Cyber Security Course: సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు - ఇంటర్, డిగ్రీ అర్హతలు
NACS: నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
Cyber Security Courses: తెలంగాణలోని నిరుద్యోగ యువతీ, యువకులకు సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ 'నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ' డైరెక్టర్ విమలారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్ సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆమె వెల్లడించారు. ఈ కోర్సులకు ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిసెంబరు 30లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు 78931 41797లో సంప్రదించాలని విమలారెడ్డి సూచించారు.
వివరాలు..
* సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేట్ కోర్సులు
1) సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్
2) డిప్లొమా
3) పీజీ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్
4) సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్ సర్టిఫికేట్
అర్హత: ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తుకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే 78931 41797 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.12.2023.
ప్రాస్పెక్టస్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఉచిత శిక్షణ..
తెలంగాణలోని గ్రామీణ నిరుద్యోగ యువతకు వివిధ కోర్సులో ఉచిత నైపుణ్య శిక్షణ కోసం యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్‌పూర్ గ్రామంలోని స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ దరఖాస్తులు కోరుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకమైన 'దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద ఈ శిక్షణ కొనసాగనుంది. ఈ నైపుణ్య కోర్సులకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండి.. 8వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఉచిత నివాస, భోజన వసతులు కల్పిస్తారు. ఈ శిక్షణ కోర్సుల్లో ప్రవేశాలు కోరేవారు ఒరిజినల్ సర్టిఫికేట్లతో జనవరి 2న సంస్థలో హాజరుకావాల్సి ఉంటుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ..తెలంగాణ ప్రభుత్వానికి చెందిన స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో గ్రామీణ/పట్టణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగం కల్పిస్తారు. అభ్యర్థులకు శిక్షణ అనంతరం ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు ప్రారంభ వేతనంగా రూ.6000 - రూ.8000 వరకు ఉంటుంది. ఆ తర్వాత 6 నెలల నుంచి ఏడాది కాలంలో నిబంధనల ప్రకారం వేతన పెంపు ఉంటుంది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 9133908000, 9133908111, 913390822, 9949466111 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
'స్కిల్' కోర్సులకు యూజీసీ మార్గదర్శకాలు వెల్లడి, సూచనలకు ఆహ్వానం
దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో స్వల్పకాలిక 'స్కిల్ డెవలప్‌మెంట్' కోర్సులను ప్రవేశపెట్టేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) డిసెంబరు 18న మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనిపై సలహాలు, సూచనలు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. ఆర్టిఫీషియన్ ఇంటెలిజెన్స్ (AI)-మెషిన్ లెర్నింగ్, ఏఐ-రోబోటిక్స్, ఐఓటీ, ఇండస్ట్రీస్ ఐఓటీ, డేటా సైన్స్, అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి 29 విభాగాల్లో స్వల్పకాలిక నైపుణ్య కోర్సులను యూజీసీ సూచించింది. మౌలిక సదుపాయాలు, శిక్షణ సామర్థ్యం ఆధారంగా ఆయా కళాశాలలు ఈ కోర్సులను ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..