అన్వేషించండి

CUET PG Results: సీయూఈటీ(పీజీ) పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్‌! డైరెక్ట్ లింక్ ఇదే!

దేశవ్యాప్తంగా 142 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ-పీజీ) ఫలితాలు వెలువడ్డాయి. వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది.

దేశవ్యాప్తంగా 142 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ-పీజీ) ఫలితాలు వెలువడ్డాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురువారం (జులై 20) ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. రాతపరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలను చూసుకోవచ్చు. 
ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 

సీయూఈటీ(పీజీ)-2023  నోటిఫికేషన్‌ను ఎన్టీఏ మార్చి 20న వెలువడిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి మార్చి 20 నుంచి మే 5 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మే 6, 7, 8 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. జూన్‌ 5 నుంచి 17 వరకు, జూన్ 22 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా 295 నగరాల్లో, విదేశాల్లో 24 నగరాల్లో 'సీయూఈటీ- పీజీ' పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 8,76.908 మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్ 13న ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ' విడుదల చేశారు. ఆన్సర్ కీపై జూన్ 15 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. జులై 19న ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసిన ఎన్టీఏ.. జులై 21న సీయూఈటీ పీజీ ఫలితాలను వెల్లడించింది. 

ALSO READ:

ఏయూ-బీటీహెచ్‌ ఇంటిగ్రేటెడ్ బీఎస్‌ ఎంఎస్‌ ప్రోగ్రామ్‌, విదేశాల్లో చదివే ఛాన్స్!
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ, స్వీడన్‌లోని బ్లెకింగే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(బీటీహెచ్‌) సహకారంతో నిర్వహిస్తున్న బీఎస్‌-ఎంఎస్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇది ఆరేళ్ల వ్యవధి గల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌. మొదటి మూడేళ్లు ఏయూలో, చివరి మూడేళ్లు స్వీడన్‌ బీటీహెచ్‌లో చదవాల్సి ఉంటుంది. 
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

బీఆర్క్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణలోని ఆర్కిటెక్చర్ కాలేజీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ నిర్వహించే ఆప్టిట్యూడ్‌ టెస్టు ఎన్‌ఏటీఏ (NATA)–2021లో (లేదా) జేఈఈ మెయిన్స్ పేపర్‌–2 (బీఆర్క్‌)–2021లో అర్హత సాధించినవారు, ఇంటర్ (ఎంపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు, పదోతరగతితోపాటు డిప్లొమా పూర్తిచేసిన వారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాష్ట్రవ్యాప్తంగా 10 ఆర్కిటెక్చర్ కాలేజీల్లో 830 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 12 నుంచి 22 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది.
ప్రవేశాల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

MAT: ‘మ్యాట్'-2023 సెప్టెంబరు నోటిఫికేషన్ వెల్లడి, పరీక్ష షెడ్యూలు ఇలా!
ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేట్‌ (ఏఐఎంఏ)-2023 సెప్టెంబర్ సెషన్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (MAT) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. తాజాగా మ్యాట్ 2023 సెప్టెంబరు నోటిఫికేషన్ విడుదలైంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

ఇకపై ఆ కాలేజీల్లోనూ ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనలకు ఛాన్స్!
ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనలు చేయాలనుకునేవారికి జేఎన్‌టీయూ హైదరాబాద్ శుభవార్త వినిపించింది. ఇకపై జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలల్లోనూ విద్యార్థులు పరిశోధనలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. రాష్ట్రంలో 170 ఇంజినీరింగ్ కళాశాలల్లో ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనలకు అవకాశం కల్పిస్తున్నట్లు జేఎన్‌టీయూహెచ్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జేఎన్‌టీయూ అనుబంధ ఇంజినీరింగ్ కాలేజీల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు, పరిశోధనలను నిర్వహించేందుకుగాను ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

UK Student Visa Rules: ఇకపై యూకేలో చదువులు మరింత ప్రియం.. విద్యార్థి వీసా నిబంధనల్లో కీలక మార్పులు!
ఇకపై యూకేలో చదువులు మరింత ప్రియం.. విద్యార్థి వీసా నిబంధనల్లో కీలక మార్పులు!
NEET PG Exam 2026: మద్యం మత్తులో నీట్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లిన విద్యార్థి.. వెనక్కి పంపిన సిబ్బంది
మద్యం మత్తులో నీట్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లిన విద్యార్థి.. వెనక్కి పంపిన సిబ్బంది
NEET PG Exam: నీట్ పీజీ ఎగ్జామ్, మారథాన్ నిర్వహణ.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
నీట్ పీజీ ఎగ్జామ్, మారథాన్ నిర్వహణ.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
Mahatma Jyothiba Phule Overseas Vidya Nidhi: విదేశాల్లో చదువులకు తెలంగాణ సర్కార్ సాయం.. బీసీ, ఈబీసీ విద్యార్థులకు రూ.20 లక్షల వరకు స్కాలర్ షిప్!.. పూర్తి వివరాలు ఇవే!
విదేశాల్లో చదువులకు తెలంగాణ సర్కార్ సాయం.. బీసీ, ఈబీసీ విద్యార్థులకు రూ.20 లక్షల వరకు స్కాలర్ షిప్

వీడియోలు

Ishan Kishan Century Duleep Trophy Final | సెలెక్టర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇషాన్ కిషన్
Vaibhav Suryavanshi Duleep Trophy Final Knock | దులీప్ ట్రోఫీ ఫైనల్లో వైభవ్ విధ్వంసం
PCB Takes Custody Of Team Phones | పాకిస్తాన్ ప్లేయర్స్ ఫోన్లు సీజ్
Gundenininda Gudigantalu Serial September 7 | వరలక్ష్మీ వ్రతంలో రోహిణికి ట్విస్ట్
Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Sunitha Laxma Reddy: పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
TG Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. 22ఏ భూముల అస్త్రంతో ప్రతిపక్షాలు రెడీ!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. 22ఏ భూముల అస్త్రంతో ప్రతిపక్షాలు రెడీ!
AP Local Body Elections: ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
Konda Surekha Political Future: బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం ఉండదు - బీజేపీలో ఇమడలేరు - కొండా దంపతులకు దారేది?
బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం ఉండదు - బీజేపీలో ఇమడలేరు - కొండా దంపతులకు దారేది?
TVS Jupiter 110 డ్యూయల్ టోన్ ఎడిషన్.. కొనేముందు ఈ 8 విషయాలు తెలుసుకోండి!
కొత్తగా డ్యూయల్ టోన్ రంగులే కాదు.. TVS Jupiter 110లో ఇవి కూడా ప్రత్యేకతలే!
హైవేపై మురికి టాయిలెట్ కనిపించిందా? ఫొటో తీసి ₹1,000 FASTag క్రెడిట్ పొందండి!
రూ.1,000 ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ "ఫ్రీ"గా పొందే ఛాన్స్‌ - మీ ఫోన్‌తో ఫొటో తీస్తే చాలు!
Hyderabad Fake Transgenders Extortion: గ్రేటర్ హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్ల అరాచకాలు - నకిలీ హిజ్రాల మాఫియా - పోలీసులు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు?
గ్రేటర్ హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్ల అరాచకాలు - నకిలీ హిజ్రాల మాఫియా - పోలీసులు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు?
వర్షంలో కారు నడుపుతున్నారా? ఈ చిన్న పరికరాలు మీ దగ్గర ఉంటే టెన్షన్‌-ఫ్రీ, పెద్ద ఖర్చు కూడా కాదు!
వర్షాకాలంలో మీ కారులో ఇవి ఉండాల్సిందే.. ఈ చిన్న యాక్సెసరీస్‌తో మీరు సేఫ్‌, కారు సేఫ్‌!
Embed widget