దేశవ్యాప్తంగా 57 కళాశాలల్లో నాలుగేళ్ల బీఈడీ కోర్సులు, వీరు మాత్రమే అర్హులు!
ఇంటర్ తర్వాత ఉపాధ్యాయ విద్య చదవాలనుకున్న వారు ప్రవేశాలు పొందవచ్చు. ప్రస్తుతం మూడేళ్లు డిగ్రీ, రెండేళ్లు బీఈడీ చదివేందుకు ఐదేళ్లు పడుతోంది. సమీకృత బీఈడీ కోర్సుతో ఏడాది ఆదా అవుతుంది.
దేశవ్యాప్తంగా వచ్చే 2023-24 విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల ఇంటిగ్రేడెట్ బీఈడీ కోర్సుల నిర్వహణకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) ఆమోదం తెలిపింది. ప్రయోగాత్మకంగా 57 ప్రముఖ జాతీయ, రాష్ట్ర ఉపాధ్యాయ విద్యా సంస్థల్లో దీన్ని ప్రారంభించింది. బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ, బీకాం బీఈడీ కోర్సులను నిర్వహిస్తారు.
ఇంటర్ తర్వాత ఉపాధ్యాయ విద్య చదవాలనుకున్న వారు ప్రవేశాలు పొందవచ్చు. ప్రస్తుతం మూడేళ్లు డిగ్రీ, రెండేళ్లు బీఈడీ చదివేందుకు ఐదేళ్లు పడుతోంది. సమీకృత బీఈడీ కోర్సుతో ఏడాది ఆదా అవుతుంది. జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా వీటిల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సులో జాతీయ విద్యావిధానంలోని 5+3+3+4 స్థాయుల్లో బోధన ఉంటుంది. ఫౌండేషన్, సన్నద్ధత, మధ్య, సెకండరీ స్థాయిల్లోని విద్యార్థుల బోధనకు అనుగుణంగా అభ్యర్థులకు శిక్షణనిస్తారు. ఈ మేరకు ఎన్‌సీటీఈ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Also Read:
ఉచితంగా చదువు చెప్తారు, ఆపై విద్యార్హతను బట్టి డబ్బులు కూడా ఇస్తారు - ఎక్కడంటే?
ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా చదువు చెప్పడం గురించి అందరికీ తెలిసిందే. అలాగే ప్రైవేటు బడుల్లో వేల నుంచి మొదలుకొని లక్షలు, కోట్ల వరకు కూడా ఫీజులు వసూలు చేసే స్కూళ్లు కొన్ని. కానీ బడిలో విద్య ఉచితంగా చెప్పి అది పూర్తయిన తర్వాత డబ్బులు కూడా ఇచ్చే పాఠశాలలు ఉన్నాయి. అదేంటి అనుకుంటున్నారా.. అవునండీ నిజం. గుజరాత్ లోని ఓ పాఠశాలలో ఉచితంగా చదువు చెప్పడమే కాకుండా.. చదువు పూర్తయ్యారు లక్ష రూపాయల నుంచి ఆరు లక్షల రూపాయల వరకు విద్యార్హతను బట్టి ఇస్తారు. అయితే ఇదెక్కడ, ఇలా ఎందుకు ఇస్తారు వంటి వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ప్రైవేటు విద్యాసంస్థల్లో ‘విద్యా హక్కు’ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు విద్యా సంస్థల్లో 25 శాతం ప్రవేశాలకు మార్చి 4న నోటిఫికేషన్ వెలువడింది. ప్రైవేటు పాఠశాలలు మార్చి 6 నుంచి 16 వరకు ఆన్‌లైన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థులు 18 నుంచి ఏప్రిల్ 7లోపు దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశాలకు అర్హత పొందిన విద్యార్థుల ఎంపిక ప్రక్రియ ఏప్రిల్ 9 నుంచి 12 వరకు జరుగనుంది. మొదటి జాబితాను ఏప్రిల్ 13న విడుదల చేయనున్నారు.
ప్రవేశ ప్రకటన, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్!
తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(APSWREIS) పరిధిలోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2023-2024 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన 'బీఆర్ఏజీ ఇంటర్ సెట్-2023' నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన బాలబాలికలు ఆన్‌లైన్ ద్వారా మార్చి 24 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు క్రీడలు/ వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 167 గురుకులాల్లో మొత్తం 13,970 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..