NII PhD Admissions: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీలో పీహెచ్‌డీ ప్రవేశాలు - పూర్తి వివరాలు ఇవే!
NII: ఢిల్లీలోని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ' 2024-25 విద్యాసంవత్సరం(మాన్‌సూన్ సెషన్)కి పీహెడీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
National Institute of Immunology (NII) PhD Admissions: ఢిల్లీలోని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ' 2024-25 విద్యాసంవత్సరం(మాన్‌సూన్ సెషన్)కి పీహెడీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుల సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. నిర్ణీత ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
* పీహెచ్‌డీ ప్రవేశాలు
విభాగాలు...
➥ ఇమ్యూనాలజీ
➥ ఇన్‌ఫెక్షియస్ అండ్ క్రానిక్ డిసీజ్ బయాలజీ
➥ మాలిక్యులర్ అండ్ సెల్యూలర్ బయాలజీ
➥ కెమికల్ బయాలజీ
➥ స్ట్రక్చరల్ బయాలజీ
➥ కంప్యూటేషనల్ బయాలజీ
అర్హత: ఎంఎస్సీ (బయాలజీ/కెమిస్ట్రీ/మ్యాథమెటిక్స్/ఫిజిక్స్), ఎంటెక్, ఎంబీబీఎస్, ఎంఫార్మసీ, ఇంటిగ్రెటడ్ ఎంఎస్సీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. ఇంటర్ స్థాయిలో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. అదేవిధంగా డిగ్రీ/పీజీ స్థాయిలో కనీసం 55 శాతం మార్కులు ఉండాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు 5 శాతం మార్కులు మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.1200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు రూ. 600.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఎన్‌ఐఐ-2024-25 ప్రవేశ పరీక్ష (లేదా) జాయింట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇన్ బయాలజీ అండ్ ఇంటర్ డిసిప్లినరీ లైఫ్‌సైన్సెస్ (జేజీఈఈబీఐఎల్‌ఎస్-2024) ప్రవేశ పరీక్ష స్కోరు ఆధారంగా షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ముఖ్యమైన తేదీలు:
➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభతేది: 26.02.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు చివరితేది: 25.03.2024.
➥ అడ్మిన్ కార్డులు డౌన్లోడ్ తేదీ: 08.04.2024
➥ ఎన్‌ఐఐ ప్రవేశ పరీక్ష: 28.04.2024
➥ ప్రవేశ పరీక్ష ఫలితాల వెల్లడి: 06.05.2024
➥ మొదటి, రెండో రౌండ్ ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు: 04.06.2024 - 12.06.2024.
➥ విద్యా సంవత్సరం ప్రారంభం: 01.07.2024.
ALSO READ:
TS EAPCET - 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కోసం నిర్వహించనున్న 'టీఎస్ ఈఏపీసెట్-2024' నోటిఫికేషన్‌ను జేఎన్టీయూ-హైదరాబాద్ ఫిబ్రవరి 21న విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఎప్‌సెట్-2024 దరఖాస్తు ప్రక్రియ సోమవారం (ఫిబ్రవరి 26న) ప్రారంభమైంది. విద్యార్థులు ఏప్రిల్ 6 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రూ.250 ఆలస్య రుసుమతో ఏప్రిల్ 9 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 14 వరకు, రూ.2500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 19 వరకు, రూ.5000 ఆలస్య రుసుముతో మే 4 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తు వివరాల్లో ఏమైనా తప్పులుంటే ఏప్రిల్ 8 నుంచి 12 వరకు ఎడిట్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు తమ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 9 నుంచి 12 వరకు ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..