అన్వేషించండి

NEET Re Exam 2026 Issue: బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!

NEET Re Exam 2026 | నీట్ యూజీ రీఎగ్జామ్ 2026 నిర్వహణ వివాదాస్పదమైంది. పలు చోట్ల హిజాబ్ ధరించిన కారణంగా విద్యార్థినులను ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతించలేదు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అజ్మీర్ నీట్ పరీక్షా కేంద్రంలో బురఖా ధరించిన విద్యార్థిని నిరాకరణ.
  • బురఖా తీయకుంటే పరీక్ష రాయనని విద్యార్థిని కుల్సుమ్ చెప్పింది.
  • మతపరమైన దుస్తులకు ఎన్టీఏ నిబంధనలు అనుమతిస్తాయని కుటుంబం వాదన.
  • పరీక్ష కంటే గుర్తింపే ముఖ్యమని ఆమె రాయకుండానే వెనుదిరిగింది.

నీట్ పరీక్షా కేంద్రం వద్ద వివాదం: బురఖా (Hijab) తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!
అజ్మీర్ (రాజస్థాన్): నేడు జరిగిన నీట్ యూజీ రీఎగ్జామ్ సైతం వివాదంలో చిక్కుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన నీట్ యూజీ ఎగ్జామ్ సమయంలో ఎలాంటి డ్రెస్సులో వచ్చామో, ఇప్పుడు అలాగే వెళ్తే తమను ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతించలేదని ఆరోపిస్తున్నారు. అందులో ఒక ఘటన రాజస్థాన్ లోని అజ్మీర్ లో జరిగింది. 

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిన నీట్ (NEET) ప్రవేశ పరీక్షా కేంద్రం వద్ద వివాదం నెలకొంది. పరీక్ష రాయడానికి బురఖా, దుప్పట్ట ధరించి వచ్చిన ఒక ముస్లిం విద్యార్థినిని లోపలికి వెళ్లకుండా అక్కడి సిబ్బంది అడ్డుకోవడం సామాజిక వర్గాల్లో పెద్ద దుమారానికి దారితీసింది. గతంలో మే 3వ తేదీన జరిగిన పరీక్షలో ఇదే దుస్తులతో అనుమతించిన అధికారులు, ఇప్పుడు మాత్రం నిబంధనల పేరుతో లోపలికి అనుమతించకపోవడంపై విద్యార్థిని, ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎగ్జామ్ కాదు.. హిజాబ్, ఐడెంటిటీనే ముఖ్యం.. బాధిత విద్యార్థిని
బియావర్ ప్రాంతం నుండి నీట్ యూజీ పరీక్ష రాయడానికి వచ్చిన కుల్సుమ్ బానో అనే విద్యార్థిని ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గైడ్‌లైన్స్ ప్రకారం సాంప్రదాయ లేదా మతపరమైన దుస్తులు ధరించి పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కానీ ఇక్కడి సిబ్బంది అమానవీయంగా ప్రవర్తించి తనను నీట్ ఎగ్జామ్ రాసేందుకు ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతించలేదని ఆరోపించింది. మొదట దుపట్టా తీసేయాలని చెప్పిన సిబ్బంది, ఆ తర్వాత బురఖా కూడా తీసి వ్తేనే లోపలికి పంపుతామని పట్టుబట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. తన మతాచారాలకు భంగం కలిగిస్తూ పరీక్ష రాయాల్సిన అవసరం లేదని, పరీక్ష కంటే తనకు బురఖా, తన గుర్తింపే ముఖ్యమని ఆమె స్పష్టం చేస్తూ పరీక్ష రాయకుండానే వెనుదిరిగింది.

మూడేళ్లుగా నా కూతురు ప్రిపేర్ అవుతోంది.. విద్యార్థిని తండ్రి
మరోవైపు విద్యార్థిని తండ్రి మహ్మద్ ఆలిమ్ నీట్ యూజీ పరీక్షా కేంద్రం నిర్వాహకుల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్‌టీఏ నిబంధనలలోని రూల్ 18 ప్రకారం మతపరమైన దుస్తులకు స్పష్టమైన అనుమతి ఉందని ఆయన గుర్తుచేశారు. తన కుమార్తె గత మూడేళ్లుగా ఈ పరీక్ష కోసం ఎంతో కష్టపడి ప్రిపేర్ అవుతోందని చెప్పారు. అనుమానం ఉంటే మహిళా సిబ్బందితో స్క్రీన్ వెనుక ప్రైవేట్ గదిలో క్షుణ్ణంగా తనిఖీలు చేయించుకుంటామని తాము కోరినప్పటికీ, అక్కడి సిబ్బంది కనీస మానవత్వం లేకుండా ఆమెను నిరాకరించారని ఆయన ఆరోపించారు. 18 ఏళ్ల విద్యార్థుల భవిష్యత్తుతో, వారి భావోద్వేగాలతో ఇలా ఆడుకోవడం సిగ్గుచేటని వారు వాపోయారు.

మొన్న రాశారు.. నేడు మిస్సయ్యారు..

మే నెలలో జరిగి రద్దయిన నీట్ యూజీ 2026 ఎగ్జామ్‌కు హాజరైన ఎందరో విద్యార్థులు ఎన్టీఏ ఆదివారం (జూన్ 21న) నిర్వహించిన రీఎగ్జామ్ రాయలేకపోయారు. చాలా కేంద్రాల్లో ఇదే సీన్ కనిపించింది. దేశ వ్యాప్తంగా పలు ఎగ్జామ్ కేంద్రాల్లో దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. రూల్స్ ప్రకారం మధ్యాహ్నం 1.30 వరకే సెంటర్ లోపలికి అభ్యర్థుల్ని అనుమతించారు. కొందరు తాము సరైన సమయానికే వచ్చినా ఎగ్జామ్ సెంటర్ లోపలికి అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Frequently Asked Questions

అజ్మీర్‌లోని నీట్ పరీక్షా కేంద్రం వద్ద జరిగిన సంఘటన ఏమిటి?

నీట్ రీఎగ్జామ్ కోసం బురఖా ధరించి వచ్చిన ఒక ముస్లిం విద్యార్థినిని అజ్మీర్‌లోని పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. బురఖా తొలగించమని సిబ్బంది కోరడంతో వివాదం తలెత్తింది.

విద్యార్థిని పరీక్ష రాయకుండా ఎందుకు వెనుదిరిగింది?

కుల్సుమ్ బానో అనే విద్యార్థిని బురఖా తీయమని సిబ్బంది కోరడంతో నిరాకరించింది. పరీక్ష కంటే తన మతాచారాలు, గుర్తింపే ముఖ్యమని చెప్పి పరీక్ష రాయకుండా వెనుదిరిగింది.

దుస్తుల కోడ్‌పై విద్యార్థిని వాదన ఏమిటి?

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మార్గదర్శకాల ప్రకారం మతపరమైన దుస్తులు ధరించి పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉందని ఆమె పేర్కొంది. మే 3న జరిగిన పరీక్షలో ఇదే దుస్తులతో అనుమతించారని చెప్పింది.

ఈ సంఘటనపై విద్యార్థిని తండ్రి ఎలా స్పందించారు?

ఆమె తండ్రి మహ్మద్ ఆలిమ్, ఎన్‌టీఏ రూల్ 18 ప్రకారం మతపరమైన దుస్తులకు అనుమతి ఉందని గుర్తుచేశారు. మహిళా సిబ్బందితో ప్రైవేటుగా తనిఖీ చేయించుకుంటామని చెప్పినా నిరాకరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget