CUET: సీయూఈటీ (యూజీ) ప్రాథమిక కీ విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
దేశంలోని వివిధ కాలేజీలు, యూనివర్సిటీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (CUET UG 2023) ప్రిలిమినరీ కీ విడుదలైంది.
దేశంలోని వివిధ కాలేజీలు, యూనివర్సిటీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (CUET UG 2023) ప్రిలిమినరీ కీ జూన్ 29న విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచారు. మే 21 నుంచి జూన్ 23వరకు ఈ పరీక్ష తొమ్మిది దశల్లో నిర్వహించగా.. దేశవ్యాప్తంగా 387 నగరాలు, విదేశాల్లోని 24 నగరాల్లో దాదాపు 14.90లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ప్రాథమిక కీ విడుదల కావడంతో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వెబ్‌సైట్ ద్వారా తెలపవచ్చు. అయితే అభ్యంతరాలు తెలిపే ఒక్కో ప్రశ్నకు అభ్యర్థులు రూ.200ల చొప్పున ప్రాసిసింగ్ ఫీజు(నాన్ రిఫండ్) చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 29 నుంచి జులై 1న రాత్రి 11.50 గంటల వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలపవచ్చు. ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం తుది కీ, ఫలితాలను వెల్లడిస్తారు.
సీయూఈటీ ఆన్సర్ 'కీ' కోసం క్లిక్ చేయండి..
జులై మొదటి వారంలో ఫలితాలు..
సీయూఈటీ యూజీ- 2023 పరీక్షలు జూన్ 23న ముగిశాయి. ప్రస్తుతం అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే జులై మొదటి వారంలో రిజల్ట్స్ వెల్లడయ్యే అవకాశం ఉంది. సాధారణంగా సీయూఈటీ ఫలితాలు, పరీక్షలు ముగిసిన 15 రోజుల్లో వెల్లడి అవుతాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జూన్ 17న ముగియాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల పరీక్షలను జూన్ 23 వరకు పొడిగించారు. దీంతో ఫలితాలు కొద్దిగా ఆలస్యం కానున్నాయి. జులై మొదటి వారంలో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పీటీఐ పేర్కొంది. అయితే సీయూఈటీ ఫలితాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఫలితాలపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న 44 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికిగానూ యూజీ కోర్సుల్లో చేరవచ్చు. ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలు సైతం అడ్మిషన్ల కోసం సీయూఈటీ స్కోరును పరిగణనలోకి తీసుకుంటాయి. వీటిలో 12 రాష్ట్ర యూనివర్సిటీలు, 11 డీమ్డ్ వర్సిటీలు, 19 ప్రైవేటు యూనివర్సిటీలతో కలిపి మొత్తం 99 యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్ష ద్వారా జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇగ్నో, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ వంటి మరెన్నో ప్రముఖ విద్యాసంస్థల్లో సీటు సంపాదించవచ్చు.
ALSO READ:
ఇంటిగ్రేటెడ్ బీఈడీ సీట్ల భర్తీకి ఎన్‌సెట్ నోటిఫికేషన్ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
ఇంటర్ విద్యార్హతతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు 2023-24 విద్యా సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(NCET) పేరిట జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి ఉన్నవారు జూన్ 27 నుంచి జులై 19 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పరీక్షల తేదీలను ఎన్టీఏ తర్వాత ప్రకటించనుంది.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఇక తెలుగులోనూ జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష! ఐఐటీ కౌన్సిల్‌లో నిర్ణయం!
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(జేఈఈ) అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే తెలుగు విద్యార్థులకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. నీట్, జేఈఈ మెయిన్ తరహాలోనే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షనూ తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఐఐటీ కౌన్సిల్, ఐఐటీ ఢిల్లీని ఆదేశించింది. ప్రధానంగా ఐఐటీల్లో డ్రాపౌట్ల నివారణకు తీసుకోవల్సిన చర్యలపై ఐఐటీ కౌన్సిల్ దృష్టి పెట్టింది. డ్రాపౌట్స్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసి నివేదికను ఇవ్వాలని ఐఐటీ ఖరగ్‌పూర్‌ను కౌన్సిల్ ఆదేశించింది. గత ఏప్రిల్‌లో జరిగిన ఐఐటీ కౌన్సిల్ మీటింగ్‌కు సంబంధించిన తీర్మానాలను కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial