NEET Admit Card 2022: నీట్ యూజీ హాల్‌టిక్కెట్లు వచ్చేశాయ్.. ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి!!
నీట్ యూజీ హాల్‌టిక్కెట్లను విడుదల చేశారు. కింది లింగ్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
NEET Admit Card 2022:దేశవ్యాప్తంగా జులై 17న నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) 2022 పరీక్షకు సంబంధించిన హాల్‌టిక్కెట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం (జులై 13) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థుల హాల్‌టిక్కెట్లను అందుబాటులో ఉంచింది. విద్యార్థులు లాగిన్ వివరాలు అప్లికేషన్ నెంబరు, పుట్టిన తేది వివరాలను నమోదుచేసి తమ అడ్మిట్ కార్డులను పొందవచ్చు.
నీట్ పీజీ 2022 స్కోర్ కార్డ్స్ ఇలా సింపుల్‌గా Download చేసుకోండి, Cutoff కూడా తెలుసుకోవచ్చు
ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 17 (ఆదివారం)న మధ్యాహ్నం 2 గం. నుంచి 5.20 గం. వరకు పరీక్ష నిర్వహించనున్నారు. నీట్-2022 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులను అడ్మిట్ కార్డు లేనిదే పరీక్ష రాయడానికి అనుమతించరు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్ కార్డుతోపాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఐడీ కార్డు లేదా ఆధార్ కార్డును తమ వెంట తీసుకెళ్లాలి.
మెడికల్ పీజీ విద్యార్థులతో కేంద్రం ఆటలు - సుప్రీంకోర్టు ఆగ్రహం !
విద్యార్థులు తమ పరీక్ష కేంద్రం, పరీక్ష సమయం, తేది తదితర వివరాలను అడ్మిట్ కార్డులో చూసుకోవచ్చు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో నీట్-2022 పరీక్షను వాయిదా వేయాలంటూ కొందరు అభ్యర్థులు కోరినప్పటికీ ఇదివరకే ప్రకటించిన షెడ్యూలు ప్రకారం పరీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
Download NEET Admit Card 2022:
https://neet.nta.nic.in/download-admit-card-for-neet-ug-2022-is-live-now/
or
https://examinationservices.nic.in/neet2022/DownloadAdmitCard/LoginDOB.aspx?enc=WPJ5WSCVWOMNiXoyyomJgATm16WDSuAdfwpi7ZXy4cM3hblcyDpJgf1oyFFZyuBY
NEET Admit Card 2022 ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి:
- మొదట ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ https://neet.nta.nic.in/ ను ఓపెన్ చేయాలి
- NEET UG 2022 అడ్మిట్ కార్డ్ అనే లింక్‌పై క్లిక్ చేయాలి
- అప్లికేషన్ పోర్టల్‌లోకి లాగిన్ కావాలి
- నీట్-2022 అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది
- డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.
నీట్ పరీక్ష 13 భాషల్లో పెన్ అండ్ పేపర్ మోడ్‌లో నిర్వహించనున్నారు. నీట్ పరీక్ష వ్యవధి మూడు గంటల 20 నిమిషాలు. మొత్తం 200 ప్రశ్నలకు నీట్ పరీక్ష ఉంటుంది. వీటిలో అభ్యర్థులు 180 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు ఉంటాయి. తప్పు సమాధానాలకు 1 మార్కు కోత ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని తెలిసిన ఆన్సర్లు మాత్రమే టిక్ చెస్తే ఎక్కువ మార్కులు సాధించేందుకు అవకాశం ఉంటుంది.