అన్వేషించండి

Telangana: రేవంత్ సర్కారుకు ఎన్ఎంసీ షాక్, కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి నిరాకరణ

Medical Colleges: తెలంగాణలో 8 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి నిరాకరించింది. అవసరమైన నిబంధనలు పాటించడంలో విఫలమయ్యారంటూ అనుమతి ఇవ్వడానికి నిరాకరించింది.

News Medical Colleges in Telangana: రేవంత్ రెడ్డి సర్కారుకు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) షాకిచ్చింది. రాష్ట్రంలో ఎనిమిది కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతి నిరాకరించింది. 2024-25 విద్యాసంవత్సరానికిగానున గద్వాల, మెదక్, ములుగు, షాద్‌నగర్, నారాయణపేట, యాదాద్రి, కుత్బుల్లాపూర్, నర్సంపేటలలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటకు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) తెలంగాణ దరఖాస్తు చేసుకుంది. ఒక్కో కాలేజీలో 50 సీట్లు కేటాయించాలని కోరింది. అయితే, అవసరమైన నిబంధనలు పాటించడంలో విఫలమయ్యారంటూ అనుమతిచ్చేందుకు ఎన్‌ఎంసీ నిరాకరించింది. 

అనుమతికి ఇవి తప్పనిసరి..
నిబంధనల ప్రకారం.. కొత్తగా 50 ఎంబీబీఎస్‌ సీట్లతో వైద్య కళాశాల ఏర్పాటు కావాలంటే.. 14 మంది ప్రొఫెసర్లు, 20 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 25 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉండాలి. అంటే మొత్తంగా 59 మంది బోధన సిబ్బంది తప్పనిసరిగా ఉండాలి. అయితే ఈ కొత్త 8 కాలేజీల్లో ప్రిన్సిపాళ్లు, హాస్పిటల్ సూపరింటెండెంట్లు తప్ప మిగతా సిబ్బంది నియామకం జరగలేదు. ఇటీవల ఎన్‌ఎంసీ బృందం తనిఖీలకు వచ్చింది. ఈ సందర్భంగా అసలు ఫ్యాకల్టీ లేకపోవడంపై ఎంఏఆర్బీ(Medical Assessment & Rating Board) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆయా కళాశాలల్లో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ.. ప్రిన్సిపాళ్లకు మెయిల్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. అలాగే కొత్త మెడికల్‌ కాలేజీల అనుబంధ ఆస్పత్రుల్లో అవుట్‌ పేషంట్స్‌, ఇన్‌పేషంట్స్‌పై కూడా ఎన్‌ఎంసీ అసంతృప్తి వ్యక్తం చేసింది.

60 రోజుల్లోగా సరిదిద్దుకోవాలి.. 
ఎన్‌ఎంసీ లేవనెత్తిన లోపాలను వైద్యారోగ్యశాఖ 60 రోజుల్లోగా సవరించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అనుమతులు మంజూరుచేయరు. అయితే ఈ లోగా కొత్త కాలేజీలకు సంబంధించి నియామక ప్రక్రియ పూర్తికావటం అనేది అనుమానమే. ఇటీవల అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందినవారిని కేటాయించినా.. ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, సీనియర్‌ రెసిడెంట్ల నియమాక ప్రక్రియ ఎప్పుడు ప్రారంభం అవుతుందో, ఎపుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే కొత్త మెడికల్‌ కాలేజీలకు అనుమతులపై శ్రద్ధ పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. సిబ్బంది నియామకాలకు సంబంధించి ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ మొదటి నుంచీ వైద్యారోగ్యశాఖకు గుర్తు చేస్తున్నా పట్టించుకోలేదు.

పునఃపరిశీలన కోరనున్న డీఎంఈ..
మెడికల్ కాలేజీల అననుమతి అంశాన్ని పునఃపరిశీలించాలని ఎన్‌ఎంసీని కోరాలని డీఎంఈ నిర్ణయించింది. మరోసారి దరఖాస్తు చేసేందుకూ కసరత్తు చేస్తోంది. కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభం నుంచే అన్ని విభాగాలు, అనుబంధ బోధనాసుపత్రి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని ఎన్‌ఎంసీ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈ విషయమై డీఎంఈ ఉన్నతాధికారులు మాట్లాడుతూ.... షాద్‌నగర్, కుత్బుల్లాపూర్ మినహా మిగిలిన ఆరింటికి అనుమతులు వస్తాయని భావించాం. భవనాల సమస్య లేకున్నా కొన్నిచోట్ల అనుబంధ ఆసుపత్రులు, సిబ్బందిపై ఎన్‌ఎంసీ అసంతృప్తి వ్యక్తంచేసింది. బోధనా సిబ్బందిని సర్దుబాటు చేసే ప్రక్రియ కొనసాగుతుండగానే నిర్ణయం వెలువడింది. ఇప్పటికే ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల పదోన్నతులు ఇచ్చాం. తాజా బదిలీల్లోనూ కొత్త వైద్య కళాశాలల్లోని పోస్టులకు ప్రాధాన్యం ఇవ్వనున్నాం. తనిఖీల సమయంలో లేని సదుపాయాలను తర్వాత సమకూర్చాం. అందుకే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఎన్‌ఎంసీని కోరుతామని డీఎంఈ అధికారులు అంటున్నారు. 8 కాలేజీల్లో కనీసం కొన్నింటినైనా ఈ ఏడాది ప్రారంభించాలనే ఆలోచనతో ఉన్నట్లు డీఎంఈ తెలిపింది. ఈ నెలాఖరు నాటికి మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముందని.. అన్ని అంశాలపై వైద్యారోగ్య శాఖ మంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు వివరించారు.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget