అన్వేషించండి

NEET PG Admitcard: నీట్‌ పీజీ - 2024 అడ్మిట్‌ కార్డులు వచ్చేశాయ్, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?

NEET PG Exam: నీట్ పీజీ-2024 అడ్మిట్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు తమరిజిస్ట్రేషన్ నంబర్, అవసరమైన వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

NEET PG 2024 Admit Card: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ పీజీ)-2024 అడ్మిట్ కార్డులను 'నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌ (NBEMS)' విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. జూన్ 23న కంప్యూటర్ ఆధారిత విధానంలో నీట్‌ పీజీ-2024 పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్ష ఫలితాలను జులై 15న వెల్లడించనున్నారు.

బ్యాచ్‌లవారీగా అడ్మిట్‌కార్డులు..
నీట్ పీజీ 2024 (NEET PG) పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను 'బ్యాచ్-వైస్ (Batch-Wise)' విధానంలో అందుబాటులో ఉంచనున్నట్లు నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌ వెల్లడించింది. NBEMS నిర్వహించే ఏ పరీక్షలోనైనా మంచి మార్కులు/మెరిట్ పొజిషన్‌ను పొందడం గురించి అభ్యర్థులకు NBEMS ఎలాంటి ఈమెయిల్ లేదా SMS ద్వారా పంపదు. అభ్యర్థులు మోసపూరిత వ్యక్తులు, ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోవద్దని NBEMS సూచించింది. అభ్యర్థులకు NBEMS ఎలాంటి ఫోన్ కాల్స్ చేయదు (లేదా) NBEMS నిర్వహించే ఏదైనా పరీక్షలకు సంబంధించి ఎలాంటి అన్యాయమైన, చట్ట విరుద్ధమైన ప్రకటనలు చేయదని స్పష్టంచేసింది.

నీట్‌ పీజీ 2024 అడ్మిట్‌ కార్డులు వచ్చేశాయ్, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?

➥ అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి - nbe.edu.in

➥ అక్కడ హోమ్‌పేజీలో కనిపించే ‘NEET PG’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.

➥ అక్కడ లాగిన్ పేజీలో అభ్యర్థులు తమరిజిస్ట్రేషన్ నంబర్, అవసరమైన వివరాలు నమోదుచేయాలి.

➥ వెంటనే స్క్రీన్‌ పై NEET PG Admit Card 2024 ఓపెన్‌ అవుతుంది.

➥ అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవాలి.

NEET PG Admit Card Link

NEET PG Admitcard: నీట్‌ పీజీ - 2024 అడ్మిట్‌ కార్డులు వచ్చేశాయ్, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?

నీట్ పీజీ పరీక్ష విధానం..
నీట్ పీజీ పరీక్షను మొత్తం 800 మార్కులకు నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే పరీక్షలో మొత్తం మూడు విభాగాల నుంచి 200 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి పరీక్షకు 4 మార్కులు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం మూడున్నర గంటలు. ఇంగ్లిష్‌ మాధ్యమంలో మాత్రమే ప్రశ్నలు అడుగుతారు.

'టైమ్-బౌండ్ సెక్షన్' విధానం అమలు..
నీట్ పీజీ పరీక్ష(NEET PG 2024)లో ఈసారి నుంచి 'టైమ్-బౌండ్ సెక్షన్ (Time Bound Sections)' విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. టైమ్‌ బౌండ్‌ సెక్షన్స్‌ విధానంలో పరీక్షలో సెక్షన్ల వారీగా సమయాన్ని కేటాయించడం. దీనిప్రకారం క్వశ్చన్ పేపర్‌ను సెక్షన్ల వారీగా విభజించి.. ప్రతి సెక్షన్‌కు కొంత సమయం కేటాయిస్తారు. ఆ సెక్షన్‌ను ఇచ్చిన సమయంలో పూర్తిచేసిన తర్వాతనే తర్వాతి సెక్షన్‌ ఓపెన్‌ అవుతుంది. మల్టిపుల్‌ఛాయిస్ ప్రశ్నలతో నిర్వహించే నీట్‌ పీజీతో పాటు NBEMS నిర్వహించే ఇతర పరీక్షల సమయంలో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పరీక్షల సెక్యూరిటీ, ప్రాముఖ్యతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

'టైమ్-బౌండ్ సెక్షన్' పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

అర్హత మార్కులు: నీట్ పీజీ-2024 ప్రవేశ పరీక్షలో అర్హత మార్కులను జనరల్/ఈడబ్యూఎస్ అభ్యర్థులకు 50 పర్సంటైల్, జనరల్(PwD) అభ్యర్థులకు 50 పర్సంటైల్, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ (PwD కలిపి) అభ్యర్థులకు 40 పర్సంటైల్‌గా నిర్ణయించారు. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా మొత్తం 259 నగరాల్లో నీట్ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 34 నగరాలు/పట్టణాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. అమలాపురం, అమరావతి, అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, హైదరాబాద్, కడప, కాకినాడ, కరీంనగర్, కావలి, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, కర్నూలు, మహబూబ్‌నగర్, నల్గొండ, నంద్యాల, నెల్లూరు, నిజామాబాద్, ఒంగోలు, రాజంపేట, సత్తుపల్లి, సిద్ధిపేట, సూరంపాలెం, సూర్యాపేట, తాడేపల్లిగూడెం, తాడిపత్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, వరంగల్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.

దేశంలోని వైద్య కళాశాలల్లో పీజీ కోర్సుల్లో (PG Medical Courses) ప్రవేశాలకు ఏప్రిల్ 16న నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌(NBEMS) నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 16 నుంచి మే 6 వరకు దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తుల సవరణకు ఏప్రిల్ 10 నుంచి 16 వరకు అవకాశం కల్పించింది. ఇక మే 28 నుంచి జూన్ 13 వరకు, జూన్ 7 నుంచి 10 వరకు దరఖాస్తుల సవరణకు తుది అవకాశం కల్పించింది. పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను జూన్ 18న విడదుల చేయనునన్నట్లు నోటిఫికేషన్ సమయంలో వెల్లడించింది. దరఖాస్తు చేసుకున్నవారికి జూన్ 23న నీట్ పీజీ పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఆన్సర్ 'కీ' ప్రక్రియ తర్వాత పరీక్ష ఫలితాలను జూన్ 25న వెల్లడించనుంది.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Telangana News : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
Electricity Bill Payment: మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABPJasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Telangana News : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
Electricity Bill Payment: మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్‌ పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణుల బృందం- డయాఫ్రంవాల్‌ గురించి ఏం చెప్పారంటే?
పోలవరం ప్రాజెక్ట్‌ పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణుల బృందం- డయాఫ్రంవాల్‌ గురించి ఏం చెప్పారంటే?
Thangalaan : విక్ర‌మ్ 'తంగలాన్' ఫ‌స్ట్ రివ్యూ ఇచ్చేసిన జీ.వి. ప్ర‌కాశ్.. ఏమ‌న్నారంటే?
విక్ర‌మ్ 'తంగలాన్' ఫ‌స్ట్ రివ్యూ ఇచ్చేసిన జీ.వి. ప్ర‌కాశ్.. ఏమ‌న్నారంటే?
Andhra Pradesh: చెప్పాపెట్టకుండానే ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
చెప్పాపెట్టకుండానే ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
Pawan Kalyan: “ఆరోపిస్తారు.. ఆధారాలు అడిగితే సైలెంట్ అవుతారు”.. పవన్ పై వైసీపీ ఫైర్
“ఆరోపిస్తారు.. ఆధారాలు అడిగితే సైలెంట్ అవుతారు”.. పవన్ పై వైసీపీ ఫైర్
Embed widget