(Source: ECI/ABP News/ABP Majha)
NICMAR: పుణె నిక్‌మర్‌లో యూజీ, పీజీ కోర్సులు - వివరాలు ఇలా
పుణెలోని నిక్‌మర్ యూనివర్సిటీ 2024 విద్యాసంవత్సరానికి గాను పలు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు.
పుణెలోని నిక్‌మర్ యూనివర్సిటీ 2024 విద్యాసంవత్సరానికి గాను పలు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు డిసెంబరు 17లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు...
➥ స్కూల్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్
➥ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్
➥ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్
➥ నిక్‌మర్ బిజినెస్ స్కూల్
➥ స్కూల్ ఆఫ్ ప్రాజెక్టు, రియల్ ఎస్టేట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
విభాగాలు..
1) స్కూల్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్
* ఎంబీఏ ఇన్ అడ్వాన్స్‌డ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్
* పీసీడీ ఇన్ క్వాంటిటీ సర్వీంగ్ అండ్ కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్
2) స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్
* మాస్టర్ ఆఫ్ ప్లానింగ్(అర్బన్ ప్లానింగ్)
* బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్
3) స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్
* ఎంటెక్ ఇన్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్
* బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్)
4) స్కూల్ ఆఫ్ ఎనర్జీ & ఎన్విరాన్‌మెంట్
* ఎంబీఏ ఇన్ సస్టెయినబుల్ ఎనర్జీ మేనేజ్‌మెంట్
* ఎంబీఏ ఇన్ ఎన్విరాన్‌మెంటల్ సస్టెయినబులిటీ.
5) నిక్‌మర్ బిజినెస్ స్కూల్
* ఎంబీఏ( 7 స్పెషలైజేషన్లు)
* ఎంబీఏ ఇన్ ఫ్యామిలీ బిజినెస్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్.
* ఎంబీఏ ఇన్ ఫిన్‌టెక్
* బీబీఏ/ బీబీఏ(హానర్స్)/ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ
6) స్కూల్ ఆఫ్ ప్రాజెక్టు, రియల్ ఎస్టేట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
* ఎంబీఏ ఇన్ అడ్వాన్స్‌డ్ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్
* ఎంబీఏ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరితేది: 17.12.2023.
ALSO READ:
కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సులు - వివరాలు ఇలా
వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, 2023-24 విద్యా సంవత్సరానికి వర్సిటీతో పాటు అనుబంధ కళాశాలల్లో ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో ప్రవేశానికి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ప్రవేశాలు కోరేవారు అక్టోబరు 1 నుంచి అక్టోబరు 7 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
యూజీసీనెట్ (డిసెంబరు)-2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్షలు ఎప్పుడంటే?
దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ (డిసెంబరు)-2023 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎన్టీరంగా యూనివర్సిటీలో యూజీ కోర్సుల్లో ఎన్నారై కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్, ప్రవేశం ఇలా
గుంటూరులోని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి అగ్రికల్చర్ కోర్సుల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రవేశాలు కోరువారు నిర్ణీత నమూనాలో రూ.200 విలువచేసే నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్‌పై అండర్‌టేకింగ్ ఇవాల్సి ఉంటుంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..