అన్వేషించండి

CSIR UGC NET 2022: సీఎస్ఐఆర్‌ యూజీసీ నెట్‌ షెడ్యూలు వెల్లడి, హాల్‌టికెట్లు ఎప్పుడంటే?

జూనియర్‌ రిసెర్చ్‍ ఫెలోషిప్‌, లెక్చరర్‌షిప్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్​‍గా అర్హత సాధించేందుకు నిర్వహించే ఈ పరీక్షలు కంప్యూటర్‌ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించనున్నారు.

సీఎస్ఐఆర్‌ – యూజీసీ నెట్‌ పరీక్షలను సెప్టెంబరు 16, 17, 18 తేదీల్లో నిర్వహించనున్నట్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. జూనియర్‌ రిసెర్చ్‍ ఫెలోషిప్‌, లెక్చరర్‌షిప్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్​‍గా అర్హత సాధించేందుకు నిర్వహించే ఈ పరీక్షలు కంప్యూటర్‌ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించనున్నారు. అభ్యర్థులు సెప్టెంబరు 10 నుంచి తమ అడ్మిట్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సెప్టెంబరు 13 వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.

Website


సీఎస్‌ఐఆర్‌ నెట్‌ పరీక్షను మొత్తం ఐదు విభాగాల్లో నిర్వహిస్తారు. అవి.. కెమికల్‌ సైన్సెస్, ఎర్త్‌ సైన్సెస్‌(అట్మాస్ఫియరిక్, ఓషన్‌ అండ్‌ ప్లానిటరీ సైన్సెస్‌), లైఫ్‌ సైన్సెస్, మ్యాథమెటికల్‌ సైన్సెస్, ఫిజికల్‌ సైన్సెస్‌. మొత్తం 200 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి. అవి పార్ట్‌–ఎ, పార్ట్‌–బి, పార్ట్‌–సి. పరీక్ష సమయం 3 గంటలు(180 నిమిషాలు).

పార్ట్‌–ఎ:
ఈ విభాగం పరీక్ష అందరికి ఉమ్మడిగానే ఉంటుంది. ఇందులో లాజికల్‌ రీజనింగ్, గ్రాఫికల్‌ అనాలిసిస్, అనలిటికల్‌ ఎబిలిటీ, న్యూమరికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ కంపారిజన్, సిరీస్, ఫార్మేషన్, పజిల్స్‌ తదితర అంశాల నుంచి 20 ప్రశ్నలుంటాయి. వీటిలో 15 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి సరైన సమాధానానికి రెండు మార్కుల చొప్పున కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.5శాతం నెగిటివ్‌ మార్కులుంటాయి.


పార్ట్‌–బి:
ఈ విభాగంలో అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌ ఆధారంగా ప్రశ్నలుంటాయి. ఇందులో అడిగే ప్రశ్నల సంఖ్య ఆయా సబ్జెక్టులను అనుసరించి భిన్నంగా ఉంటుంది. కెమికల్‌ సైన్సెస్‌ నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో 35 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.5శాతం మార్కుల కోత విధిస్తారు. ఎర్త్‌ సైన్సెస్, లైఫ్‌ సైన్సె విభాగాల నుంచి 50 చొప్పున ప్రశ్నలు ఇస్తారు. ఇందులో 35 ప్రశ్నలను ఎంపిక చేసుకోవాలి. ప్రతి సరైన సమాధానానికి రెండు మార్కుల చొప్పున కేటాయిస్తారు. తప్పు సమాధానానికి 0.5 శాతం మార్కుల కోత ఉంటుంది. మ్యాథమెటికల్‌ సైన్సెస్‌ నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో 25 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కుల చొప్పున కేటాయిస్తారు. తప్పు సమాధానానికి 0.75శాతం మార్కులను కోతగా విధిస్తారు. ఫిజికల్‌ సైన్సెస్‌లో 25 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు 3.5 మార్కుల చొప్పున కేటాయిస్తారు. తప్పు సమాధానానికి 0.875శాతం మార్కుల కోత ఉంటుంది.


పార్ట్‌–సి:
ఈ విభాగంలో అభ్యర్థి స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. సబ్జెక్టులోని శాస్త్రీయ అనువర్తనాలను అన్వయించే నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. ఇందులో అడిగే ప్రశ్నల సంఖ్య ఆయా సబ్జెక్టులను అనుసరించి భిన్నంగా ఉంటాయి. కెమికల్‌ సైన్సెస్‌లో 60 ప్రశ్నలు ఇస్తారు. 25 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. వీటిలో ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులను కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. ఎర్త్‌ సైన్సెస్‌లో 80 ప్రశ్నల్లో 25 ప్రశ్నలకు సమాధానం గుర్తించాలి. సరైన సమాధానానికి నాలుగు మార్కులు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1.32శాతం మార్కుల కోత విధిస్తారు. లైఫ్‌ సైన్స్‌ విభాగం నుంచి 75 ప్రశ్నలు ఇస్తారు. 25 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. సరైన సమాధానానికి 4 మార్కును కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత ఉంటుంది. మ్యాథమెటికల్‌ సైన్సెస్‌లో 60 ప్రశ్నలుంటాయి. 20 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు 4.75 మార్కుల చొప్పున ఈ విభాగంలోని ప్రశ్నలకు కేటాయించారు. ఇందులో నెగిటివ్‌ మార్కులు లేవు. ఫిజికల్‌ సైన్సెస్‌లో 30 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో 20 ప్రశ్నలకు సమాధానం గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 5 మార్కులు ఇస్తారు, తప్పు సమాధానానికి 1.25శాతం మార్కుల కోత విధిస్తారు.

CSIR UGC NET 2022: సీఎస్ఐఆర్‌ యూజీసీ నెట్‌ షెడ్యూలు వెల్లడి, హాల్‌టికెట్లు ఎప్పుడంటే?

సీఎస్ఐఆర్‌ యూజీసీ నెట్‌ గురించి.. 
సైన్స్‌ రంగంలో పరిశోధనలు సాగించాలనుకునే ప్రతిభావంతులకు చక్కటి మార్గంగా చెప్పవచ్చు. సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) జాతీయ స్థాయిలో ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో ప్రతిభ ద్వారా జేఆర్‌ఎఫ్‌(జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌) సాధించిన విద్యార్థులకు ప్రముఖ సంస్థలో పరిశోధనలు చేసే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా యూజీసీ గుర్తింపు పొందిన కళాశాలల్లో ప్రొఫెసర్‌ /లెక్చరర్‌గా కెరీర్‌ ప్రారంభించవచ్చు. 


ఫెలోషిప్‌ ప్రయోజనాలు:
* సైన్స్‌ విద్యార్థులకు సీఎస్‌ఐఆర్‌ నెట్‌ కెరీర్‌ పరంగా అత్యంత ముఖ్యమైన పరీక్ష. ఇందులో అర్హత పొంది ఫెలోషిప్‌ సాధిస్తే చక్కటి కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. దేశంలోని గొప్ప సైంటిస్ట్‌లతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది.
* సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌ ద్వారా జేఆర్‌ఎఫ్‌ సాధించిన అభ్యర్థులకు సీఎస్‌ఐఆర్‌ పరిశోధన సంస్థలతోపాటు ఇతర ప్రతిష్టాత్మక సంస్థల్లో పరిశోధనలు చేసే అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో రెండేళ్ల పాటు నెలకు రూ.31వేల ఫెలోషిప్, అలాగే అదనంగా ఏటా కంటిన్‌జెన్సీ గ్రాంట్‌ కింద రూ.20వేలు పొందవచ్చు.
* రెండేళ్ల జేఆర్‌ఎఫ్‌ పూర్తిచేసుకున్న అభ్యర్థులు పీహెచ్‌డీకి రిజిస్టర్‌ చేసుకుంటే.. సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్‌)గా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ.35 వేలు ఫెలోషిప్‌ లభిస్తుంది.
* నేషనల్‌ ఫెలోషిప్‌ ఫర్‌ షెడ్యూల్‌ క్యాస్ట్‌ స్టూడెంట్స్, నేషనల్‌ ఫెలోషిప్‌ ఫర్‌ అదర్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్, మౌలానా అజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌ ఫర్‌ మైనారిటీ స్టూడెంట్స్‌ వంటి ఫెలోషిప్‌లకు కూడా సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌లో ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేస్తారు. 


లెక్చరర్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌:
* నెట్‌లో అర్హతతో దేశంలోని అన్ని డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీ/తత్సమాన హోదా ఉన్న సంస్థల్లో లెక్చరర్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కెరీర్‌ ప్రారంభించవచ్చు. 
* తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు భర్తీ చేసే డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. నెట్‌/స్లెట్‌లో అర్హత తప్పనిసరి. 
* ఐఐటీ, ఐఐఎస్సీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పరిశోధన కోర్సుల్లో ప్రవేశాలకు నెట్‌ /జేఆర్‌ఎఫ్‌ ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. అంతేకాకుండా ఓఎన్‌జీసీ వంటి కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నియామకాల కోసం నెట్‌ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటాయి.


Also Read:

AUSDE: ఏయూ దూరవిద్య కోర్సుల నోటిఫికేషన్‌ విడుదల
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి దూరవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏయూ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఏడాదిలో రెండు సార్లు దూరవిద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంటుంది. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

 


Also Read:

BRAOU:  అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబరు 15 వరకు అడ్మిషన్లకు అవకాశం కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

 

Also Read:

UOH PhD: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 2022 -23 ఏడాదికి వివిధ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ ప్రవేశాలకు ఆన్‌‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా మొత్తం 42 కోర్సుల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించనున్నారు. మొత్తం 281 సీట్లలో ప్రవేశాలు కల్పించనున్నారు. వీటిలో జనరల్ అభ్యర్థులకు 99 సీట్లు, ఎస్సీ అభ్యర్థులకు 43 సీట్లు, ఎస్టీ అభ్యర్థులకు 21 సీట్లు, ఓబీసీ అభ్యర్థులకు 76 సీట్లు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 28 సీట్లు, దివ్యాంగులకు 14 సీట్లు కేటాయించారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget