అన్వేషించండి

UGC NET Application: యూజీసీ నెట్ (జూన్) - 2024 దరఖాస్తు గడువు పొడిగింపు, ఎప్పటివరకు అవకాశమంటే?

యూజీసీ నెట్ (జూన్)-2024 దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పొడిగించింది. మే 10తో దరఖాస్తు గడువు ముగియాల్సి ఉంది. అయితే దరఖాస్తు గడువును మే 15 వరకు పొడిగిస్తూ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది.

UGC NET June 2024 Application: దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ (జూన్)-2024 దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పొడిగించింది. దరఖాస్తు ప్రక్రియ మే 20న ప్రారంభంకాగా.. మే 10తో దరఖాస్తు గడువు ముగియాల్సి ఉంది. అయితే దరఖాస్తు గడువును మే 15 వరకు పొడిగిస్తూ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా పరీక్ష ఫీజు చెల్లించడానికి మే 16, 17 తేదీల్లో అవకాశం కల్పించింది. అభ్యర్థులు మే 17న రాత్రి 11.59 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చు. ఇక దరఖాస్తుల సవరణకు మే 18 -  మే 20 (రాత్రి 11.59 గంటల వరకు) వరకు అవకాశం కల్పించింది. దరఖాస్తుకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే ఫోన్ నెంబరు: 011 - 40759000 /011 - 69227700 లేదా ఈమెయిల్: ugcnet@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.

కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్-రూ.1150; ఈడబ్ల్యూఎస్/ఓబీసీ(నాన్-క్రిమిలేయర్)-రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్-రూ.325 చెల్లించాలి. 

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం  జూన్ 16న యూజీసీ నెట్-2024 పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో, రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మొదటి షిఫ్టులో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో షిఫ్టులో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.

* యూజీసీ నెట్ - జూన్ 2024 వివరాలు..

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా నాలుగేళ్ల డిగ్రీ లేదా ఎనిమిది సెమిస్టర్ల డిగ్రీ ప్రోగ్రామ్‌లో 75 శాతం మార్కులు లేదా సమానమైన గ్రేడ్‌లను సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ (నాన్ క్రిమీ లేయర్), దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ఇతర వర్గాలకు చెందిన వారికి 5శాతం మార్కులు/గ్రేడ్‌లలో సడలింపు ఉంటుంది.

వయోపరిమితి: 01.06.2024 నాటికి జేఆర్‌ఎఫ్ పోస్టులకు 30 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎలాంటి వయోపరిమితి లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్-రూ.1150; ఈడబ్ల్యూఎస్/ఓబీసీ(నాన్-క్రిమిలేయర్)-రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్-రూ.325 చెల్లించాలి.

పరీక్ష విధానం..

➥ ఆన్‌లైన్ (సీబీటీ) విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మూడు గంటల సమయం ఉంటుంది.

➥ పేపర్-1కు గంట, పేపర్-2 కు రెండు గంటల సమయం ఉంటుంది. పేపర్-1 లో 100 మార్కులకుగాను 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైవర్‌జెంట్ థింకింగ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

➥ పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థుల ఆప్షనల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.

తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, హయత్‌నగర్, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్. 

ఏపీలో పరీక్ష కేంద్రాలు: అమరావతి, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నర్సరావుపేట, నెల్లూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

ఇలా దరఖాస్తు చేసుకోండి..

➥ అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి. - ugcnet.nta.nic.in.  

➥ అక్కడ హోంపేజీలో కనిపించే UGC NET June - 2024 లింక్ పై క్లిక్ చేయాలి.

➥ స్క్రీన్‌పై వచ్చిన పేజీలో వివరాలను నింపి, సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. దాంతో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.

➥ ఆ తరువాత, మీ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలి. UGC NET June 2024 అప్లికేషన్ ఫామ్‌ను ఫిల్ చేయాలి.

➥ అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేసి, ఆన్‌లైన్‌లో ఫీ చెల్లించాలి.

