అన్వేషించండి

AP 10th Supplementary Exams: ఏపీ టెన్త్ ఫెయిల్ విద్యార్థులకు సర్కార్ ఊరట, ఫీజు చెల్లించకుండానే సప్లిమెంటరీ హాల్ టికెట్స్

AP SS Supplementary Exam Date 2022: ఏపీలో టెన్త్ ఫెయిన్ అయిన విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులు ఫీజు కట్టకున్నా హాల్ టికెట్స్ జారీ చేయనున్నారు.

ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు మొదలుకావడం నుంచి రిజల్ట్స్ త‌రువాత సైతం ప‌రిస్దితులు రోజురోజుకు మారిపోతున్నాయి. ఏపీ టెన్త్ ఫలితాల్లో కేవలం 67 శాతం విద్యార్థులు పాసయ్యారు. అయితే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాత్రం ఎలాంటి సప్లిమెంటరీ పరీక్షలు లేకుండానే పాస్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజులు కట్టించుకోకుండా సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులను అనుమతించాలని కోరిన నేప‌థ్యంలో టెన్త్ ఫెయిన్ అయిన విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులు ఫీజు కట్టకున్నా హాల్ టికెట్స్ జారీ చేయనున్నారు.

ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల నుండి ఫీజు వసూలు చేసినప్పటికీ ప్రభుత్వానికి కట్టనవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి .వి.నారాయణ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ‌నివాస‌రావు వెల్ల‌డించారు. సప్లిమెంటరీ పరీక్షలకు చెల్లించాల్సిన ఫీజులపై విద్యార్థులు ఆందోళన చెందనవసరం లేదని వెల్ల‌డించారు. ప్రస్తుతానికి విద్యార్థుల వద్ద నుంచి వసూలు చేసిన ఫీజును ప్ర‌ధానోపాధ్యాయుల వ‌ద్ద‌నే ఉంచుకోవాలని వారికి సూచించారు. ప్ర‌భుత్వం స‌ప్ల‌మెంట‌రీ ప‌రీక్ష ఫీజును 500, రీవెరిఫికేష‌న్ కు వెయ్యి రూపాయ‌లుగా నిర్ణ‌యించింది. జూలై 6 నుంచి జూలై 15 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స ఫలితాలు వచ్చిన రోజు తెలిపారు. 

రెండేళ్ల తరువాత బోర్డ్ ఎగ్జామ్స్.. ఎన్నో పరీక్షలు
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రెండేళ్ల పాటు పరీక్షలు లేకుండానే విద్యార్థులను ఏపీ ప్రభుత్వం టెన్త్, ఇంటర్ పాస్ చేస్తూ వస్తోంది. గత విద్యా సంవత్సరంలో కరోనా నుంచి కోలుకోవడంతో తరగతులు కొన్ని నెలలు నిర్వహించారు. విద్యార్థులకు సిలబస్ తగ్గింపు, పేపర్లు తగ్గింపు లాంటి ఊరట కలిగించే ఎన్నో నిర్ణయాలను ఏపీ విద్యాశాఖ తీసుకుంది. రెండేళ్ల అనంతరం గతంలో నిర్వహించినట్లు ఏపీ టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించారు. కానీ ఈ సారి ఎన్నో రాజకీయ పరిణామాల మధ్య పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. ఉత్తీర్ణత శాతం చాలా తగ్గడంతో ప్రతిపక్షాలు ఏపీ ప్రభుత్వాన్ని లక్ష్యాన్ని చేసుకుని విమర్శలు గుప్పించాయి. అయితే విద్యార్థులు సొంతంగా పాస్ కావాలని, ప్రభుత్వం నేరుగా పాస్ చేస్తే వారి జీవితాలను నాశనం చేయడం అవుతుందని భావించారు. మార్కులు కలపడం ఉండదని, సప్లిమెంటరీ రాసి పాస్ కావాలని విద్యార్థులకు సీఎం జగన్ సైతం సూచించారు.

మూడు, నాలుగు మార్కుల వరకు తక్కువ రావడంతో ఫెయిలైన టెన్త్ విద్యార్థులను పాస్ చేయాలని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కొందరు డిమాండ్ చేశారు. మరికొందరైతే ఏకంగా 10 శాతం గ్రేస్ మార్కులు కలిపి పాస్ చేయాలని ప్రభుత్వానికి సూచించగా.. కొందరు నేతలు ప్రతి టెన్త్ క్లాస్ విద్యార్థిని పాస్ చేసి వారికి న్యాయం చేయాలన్నారు. అందుకు కరోనాను కారణంగా చూపించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం మాత్రం తమ నిర్ణయానికి కట్టుబడి ఉందని, విద్యార్థులు సప్లిమెంటరీ రాసి పాస్ కావడం వారి జీవితాలకు మేలు చేస్తుందన్నారు. అయితే ఈ ఏడాది సప్లి రాసి పాసైన వారిని రెగ్యూలర్ విద్యార్థుల తరహాలో డైరెక్ట్ పాస్ అయినట్లు మెమోలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఫీజుల కోసమే పరీక్షలని విమర్శలు రావడంతో విద్యార్థుల వద్ద నుంచి ప్రస్తుతానికి ఎలాంటి ఫీజు వసూలు చేయవద్దని, అందరికీ హాల్ టికెట్లు జారీ చేయాలని ఏపీ ప్రధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ‌నివాస‌రావు వెల్ల‌డించారు.

Also Read: AP 10th Supplementary Exams: ఏపీ టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ఊరట, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం 

Also Read: AP SSC Supplementary Exam 2022: జూలైలో ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు, తేదీలు ప్రకటించిన మంత్రి బొత్స

టాప్ హెడ్ లైన్స్

Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget