటి విడత పరీక్షల షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
CBSE 10th Rules: సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!
సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Hair Transplant : హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
Shreyas Iyer Breaks Virat Kohli Record: కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ .. తొలి టీ20లో మెరుపు సెంచరీతో సరికొత్త చరిత్ర
కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ .. తొలి టీ20లో మెరుపు సెంచరీతో సరికొత్త చరిత్ర
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Embed widget