➥ అప్లికేషన్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకుని పెట్టుకోవాలి.

ముఖ్యమైన తేదీలివే..

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 20.04.2024.

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 15.05.2024 (11.59 PM).

➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 16 - 17.05.2024 (11:58 P.M).

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 18 - 20.05.2024 (11.59 PM) 

➥ ఎగ్జామ్ సిటీ వివరాల వెల్లడి: తర్వాత వెల్లడిస్తారు.

➥ అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్: తర్వాత వెల్లడిస్తారు.

➥ యూజీసీ నెట్ (జూన్)- 2024 పరీక్షలు: 16.06.2024.

➥ ఆన్సర్ కీ వెల్లడి: తర్వాత తెలియజేస్తారు.

Notification

Online Application

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం
Hyderabad News: హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
Kadapa Mayor Election: కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం.. 9న హైకోర్టులో విచారణ
కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం..
Suriya 47 Movie: మలయాళ దర్శకుడితో సూర్య సినిమా... కొత్త బ్యానర్ షురూ - రోల్ ఏమిటంటే?
మలయాళ దర్శకుడితో సూర్య సినిమా... కొత్త బ్యానర్ షురూ - రోల్ ఏమిటంటే?

వీడియోలు

మాపై ఎందుకు పగబట్టారు..? మేం ఎలా బ్రతకాలో చెప్పండి..!
Yashasvi Jaiswal Century vs SA | వన్డేల్లోనూ ప్రూవ్ చేసుకున్న యశస్వి జైశ్వాల్ | ABP Desam
Rohit Sharma Virat Kohli Comebacks | బీసీసీఐ సెలెక్టర్లుకు, కోచ్ గంభీర్ కి సౌండ్ ఆఫ్ చేసిన రోహిత్, కోహ్లీ | ABP Desam
Virat Kohli vs Cornad Grovel Row | నోటి దురదతో వాగాడు...కింగ్ బ్యాట్ తో బాదించుకున్నాడు | ABP Desam
Virat kohli No Look six vs SA | తనలోని బీస్ట్ ను మళ్లీ బయటకు తీస్తున్న విరాట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం
Hyderabad News: హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
Kadapa Mayor Election: కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం.. 9న హైకోర్టులో విచారణ
కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం..
Suriya 47 Movie: మలయాళ దర్శకుడితో సూర్య సినిమా... కొత్త బ్యానర్ షురూ - రోల్ ఏమిటంటే?
మలయాళ దర్శకుడితో సూర్య సినిమా... కొత్త బ్యానర్ షురూ - రోల్ ఏమిటంటే?
Harish Rao Challenges Revanth Reddy: రేవంత్ రెడ్డికి బండ కట్టి రంగనాయక సాగర్‌లో పడేస్తా - హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డికి బండ కట్టి రంగనాయక సాగర్‌లో పడేస్తా - హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
Malavika Mohanan: ఫోటోగ్రాఫర్‌గా మారిన రాజా సాబ్ హీరోయిన్... టైగర్ సఫారీలో మాళవికా మోహనన్
ఫోటోగ్రాఫర్‌గా మారిన రాజా సాబ్ హీరోయిన్... టైగర్ సఫారీలో మాళవికా మోహనన్
Smriti Mandhana Wedding: పలాష్ ముచ్చల్, స్మృతి మంధానా పెళ్లి రద్దు.. క్లారిటీ ఇచ్చిన టీమిండియా క్రికెటర్
పలాష్ ముచ్చల్, స్మృతి మంధానా పెళ్లి రద్దు.. క్లారిటీ ఇచ్చిన టీమిండియా క్రికెటర్
త్వరలో మార్కెట్లోకి కొత్త Skoda Kushaq.. పనోరమిక్ సన్‌రూఫ్ సహా లెవెల్-2 ADAS ఫీచర్లు
త్వరలో మార్కెట్లోకి కొత్త Skoda Kushaq.. పనోరమిక్ సన్‌రూఫ్ సహా లెవెల్-2 ADAS ఫీచర్లు
Embed widget