అన్వేషించండి

NEET Re Exam 2026: నీట్ యూజీ రీ ఎగ్జామ్.. అభ్యర్థులకు NTA కీలక సూచనలు, వీటిని సెంటర్లోకి అనుమతించరు

పేపర్ లీక్ కావడంతో జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్-UG 2026 రీ-ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ పరీక్ష కోసం NTA కఠినమైన నిబంధనలు, ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నీట్ యూజీ పునఃపరీక్ష నేడు దేశవ్యాప్తంగా కట్టుదిట్టంగా ప్రారంభం.
  • గత పేపర్ లీక్ నేపథ్యంలో భారీ భద్రత, నిఘా చర్యలు.
  • అభ్యర్థులు 1:30 లోపు చేరి, గుర్తింపు కార్డు చూపాలి.
  • తేలికపాటి వస్త్రాలతో వచ్చి, పుకార్లు నమ్మవద్దని సూచన.

న్యూఢిల్లీ: నీట్ యూజీ 2026 పరీక్ష నేటి మధ్యాహ్నం ప్రారంభం కానుంది. ఇటీవల నిర్వహించిన ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన తర్వాత, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA), కేంద్ర ప్రభుత్వం నీట్ యూజీ మళ్లీ నిర్వహించాలని నిర్ణయించాయి. ఈసారి ఎగ్జామ్ నిర్వహణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్షా ఏజెన్సీ ఎన్టీఏ అభ్యర్థులకు కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. వాటిని ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

దేశంలోనే అతిపెద్ద మెడికల్ ప్రవేశ పరీక్ష NEET-UG 2026 రీ-ఎగ్జామ్ ఆదివారం, జూన్ 21న నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నీట్ యూజీ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు జరుగుతుంది. ఈ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా 551 నగరాల్లో,  విదేశాల్లోని 14 నగరాల్లో సుమారు 22.79 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారు. మే నెలలో నిర్వహించిన పరీక్షపై తలెత్తిన వివాదాల తర్వాత, ఈసారి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) భద్రత కోసం చాలా కఠినమైన ఏర్పాట్లు చేసింది. పరీక్షా కేంద్రాల్లో CCTV నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, పోలీసు భద్రతతో పాటు పటిష్ట చర్యలు తీసుకుంది. 

నీట్ యూజీ అభ్యర్థులకు కీలక సూచనలు 

 నీట్ యూజీ అభ్యర్థులు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల మధ్య పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. మధ్యాహ్నం 1:30 గంటల వరకే అభ్యర్థుల్ని ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత ఏ అభ్యర్థికీ పరీక్షాం కేంద్రంలోకి ప్రవేశం ఉండదని NTA స్పష్టం చేసింది.  చివరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా నిర్ణీత సమయానికి ముందే సెంటర్‌కు చేరుకోండి.


NEET Re Exam 2026: నీట్ యూజీ రీ ఎగ్జామ్.. అభ్యర్థులకు NTA కీలక సూచనలు, వీటిని సెంటర్లోకి అనుమతించరు

పరీక్షా కేంద్రానికి ఏమేం తీసుకువెళ్లాలి?

  • మీ అడ్మిట్ కార్డు ప్రింట్ కాపీ
  • ఒక వ్యాలిడ్ ఫోటో గుర్తింపు కార్డు (ఆధార్, పాన్, ఓటర్ ఐడి లాంటివి)
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటో
  • ట్రాన్సపరెంట్ వాటర్ బాటిల్ 
  • డయాబెటిస్‌తో బాధపడుతున్న అభ్యర్థులు నిబంధనల ప్రకారం షుగర్ టాబ్లెట్లు, పండ్లు (అరటిపండు, ఆపిల్, నారింజ మొదలైనవి) తమ వెంట తీసుకువెళ్లవచ్చు.


NEET Re Exam 2026: నీట్ యూజీ రీ ఎగ్జామ్.. అభ్యర్థులకు NTA కీలక సూచనలు, వీటిని సెంటర్లోకి అనుమతించరు

ఎలాంటి దుస్తులు ధరించి వెళ్లాలి?

  •   సాధారణ, తేలికపాటి దుస్తులు ధరించాలని అభ్యర్థులకు NTA సూచించింది.
  • హాఫ్ హ్యాండ్స్ దుస్తులు ధరించడం మంచిది.
  • భారీ ఎంబ్రాయిడరీ, పెద్ద బటన్లు లేదా ఎక్కువ జేబులు ఉన్న దుస్తులు ధరించకపోవడం బెటర్ .
  • సాధారణ చెప్పులు లేదా శాండల్స్ ధరించాలి
  • మెటల్ యాక్సెసరీస్ లాంటివి అసలు ధరించవద్దు.
  • మతపరమైన లేదా సాంప్రదాయ దుస్తులు ధరించే అభ్యర్థులు అదనపు తనిఖీ కోసం కొద్దిగా ముందుగానే ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవాలి.

సెంటర్ లోపల ఏం జరుగుతుంది?

ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతించే ముందు అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఆ తర్వాత ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణ జరుగుతుంది. సాంకేతిక కారణాలు, సరిగ్గాలేని వేలిముద్రలు లేదా UIDAI కనెక్టివిటీ సమస్యల కారణంగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ జరగకపోతే, అభ్యర్థిని పరీక్ష రాయకుండా ఆపబోమని NTA తెలిపింది. ఇలాంటి సందర్భాల్లో పత్రాల ఆధారంగా మాన్యువల్ వెరిఫికేషన్ చేయనున్నారు. 


నిఘా ఎలా ఉంటుంది?

  • ఈసారి పరీక్షకు నిఘా రెండు, మూడు లెవెల్స్‌లో ఉంటుంది.
  • దేశవ్యాప్తంగా 674 సిటీ కోఆర్డినేటర్లు, 6,669 అబ్జర్వర్‌లను నియమించారు.
  • అన్ని పరీక్షా కేంద్రాలు CCTV కెమెరాల నిఘాలో ఉంటాయి.
  • కంట్రోల్ రూమ్ నుండి లైవ్ మానిటరింగ్ జరుగుతుంది.
  • ప్రశ్నపత్రాలు, గోప్యమైన సామగ్రి సీల్డ్ భద్రతా వ్యవస్థలో పంపబడతాయి.
  • సామగ్రిని తీసుకువెళ్లే వాహనాలకు GPS ట్రాకింగ్ మరియు పోలీసు ఎస్కార్ట్ ఉంటుంది.
  • సోషల్ మీడియాపై కూడా ప్రత్యేక నిఘా ఉంచబడింది.

వదంతుల పట్ల జాగ్రత్తగా ఉండాలి

ప్రశ్నపత్రాల లీక్ లేదా పరీక్షలో అక్రమాలకు సంబంధించిన వదంతులను నమ్మవద్దనిఅభ్యర్థులకు NTA సూచించింది. అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాల గురించి అధికారులకు తెలియజేయాలని సూచించింది.

 

Frequently Asked Questions

నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది?

నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ జూన్ 21, ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు జరుగుతుంది. దేశవ్యాప్తంగా 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష నిర్వహించబడుతుంది.

రీ-ఎగ్జామ్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంది?

NTA పరీక్షా కేంద్రాల్లో CCTV నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, పోలీసు భద్రతతో పాటు కఠినమైన ఏర్పాట్లు చేసింది. ప్రశ్నపత్రాలు GPS ట్రాకింగ్‌తో, పోలీసు ఎస్కార్ట్‌తో పంపబడతాయి.

పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు ఏ సమయానికి చేరుకోవాలి?

అభ్యర్థులు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల మధ్య పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత ఎవరినీ లోపలికి అనుమతించరు.

అభ్యర్థులు ఎలాంటి దుస్తులు ధరించి పరీక్షకు హాజరు కావాలి?

అభ్యర్థులు సాధారణ, తేలికపాటి హాఫ్ హ్యాండ్స్ దుస్తులు ధరించాలి. భారీ ఎంబ్రాయిడరీ, పెద్ద బటన్లు లేదా ఎక్కువ జేబులు ఉన్న దుస్తులు ధరించకూడదు. సాధారణ చెప్పులు లేదా శాండల్స్ మాత్రమే ధరించాలి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Niti Aayog Report On Education:బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget