News
News
వీడియోలు ఆటలు
X

NEET UG Intimation Slip: నీట్‌-యూజీ పరీక్ష సిటీ ఇంటిమేషన్ స్లిప్స్‌ వచ్చేశాయ్! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

నీట్‌ యూజీ పరీక్షను మే 7న నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీట్-యూజీ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్స్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏప్రిల్ 30న విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ పరీక్షను మే 7న నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీట్-యూజీ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్స్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏప్రిల్ 30న విడుదల చేసింది. పెన్ను, పేపర్‌ విధానంలో దేశవ్యాప్తంగా 499 నగరాలు/పట్టణాల్లో నిర్వహించనున్న పరీక్షకు ఎన్టీఏ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లో అభ్యర్థులు పరీక్ష రాసే నగరం, పరీక్ష తేదీ వివరాలు ఉంటాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో పాటు అక్కడ పేర్కొన్న సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేయడంతో సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

➥ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌ కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

➥ అక్కడ హోంపేజీలో కనిపించే 'NEET (UG) 2023 City Display' లింక్ మీద క్లిక్ చేయాలి.

➥ ఆ తర్వాత వచ్చే లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో పాటు అక్కడ పేర్కొన్న సెక్యూరిటీ పిన్‌ వివరాలు నమోదుచేసి SUBMIT బటన్ మీద క్లిక్ చేయాలి.

➥ క్లిక్ చేయగానే అభ్యర్థులకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్ కనిపిస్తుంది. 

➥ అభ్యర్థులు స్లిప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి.

➥ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌‌లో అభ్యర్థి వివరాలు, పరీక్ష కేంద్రం వివరాలు చూసుకోవచ్చు.

సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌ కోసం క్లిక్ చేయండి.. 

Website


నీట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను ఎన్‌టీఏ ఒకట్రెండు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను పెన్ను, పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. నీట్‌ పరీక్షను గతేడాది 17.64లక్షల మంది విద్యార్థులు రాయగా.. ఈ ఏడాది దాదాపు 18లక్షల మంది రాసే అవకాశం ఉందని అంచనా. నీట్ పరీక్ష మే 7న (ఆదివారం) మధ్యాహ్నం 2గంటల నుంచి 5.20 గంటల మధ్య జరగనుంది.

నీట్ యూజీ పరీక్ష విధానం..
➥ నీట్ ప్రవేశ పరీక్ష పూర్తి ఆఫ్‌లైన్‌ (పెన్, పేపర్) విధానంలో నిర్వహించబడుతుంది. మూడు గంటల 20 నిముషాల నిడివితో జరిగే ఈ పరీక్షలో ప్రతి సబ్జెక్టు నుండి గరిష్టంగా 45 ప్రశ్నలు చెప్పున మొత్తం 180 ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రశ్నలు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ మరియు జూవాలాజీ సబ్జెక్టులకు సంబంధించి ఉంటాయి.

➥ ఒక్కో సబ్జెక్టు నుంచి రెండు సెక్షన్ల (సెక్షన్-ఎ, బి) వారీగా 50 ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-ఎ నుంచి 35 ప్రశ్నలు, సెక్షన్-బి నుంచి 15 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-బి లోని 15 ప్రశ్నల్లో 10 ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అభ్యర్థి సమాధానం చేసిన మొదటి 10 ప్రశ్నలను మాత్రమే లెక్కింపు సమయంలో పరిగణలోకి తీసుకుంటారు.

➥ ప్రతి ప్రశ్న మల్టిఫుల్ ఛాయస్ పద్దతిలో నాలుగు ఆప్షనల్ సమాధానాలు కలిగి ఉంటుంది. అందులో ఒక సరైన సమాధానాన్ని గుర్తించవలసి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. తప్పు సమాధానం ఇచ్చిన ప్రశ్నకు మైనస్ 1 మార్కు ఇవ్వబడుతుంది.

➥ మొత్తం 720 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 10+2/ఇంటర్మీడియట్ స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలాజీ) లకు సంబంధించిన సిలబస్ నుండి ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్న పత్రాలు దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

Also Read:

టీఎస్ ఎంసెట్-2023 హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లను ఉన్నత విద్యామండలి ఏప్రిల్ 30న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఇంటర్ (క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్) హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్ & మెడికల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక మే 12-14 మధ్య ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. 
ఎంసెట్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి.. 

పాలిసెట్‌ దరఖాస్తు గడువు పెంపు, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలో పాలిసెట్ దరఖాస్తు గడువును పొడిగించారు. రూ.200 ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకునేందుకు మే 14 వరకు గడువు పెంచినట్లు పాలిసెట్ కన్వీనర్ డాక్టర్ శ్రీనాథ్ ఏప్రిల్ 25న ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100 ఆలస్య రుసుంతో దరఖాస్తు గడువు ఏప్రిల్ 25తో ముగియగా.. రూ.200 ఆలస్య రుసుముతో మే 14 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పదోతరగతి పూర్తయిన, చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 17న పాలిసెట్ ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు.
పాలిసెట్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 30 Apr 2023 10:33 PM (IST) Tags: NEET UG NEET UG 2023 NEET UG Exam City Slip 2023 NEET UG Exam City Slip NEET UG 2023 exam city slip NEET UG 2023 exam city allotment NEET UG 2023 Exam NEET UG 2023 Admit Card

సంబంధిత కథనాలు

Inter Results: తెలంగాణ ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్స్ ఇవే!

Inter Results: తెలంగాణ ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్స్ ఇవే!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

TS DEECET: డీఈఈసెట్‌ ప్రిలిమినరీ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

TS DEECET: డీఈఈసెట్‌ ప్రిలిమినరీ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

హెచ్‌సీయూలో ఎంటెక్ కోర్సు, ఎస్సీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు!

హెచ్‌సీయూలో ఎంటెక్ కోర్సు, ఎస్సీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు!

EMRS Teacher Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

EMRS Teacher Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

YS Viveka Case :  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి -   సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు, తెలంగాణలో వేడి కాస్త తక్కువే - ఐఎండీ

Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు, తెలంగాణలో వేడి కాస్త తక్కువే - ఐఎండీ

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?