Medical Seats: కొత్తగా పది మెడికల్ పీజీ సీట్లు, కాకతీయ మెడికల్ కాలేజీకి కేటాయింపు!
తెలంగాణలో మరో పది మెడికల్ పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కాకతీయ వైద్య కళాశాలకు ఎమర్జెన్సీ మెడిసిన్‌లో 5 నెఫ్రాలజీ విభాగంలో మరో 5 డీఎం సీట్లు మంజూరు చేస్తూ ఎన్‌ఎంసీ ఉత్తర్వులు జారీచేసింది.
తెలంగాణలో మరో పది మెడికల్ పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కాకతీయ వైద్య కళాశాలకు ఎమర్జెన్సీ మెడిసిన్ పీజీలో అయిదు, నెఫ్రాలజీ విభాగంలో మరో అయిదు డీఎం సీట్లు మంజూరు చేస్తూ జాతీయ వైద్యమండలి (ఎన్‌ఎంసీ) ఉత్తర్వులు జారీచేసింది. ఎమర్జెన్సీ మెడిసిన్‌లో పీజీ సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలలో మొదటిసారిగా అందుబాటులోకి వచ్చాయి. తాజాగా మంజూరైన వాటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 2,558 పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. అదనపు సీట్లు రావడంపై రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వైద్యవిద్య డైరెక్టరేట్‌ని అభినందించారు. ఇది చాలా మంచి పరిణామమని ట్విటర్‌లో పేర్కొన్నారు.
Congratulations @dme_telangana for achieving 5 seats in MD Emergency Medicine, For the first time in #Telangana, State led Govt colleges and also getting approval for 5 seats in DM Nephrology in Kakatiya Medical College, Warangal.#TelanganaHealth @TelanganaCMO pic.twitter.com/8RMM9EG2YW
— Harish Rao Thanneeru (@BRSHarish) March 31, 2023
Also Read:
నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్- 2023 నోటిఫికేషన్ వెల్లడి, పరీక్ష ఎప్పుడంటే?
భువనేశ్వర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ & రిసెర్చ్ (నైసర్), యూనివర్సిటీ ఆఫ్ ముంబయి ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ (సీఈబీఎస్) సంస్థల్లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్) 2023' నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఫిబ్రవరి 27 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1,200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.
పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏకలవ్య గురుకుల ప్రవేశ ప్రకటన విడుదల, పరీక్ష వివరాలు ఇలా!
తెలంగాణ రాష్ట్రంలోని 23 ఏకలవ్య గురుకుల విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశాలకు, 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. బోధనా మాధ్యమం ఇంగ్లీషులో సీబీఎస్ఈ సిలబస్ బోధిస్తారు. అర్హులైన గిరిజన, ఆదివాసి గిరిజన, సంచార గిరిజన, పాక్షిక సంచార గిరిజన, డీనోటిఫైడ్ ట్రైబ్ తదితర కేటగిరీలకు చెందిన విద్యార్థులు ఏప్రిల్ 20లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మే 7న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, విద్య, శిక్షణ అందిస్తారు.
ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..
సైనిక పాఠశాలలో ఆరో తరగతి, ఇంటర్ ప్రవేశ ప్రకటన విడుదల-పరీక్ష ఎప్పుడంటే?
ఎన్‌డీఏ, ఎస్‌ఎస్‌బీ తదితర సైనిక దళాల్లో అధికారుల నియామకాల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ సైనిక పాఠశాలను బాలుర కోసం ప్రత్యేకంగా ప్రారంభించింది. పాఠశాలలో సైనిక శిక్షణే ప్రధానాంశంగా ఉంటుంది. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్)... 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో బాలుర సైనిక స్కూల్ ఆరో తరగతి (సీబీఎస్‌ఈ సిలబస్), ఇంటర్మీడియట్(ఎంపీసీ- సీబీఎస్ఈ సిలబస్)లో ప్రవేశాలకి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..