అన్వేషించండి

UGC NET Admit Card: యూజీసీ నెట్‌-2024 జూన్ సెషన్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

UGC NET 2024 Admit Card: దేశవ్యాప్తంగా ఆగస్టు 21 నుంచి ప్రారంభంకానున్న యూజీసీనెట్ జూన్ 2024 పరీక్షల అడ్మిట్ కార్డులను ఎన్టీఏ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది.

UGC NET 2024 June Session Admit Card: యూజీసీ నెట్-2024 జూన్ సెషన్‌కు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆగస్టు 17న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచింది. యూజీసీ నెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 4 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో యూజీసీ నెట్ జూన్-2024 సెషన్ పరీక్ష నిర్వహించన్నారు. అయితే ప్రస్తుతానికి ఆగస్టు 21 నుంచి 23 వరకు నిర్వహించే పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను మాత్రమే ఎన్టీఏ విడుదల చేసింది. మిగతా పరీక్షల హాల్‌టికెట్లను తర్వాత విడుదల చేయనున్నారు.  మొత్తంగా 83 సబ్జెక్టులకు యూజీసీ నెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. యూజీసీ నెట్ జూన్ 2024కి సంబంధించి ఏమైనా సందేహాలుంటే ఫోన్ నెంబరు- 011-40759000 లేదా ఈమెయిల్- ugcnet@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు. 

నీట్ ఎగ్జామ్ లో అవకతవకలు జరిగాయని కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా నిరసన, ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలు చేస్తుండగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 18న నిర్వహించిన యూజీసీ నెట్-2024 పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కొత్త షెడ్యూలును ప్రకటించగా.. ఆగస్టు 21 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. 

యూజీసీ నెట్-2024 (జూన్ సెషన్) అడ్మిట్ కార్డు ఇలా డౌన్‌లోడ్ ఇలా..

Step 1: అడ్మిట్ కార్డు కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. -ugcnet.nta.nic.in.

Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే 'UGC NET June 2024: Click Here to Download Admit Card' లింక్ మీద క్లిక్ చేయాలి.

Step 3: అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి లాగిన్ అవ్వాలి.

Step 4: కంప్యూటర్ స్క్రీన్ మీద అడ్మిట్ కార్డు దర్శనమిస్తుంది.

Step 5: అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకొని, భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసి భద్రపర్చుకోవాలి.

UGC NET Admit Card (June)-2024

పరీక్ష విధానం..

➥ ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మూడు గంటల సమయం ఉంటుంది.

➥ పేపర్-1కు గంట, పేపర్-2 కు రెండు గంటల సమయం ఉంటుంది. పేపర్-1 లో 100 మార్కులకుగాను 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైవర్‌జెంట్ థింకింగ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

➥ పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థుల ఆప్షనల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.

తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, హయత్‌నగర్, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్. 

ఏపీలో పరీక్ష కేంద్రాలు: అమరావతి, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నర్సరావుపేట, నెల్లూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

UGC NET Admit Card: యూజీసీ నెట్‌-2024 జూన్ సెషన్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?UGC NET Admit Card: యూజీసీ నెట్‌-2024 జూన్ సెషన్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

UGC NET Admit Card: యూజీసీ నెట్‌-2024 జూన్ సెషన్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
Raj Mantena: అమెరికా అధ్యక్షుడి కొడుకు, బాలీవుడ్ స్టార్లు.. ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఇంత గ్రాండ్ వెడ్డింగ్! అసలు ఎవరీ రామరాజు మంతెన?
కూతురు పెళ్లికి జూనియర్ ట్రంప్‌నే దించాడు.. ఎవరీ రాజ్‌ మంతెన..?
ABP Southern Rising Summit: ఏబీపీ నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో పాల్గొని కీలక ప్రసంగం చేయనున్న కేటీఆర్
ఏబీపీ నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో పాల్గొని కీలక ప్రసంగం చేయనున్న కేటీఆర్
India Win Womens T20 World Cup: చారిత్రాత్మక విజయం.. అంధుల మహిళల టీ20 ప్రపంచ కప్ విజేతగా భారత్
చారిత్రాత్మక విజయం.. అంధుల మహిళల టీ20 ప్రపంచ కప్ విజేతగా భారత్
Advertisement

వీడియోలు

కెప్టెన్‌గా రాహుల్.. షమీకి మళ్లీ నిరాశే..!
India vs South Africa 2nd Test Match Highlights | మూడో సెషన్లో టీమిండియా కం బ్యాక్
England vs Australia Ashes 2025 | ఆస్ట్రేలియా ఘన విజయం
Travis Head Records in Ashes 2025 | ట్రావిస్ హెడ్ రికార్డుల మోత
Shreyas Iyer Injury IPL 2026 | టీ20 ప్రపంచకప్‌ కు అయ్యర్ దూరం ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
Raj Mantena: అమెరికా అధ్యక్షుడి కొడుకు, బాలీవుడ్ స్టార్లు.. ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఇంత గ్రాండ్ వెడ్డింగ్! అసలు ఎవరీ రామరాజు మంతెన?
కూతురు పెళ్లికి జూనియర్ ట్రంప్‌నే దించాడు.. ఎవరీ రాజ్‌ మంతెన..?
ABP Southern Rising Summit: ఏబీపీ నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో పాల్గొని కీలక ప్రసంగం చేయనున్న కేటీఆర్
ఏబీపీ నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో పాల్గొని కీలక ప్రసంగం చేయనున్న కేటీఆర్
India Win Womens T20 World Cup: చారిత్రాత్మక విజయం.. అంధుల మహిళల టీ20 ప్రపంచ కప్ విజేతగా భారత్
చారిత్రాత్మక విజయం.. అంధుల మహిళల టీ20 ప్రపంచ కప్ విజేతగా భారత్
Balakrishna Met Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ సీఎం యోగిని కలిసిన బాలకృష్ణ... Akhanda 2 త్రిశూలం బహుకరణ
ఉత్తరప్రదేశ్ సీఎం యోగిని కలిసిన బాలకృష్ణ... Akhanda 2 త్రిశూలం బహుకరణ
Ramana Gogula : ఆస్ట్రేలియా To అమెరికా - రమణ గోగుల ఇంటర్నేషనల్ మ్యూజికల్ జర్నీ... ది ట్రావెలింగ్ సోల్జర్
ఆస్ట్రేలియా To అమెరికా - రమణ గోగుల ఇంటర్నేషనల్ మ్యూజికల్ జర్నీ... ది ట్రావెలింగ్ సోల్జర్
New Education Model: వేదాలు, భగవద్గీత, కంప్యూటర్ సైన్స్ కలయికతో పాఠాలు: కొత్త విద్యా విధానంపై BSB యోచన
వేదాలు, భగవద్గీత, కంప్యూటర్ సైన్స్ కలయికతో పాఠాలు: కొత్త విద్యా విధానంపై BSB యోచన
High allert in Agency: రంపచోడవరం ఏజెన్సీలో హై అలర్ట్: ప్రజాప్రతినిధులకు పోలీసుల హెచ్చరిక, కారణం ఇదే!
రంపచోడవరం ఏజెన్సీలో హై అలర్ట్: ప్రజాప్రతినిధులకు పోలీసుల హెచ్చరిక, కారణం ఇదే!
Embed widget