Gujarat School: ఉచితంగా చదువు చెప్తారు, ఆపై విద్యార్హతను బట్టి డబ్బులు కూడా ఇస్తారు - ఎక్కడంటే?
Gujarat School: ఉచితంగా చదువు చెప్పడంతో పాటు వసతి కూడా కల్పిస్తారు. ఆపై విద్య పూర్తయ్యాక.. వారి విద్యార్హతను బట్టి లక్ష రూపాయల నుంచి ఆరు లక్షల వరకు అందజేస్తారు.
Gujarat School: ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా చదువు చెప్పడం గురించి అందరికీ తెలిసిందే. అలాగే ప్రైవేటు బడుల్లో వేల నుంచి మొదలుకొని లక్షలు, కోట్ల వరకు కూడా ఫీజులు వసూలు చేసే స్కూళ్లు కొన్ని. కానీ బడిలో విద్య ఉచితంగా చెప్పి అది పూర్తయిన తర్వాత డబ్బులు కూడా ఇచ్చే పాఠశాలలు ఉన్నాయి. అదేంటి అనుకుంటున్నారా.. అవునండీ నిజం. గుజరాత్ లోని ఓ పాఠశాలలో ఉచితంగా చదువు చెప్పడమే కాకుండా.. చదువు పూర్తయ్యారు లక్ష రూపాయల నుంచి ఆరు లక్షల రూపాయల వరకు విద్యార్హతను బట్టి ఇస్తారు. అయితే ఇదెక్కడ, ఇలా ఎందుకు ఇస్తారు వంటి వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గుజరాత్‌లోని మెహసానాలో ఉన్న 'శ్రీమద్ యశోవిజయ్‌జీ జైన్ సంస్కృత పాఠశాల' ఓ ప్రత్యేకమైన పాఠశాల. ఇది 125 ఏళ్ల నాటి సంస్థ. ఈ పాఠశాలలో మొదటి విద్యార్థి యోగనిష్ఠ శ్రీ బుద్ధి సాగర్ సూరీశ్వర్జీ మహరాజ్. ఈయనే 1897వ సంవత్సరం ఈ పాఠశాలను స్థాపించారు. మెహసానాలో ఉన్న ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల నుండి ఎలాంటి ఫీజులు వసూలు చేయరు. అలాగే ఆరేళ్ల వరకు ఉచితంగానే విద్య, ఆహారం అందిస్తారు. ఇక్కడే ఉండి అన్ని రకాల సౌకర్యాలను పొందతూ.. ఫ్రీగా చదువుకోవచ్చు. అంతేకాకుండా చదువు పూర్తి చేసిన పిల్లలకు వారి విద్యార్హతను బట్టి రూ.1 నుంచి 6 లక్షల వరకు అందజేస్తారు. సమాచారం ప్రకారం ఇప్పుడు 2850 మంది పిల్లలు ఇక్కడ చదువుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ స్థిరపడిన గుజరాత్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి పిల్లలు ఇక్కడకు వచ్చి చదువుకుంటున్నారు.
30 లక్షల మంది విద్యార్థులకు ప్రవేశాలు..
ప్రతి సంవత్సరం 30 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలో ప్రవేశం పొందుతున్నారు. పాఠశాలకు చెందిన ప్రకాష్ భాయ్ పండిట్ మాట్లాడుతూ.. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మరెవరి నుంచి కూడా ఎలాంటి రుసుము వసూలు చేయమని చెప్పారు. పాఠశాలలో నాలుగేళ్లు చదివిన వారికి రూ.లక్ష, 6 ఏళ్లు పూర్తయిన వారికి రూ.2 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. ఇది కాకుండా కొత్తగా జైన్ సంస్కృత పాఠశాలను నిర్మించే పనులు కొనసాగుతున్నాయని పండిట్ వివరించారు. వీటి ఖరీదు 13 కోట్లు. కొత్త క్యాంపస్‌లో క్యాంటీన్, హాస్టల్ తదితర అనేక సౌకర్యాలు పిల్లలకు అందుతాయని చెప్పారు. దీనితో పాటు పాఠశాల లోపల జైన దేవాలయాన్ని కూడా నిర్మించనున్నారు.